నౌకారవాణా మంత్రిత్వ శాఖ
'ఆత్మనిర్భర్ భారత్'కు దారితీసే పోర్టు ఆధారితఅభివృద్ధి
పీపీపీ విధానంలో మల్టీపర్పస్ క్లీన్ కార్గో నిర్వహణ కోసం గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్టు (కాండ్లా)లో 'బెర్త్ నెం.13' అభివృద్ధికి ఆమోదం
75,000 డిడబ్ల్యుటి వరకు నౌకల నిర్వహణకు రూ.168కోట్ల తో బెర్త్ అభివృద్ధి
ఓడరేవుల్లో పీపీపీ మోడల్ ఉండాలన్న ప్రధాని నరేంద్రమోదీ దార్శనికత మన ఓడరేవులను అంతర్జాతీయంగా పోటీపడేలా చేయడంలో ఒక విప్లవాత్మక ముందడుగు.ఈ ప్రాజెక్టు దీన్ దయాళ్ పోర్టు కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది,ఇది అంతిమంగా గుజరాత్, ఉత్తర - పశ్చిమ భారతదేశం నుండి వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది.": శ్రీ సర్బానంద సోనోవాల్
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2023 4:28PM by PIB Hyderabad
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డిబిఎఫ్ఓటి) ప్రాతిపదికన గుజరాత్ లోని కాండ్లా దీన్ దయాళ్ పోర్టులో కంటైనర్ కార్గోతో సహా మల్టీపర్పస్ క్లీన్ కార్గోను నిర్వహించడానికి 'బెర్త్ నెం.13' ను అభివృద్ధి చేయడానికి ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఒపి ఎస్ డబ్ల్యు) ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది.
రూ.167.88 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. వాటాదారులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు , సేవలను అందించడానికి ,లోతట్టు ప్రాంతాల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా ఎంఒపి ఎస్ డబ్ల్యు ద్వారా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడింది.
మల్టీపర్పస్ క్లీన్ కార్గో కోసం 4.20 ఎంఎంటిపిఎ , కంటైనర్ కార్గో కోసం 0.10 మిలియన్ టిఇయు (ఇరవై అడుగుల సమానమైన యూనిట్) సామర్థ్యంతో 75,000 డిడబ్ల్యుటి లేదా తత్సమాన టిఇయుల వరకు నౌకలను నిర్వహించడానికి ప్రతిపాదిత సదుపాయం ప్రణాళిక చేయబడింది.
పిపిపి విధానంలో డిబిఎఫ్ఓటి ద్వారా విజయవంతమైన బిడ్డర్ కు బెర్త్ కేటాయించడం ద్వారా, ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, సిలికా క్లే, రో-రో కార్గో, టింబర్ లాగ్స్, కంటైనర్ కార్గోతో సహా ప్రాజెక్ట్ కార్గో వంటి మల్టీపర్పస్ క్లీన్ కార్గోను నిర్వహించడానికి ఈ సదుపాయం ఉపయోగించబడుతుంది.
దేశంలో ఓడరేవు రంగం అభివృద్ధికి కట్టుబడి ఉండటంలో భాగంగా ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వ శాఖ గుజరాత్ లో సాగరమాల కార్యక్రమం కింద రూ.57,000 కోట్ల విలువైన 74 ప్రాజెక్టులను గుర్తించింది.
ఇందులో రూ.9 వేల కోట్ల విలువైన 15 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.25,000 కోట్లకు పైగా విలువైన 33 ప్రాజెక్టులు, రూ.22,700 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, మేజర్ పోర్టులు, స్టేట్ మారిటైమ్ బోర్డు, ఇతర రాష్ట్ర సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి.
*****
(రిలీజ్ ఐడి: 1906771)
సందర్శకుల సూచీ సంఖ్య : : 150