ఉక్కు మంత్రిత్వ శాఖ
జాతీయ ఉక్కు విధానం
प्रविष्टि तिथि:
13 MAR 2023 5:33PM by PIB Hyderabad
దేశ ముడి ఉక్కు సామర్థ్యం 2017-18లో 137.97 మిలియన్ టన్నుల (ఎంటీ) నుండి 2021-22లో 154.06 ఎంటీకి పెరిగింది. 2030-31 నాటికి ఇది 300 ఎంటీకి చేరుకుంటుంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడం ద్వారా 300 ఎంటీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలి. ఉక్కు ఉత్పత్తిదారులకు విధాన మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందించాలని 2017 జాతీయ ఉక్కు విధానం లక్ష్యంగా పెట్టుకుంది.
మిషన్ పూర్వోదయ కోసం గత మూడేళ్లుగా నిర్దిష్టమైన నిధులను కేటాయించలేదు.
ప్రభుత్వ రంగంలో ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్‌లో ఒక గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
కేంద్ర ఉక్కు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
******
(रिलीज़ आईडी: 1906769)
आगंतुक पटल : 208