రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్వదేశీ ప్రాజెక్టుల కారణంగా తగ్గిన రక్షణ ఉత్పత్తుల దిగుమతి

Posted On: 13 MAR 2023 2:56PM by PIB Hyderabad

స్వదేశీ ప్రాజెక్టుల కారణంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతి తగ్గింది. దేశంలో 155ఎమ్ఎమ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ 'ధనుష్', లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ 'తేజస్', సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ 'ఆకాష్', మెయిన్ బాటిల్ ట్యాంక్ 'అర్జున్', టి-90 ట్యాంక్, టి-72 ట్యాంక్, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్ 'బిఎమ్‌పి-II/IIK',  సు -30 ఎం కే 1, చీతా  హెలికాప్టర్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్, డోర్నియర్ డో-228, హై మొబిలిటీ ట్రక్స్, ఐఎన్ఎస్  కల్వరి, ఐఎన్ఎస్   ఖండేరి, ఐఎన్ఎస్   చెన్నై, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కొర్వెట్ (ASWC), అర్జున్ ఆర్మర్డ్ రిపేర్ అండ్ రికవరీ వాహనం, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్, 155 ఎంఎం మందుగుండు సామగ్రి కోసం బై -మాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్ (BMCS), మీడియం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ (MBPV), వెపన్ లొకేటింగ్ రాడార్ (WLR), ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS), సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలు (SDR), పైలట్‌లెస్ టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం లక్ష్య పారాచూట్, యుద్ధ ట్యాంకుల కోసం ఆప్టో ఎలక్ట్రానిక్ సైట్లు, వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, ఇన్‌షోర్ పెట్రోల్ వెసెల్, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్, ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్, ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ, 25 టి టగ్‌లు మొదలైనవి దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా తయారవుతున్నాయి.  

దేశంలో రక్షణ తయారీలో స్వావలంబన సాధించడం  కోసం  స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి మరియు రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేసిన  అనేక విధాన కార్యక్రమాలు, సంస్కరణల ఫలితంగా 

ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. రక్షణ రంగం అవసరాల కోసం అమలు చేస్తున్న   డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (DAP)-2020 కింద దేశీయ వనరుల నుంచి మూలధన వస్తువుల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వడం,రక్షణ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న 3738 ఉత్పత్తుల్లో  411 ఉత్పత్తులను నాలుగు  'దేశీయీకరణ జాబితా' , మూడు 'పాజిటివ్ ఇండిజినైజేషన్ జాబితా' లో చేరుస్తూ విడుదల అయిన  నోటిఫికేషన్, సుదీర్ఘ చెల్లుబాటు వ్యవధితో పారిశ్రామిక లైసెన్సింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం,  స్వయంచాలక మార్గంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విధానంలో మార్పులు తేవడం ఉత్పత్తి విధానాలను  సరళీకరణ చేయడం,  మిషన్ డెఫ్‌స్పేస్ ప్రారంభించడం,  అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈ ల సహకారంతో  ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX) పధకాన్ని ప్రారంభించడం,  పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ అమలు (మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత) ఆర్డర్ 2017, ఎంఎస్ఎంఈలతో సహా భారతీయ పరిశ్రమల ద్వారా స్వదేశీీకరణను సులభతరం చేయడానికి SRIJAN అనే స్వదేశీ పోర్టల్ ప్రారంభించడం,  అధిక అవకాశాలు  కేటాయించడం ద్వారా రక్షణ తయారీ కోసం పెట్టుబడిని ఆకర్షించడం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంపై ఒత్తిడి తగ్గించడానికి  ఆఫ్‌సెట్ విధానంలో సంస్కరణలు అమలు చేయడం, ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, పరిశ్రమ,అంకుర సంస్థలు,  విద్యాసంస్థల కోసం రక్షణ పరిశోధన,అభివృద్ధి (R&D)ని 25 శాతం రక్షణ బడ్జెట్‌ ప్రారంభించడం లాంటి చర్యల వల్ల దేశంలో రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి పెరిగింది. 

 స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి,  రక్షణ పరికరాల ఉత్పత్తి  ప్రోత్సహించడం ద్వారా  దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు, విధానాలు రూపొందించి అమలు చేస్తోంది.  2022 డిసెంబర్  వరకు అందుబాటులో ఉన్న సమాచారం  ప్రకారం 2018-19లో విదేశాల నుంచి దిగుమతి అవుతున్న రక్షణ పరికరాలపై చేస్తున్న వ్యయం  46% నుంచి 36.7%కి  తగ్గింది.

 

ఈ రోజు రాజ్యసభలో శ్రీ విజయ్ పాల్ సింగ్ తోమర్‌ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో రక్షణ శాఖ సహాయ మంత్రి   శ్రీ అజయ్ భట్ ఈ వివరాలు అందించారు. 

 

*****



(Release ID: 1906766) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Urdu , Tamil