పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కొంతకాలానికి 149 మంది ప్యాసెంజర్లను నోఫ్లై లిస్ట్‌లో చేర్పు
Posted On:
13 MAR 2023 3:14PM by PIB Hyderabad
విమానయాన సంస్త ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సూచనల మేరకు మూడేళ్ళకాలంలో, 2020 నుంచి నేటివరకు 149 మంది ప్రయాణీకులను నిర్దేశిత కాలానికి నో ఫ్లై లిస్ట్ లో (విమానయానానికి అనుమతి నిరాకరణ) ఉంచారు. గత మూడేళ్ళలో, అటువంటి ఒక్క కేసును కూడా ఉపసంహరించలేదు.
సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (సిఎఆర్- పౌర విమానయాన అవసరాలు) ప్రామాణిక కార్యాచరణ విధానాలలో, సెక్షన్ 3- ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, సిరీస్ ఎం, పార్ట్ VI లో హాండ్లింగ్ ఆఫ్ అన్‌రూలీ/ డిస్‌రప్టివ్ ప్యాసింజర్స్ ( అదుపుతప్పిన, మొండి/ విధ్వంసక ప్రయాణీకుల నిర్వహణ) ఈ రకంగా చెప్తుందిః
(1) పైలెట్- ఇన్- కమాండ్ నుంచి వచ్చిన అదుపుతప్పిన, మొండి ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదును, విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీకి ఆ విమానయాన సంస్థ పంపాలి.
(2) ఈ విషయంపై అంతర్గత కమిటీ 30 రోజులలోపు, అదుపుతప్పిన, మొండి ప్యాసెంజర్ ప్రవర్తనా స్థాయితో సహా నిర్ధారించి, సిఎఆర్ లోని నిబంధనల ప్రకారం ఆ ప్యాసెంజర్ విమానయానంపై నిషేధ వ్యవధిని నిర్ణయిస్తుంది.
(3) అంతర్గత కమిటీ నిర్ణయం పెండింగ్ లో ఉన్న సమయంలో విమానయాన సంస్థ 30రోజులకు మించికుండా అటువంటి ప్యాసింజర్‌పై ప్రయాణ నిషేధాన్ని విధించవచ్చు.
(4) అంతర్గత కమిటీ నిర్ణయానికి ఎయిర్‌లైన్ కట్టుబడి ఉండాలి. ఒకవేళ అంతర్గత కమిటీ 30 రోజులలోపు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే, ప్రయాణీకుడు స్వేచ్ఛగా విమానంలో ప్రయాణం చేయవచ్చు.
(5) విమానయాన సంస్థ అటువంటి మొండి, విధ్వంసక ప్రయాణీకుల డాటా బేస్‌ను (అంతర్గత కమిటీ నిర్ణయం అనంతరం) నిర్వహించి, ఆ సమాచారాన్ని డిజిసిఎ/ ఇతర విమానయాన సంస్థలకు అందించాలి.
(6) విమానయాన సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా, డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ద్వారా నో ఫ్లై లిస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
గత మూడేళ్ళలో, తన విధులను నిర్వహించడంలో విఫలమైనందున 03 నెలల పాటు ఒక పైలెట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఆ కేసును సమీక్షించలేదు లేదా ఎత్తివేయలేదు.
ఈ సమాచారాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్(డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) రాజ్యసభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు మంగళవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1906757)