జౌళి మంత్రిత్వ శాఖ
హాండ్లూం హాట్‌ను సందర్శించి, నేత, హస్తకళల ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించిన యుఎస్ వాణిజ్య మంత్రి గినా రైమాండో
చేనేత & చేతివృత్తుల సజీవతను వివరించి, ఆవృత్త, స్థిరతను నొక్కి చెప్పిన కేంద్ర రైల్వేలు, జౌళి శాఖ సహాయ మంత్రి
Posted On:
10 MAR 2023 4:54PM by PIB Hyderabad
న్యూఢిల్లీ జనపథ్‌లోని హ్యాండ్లూం హాట్‌ను శుక్రవారంనాడు సందర్శించిన సందర్భంగా యుఎస్ వాణిజ్యశాఖ మంత్రి గినా రైమాండో మగ్గం నేత, చేతివృత్తుల ప్రదర్శనను వీక్షించారు. ఆమెకు కేంద్ర రైల్వేలు, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోషి స్వాగతం పలికి, ఆతిథ్యమిచ్చారు. అక్కడ రైమాండో మహిళా చేతివృత్తిపనివారు & నేత పనివారితో ముచ్చటించి, జౌళి రంగంలో మహిళలు ప్రముఖంగా దోహదం చేస్తున్నందుకు ప్రశంసించారు.
వారంరోజుల వేడుకల కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విరాసత్- సెలిబ్రేటింగ్ శక్తి అన్న ఇతివృత్తంతో జౌళి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ జనపథ్‌లోని హాండ్లూం హాట్‌లో 6 నుంచి 12 మార్చి 2023 వరకు నిర్వహిస్తోంది.
భారతదేశపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం స్ఫూర్తికి అనుగుణంగా అనేక మంది జాతీయ అవార్డు పొందిన వారు సహా మహిళా చేనేత కారులు, చేతివృత్తిపనివారు, వాణిజ్యవేత్తలు & డిజైనర్లు 75 స్టాళ్ళను ఏర్పాటు చేశారు. చేనేత & చేతివృత్తుల సజీవతను గురించి, భారతీయ సాంస్కృతిక వారసత్వంలో వాటి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టి, ముఖ్యంగా మహిళలతో సహా అది పెద్ద సంఖ్యలో ప్రజలకు ఎలాంటి ఉపాధి మూలమో కేంద్ర రైల్వేలు & జౌళి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి యుఎస్ వాణిజ్య శాఖ మంత్రికి వివరించారు. చేతివృత్తులు, చేనేత వర్తులత్వత & సుస్థిరత గురించి ఆమె నొక్కి చెప్పారు.
జౌళిలో వర్తులరత అనేది టేక్- మేక్- డిస్పోజ్ లీనియర్ వాల్యూ చైన్ ( తెచ్చి- చేసి- విసర్జించడమనే వరుస విలువ లంకె)ను దీర్ఘకాలం ఎక్కువకాలం నిలుపుకునే వర్తులాకార వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పని చేస్తుంది. పునరుపయోగం, మరమ్మత్తు, తిరిగిఉపయోగించడం/ ఉత్పత్తి, అద్దె, పునః అమ్మకం వంటి భిన్న ఆవృత్త వ్యూహాలను ఉపయోగించడం ద్వారా విలువ ప్రవాహంలో వ్యర్ధాలను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరిస్తారు.
ఎస్‌డిజి కట్టుబాట్లకు అనుగుణంగా సుస్థిరత అన్నది ప్రాముఖ్యతను సంతరించుకుంది. సహజమైన స్థానిక ముడి పదార్ధం, సహజ రంగులు, పునరుపయోగ పదార్ధలు మొదలైన వాటి వినియోగంతో సుస్థిరతకు చేనేత, హస్తకళల పథనిర్ణేతగా ఉంది.
***
(Release ID: 1905818)