ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐటీ/ఐటీఈఎస్ హబ్ గా ఉన్న భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తదుపరి తరం సాంకేతిక ఉత్పత్తులు, పరికరాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందింది.. కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరులో జరిగిన డీప్ టెక్ సదస్సులో పాల్గొన్న మంత్రి
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి ఎక్కువ చేయడానికి, డీప్ టెక్ వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా కర్ణాటకలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఆపిల్-ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటుకు 300 ఎకరాల స్థలం కేటాయింపు.. శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ పరిశ్రమల రంగంలో కర్ణాటకకు చెందిన 18-20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ
Posted On:
09 MAR 2023 6:03PM by PIB Hyderabad
కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తూ ప్రగతి పథంలో నడుస్తున్నదని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్,ఐటీ శాఖ సహాయ ఎంట్రీ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. బెంగళూరులో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డీప్ టెక్ సదస్సులో ఈరోజు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎలక్ట్రానిక్స్ రంగంలో కేవలం డిజైన్ కు మాత్రమే కాకుండా ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి సాధించిందన్నారు.
'2014 వరకు ఐటీ రంగం కేవలం డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఐటీ వినియోగాన్ని కేవలం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమితం చేయకుండా ఇంటర్నెట్ కన్స్యూమర్ టెక్, ఏఐ, డేటా ప్లస్ ఎకానమీ, ఆటోమొబైల్, అంతరిక్ష రంగాలకు విస్తరించింది. అన్ని రంగాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నాయి. డీప్ టెక్ , ఎలక్ట్రానిక్స్, సెమి కండక్టర్ లాంటి రంగాల్లో భారతదేశం ఒక డిజైన్ కేంద్రంగా కాకుండా తదుపరి తరం సాంకేతిక ఉత్పత్తులు, పరికరాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందింది. భారతదేశం సాధించిన ప్రగతి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంకుర సంస్థల అభివృద్ధికి సహకరిస్తాయి.' అని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపిన శ్రీ చంద్రశేఖర్ దీనికోసం కేంద్ర బడ్జెట్ లో 8,000 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. ' అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరులు సిద్ధం చేసే విధంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. కేవలం కర్ణాటక రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల మంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రానున్న మూడు సంవత్సరాల కాలంలో బ్లూ కాలర్, సాంకేతిక ఉద్యోగాలు చేపట్టడానికి అవసరమైన శిక్షణ పొందుతారు' అని శ్రీ చంద్రశేఖర్ అన్నారు.
భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమిత కాదని మంత్రి స్పష్టం చేశారు. ' ఆవిష్కరణలు, సామర్థ్యం ఇకపై అభివృద్ధి చెందిన గురుగ్రామ్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు పరిమితం కాదు. చిన్న నగరాలతో సహా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయి' అని శ్రీ చంద్రశేఖర్ అన్నారు. టెక్నాలజీ హబ్ గా కర్ణాటక అభివృద్ధి సాదిస్తుందని మంత్రి అన్నారు. కర్ణాటక అభివృద్ధి సాధించడానికి బెంగుళూరుకు సమీపంలో ఏర్పాటు కానున్న ఆపిల్-ఫాక్స్ కాన్ ప్లాంట్ సహకరిస్తుందన్నారు. ఈ ప్లాంట్ కోసం ఇటీవల 300 ఎకరాల భూమి కేటాయించామన్నారు.
అంతకుముందు ఆరోగ్య సంరక్షణ రంగంలో సాధించిన ఆవిష్కరణలను అంకుర సంస్థలు ప్రదర్శించాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు పూర్తి సహకారం అందుతున్నదని సంస్థల ప్రతినిధులు మంత్రికి తెలిపారు. డీప్ టెక్నాలజీ అభివృద్ధి కోసం బెంగళూరు తో సహా కర్ణాటక ఇతర ప్రాంతాల్లో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
సాఫ్ట్ వేర్ -యాస్- ఎ-సర్వీస్ సోలుషన్స్ కి చెందిన కళావతి, గ్లోబల్ ఫౌండ్రీస్ భారత ఉపాధ్యక్షుడు శ్రీ జితేంద్ర చడ్డా తదితరులు పాల్గొన్నారు. సెమీ కండక్టర్ రంగం అభివృద్ధి కోసం భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ చడ్డా ప్రశంసించారు. ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సాధించాలని ఆయన అంకుర సంస్థలకు సూచించారు.
భారతదేశంలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ, పరీక్ష సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఐటీ మంత్రిత్వ శాఖ సిమెన్స్ హెల్తినీర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
***
(Release ID: 1905505)