శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్టార్టప్‌లలో ప్రాజెక్ట్ రూపొందించిన క్షణం నుండి సమాన లబ్దిదారులుగా ఉండే బాధ్యతను చేపట్టడానికి పరిశ్రమ సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ అందించిన అత్యంత నైపుణ్యం కలిగిన మానవశక్తి హైదరాబాద్ మరియు భారతదేశంలోని ఫార్మా మరియు బయోటెక్ పరిశ్రమకు ఒక వరం
హైదరాబాద్‌లోని సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో “ఒక వారం ఒక పరిశోధనా కేంద్రం” కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
ఎయిడ్స్ నియంత్రణ నిర్వహణకు అవసరమైన ఏ జెడ్ టీ వంటి ప్రాణాలను రక్షించే జెనరిక్ ఔషధాల కోసం సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని మరియు గ్యాస్ట్రిక్ అల్సర్‌లను నివారించడానికి, గర్భస్రావం వైద్య సహాయం, ప్రసవాన్ని ప్రేరేపించడానికి మరియు అబార్షన్‌ని ప్రేరేపించడానికి ఉపయోగించే ప్రోస్టాగ్లాండిన్ ఆధారిత ఔషధం, మిసోప్రోస్టోల్‌కు సంబంధించిన ప్రక్రియ అభివృద్ధి గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేసారు.
Posted On:
09 MAR 2023 10:33AM by PIB Hyderabad
ప్రాజెక్ట్‌ను రూపొందించిన క్షణం నుండి స్టార్టప్‌లలో సమాన లబ్దిదారులుగా ఉండే బాధ్యతను చేపట్టడానికి పరిశ్రమ సిద్ధంగా ఉండాలని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్‌లో అన్నారు. స్టార్టప్‌లను జీవనోపాధితో అనుసంధానించడం ద్వారా దీర్ఘకాలంలో నిలదొక్కుకోవడమే కాకుండా, సమకాలీన ప్రపంచ ప్రమాణాల ప్రకారం భారతీయ పరిశ్రమకు విలువ జోడింపును తీసుకురావడానికి కూడా ఇది చాలా అవసరం అని ఆయన అన్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐ ఐ సీ టీ ) లో పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు మరియు ఇన్నోవేటర్‌ల ప్రత్యేక సెషన్‌లో, అంతకుముందు ప్రముఖ పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో ఒక గంటకు పైగా పరస్పరం పరస్పరం సంభాషిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్ ఆరోగ్యం మరియు సంపద గమ్యస్థానంగా అలాగే ఈ ప్రాంత ఫార్మా రాజధానిగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, ఐఐసిటి అభివృద్ధి చేసిన ప్రత్యేక నైపుణ్యం కలిగిన మానవశక్తి హైదరాబాద్‌లోని ఫార్మా మరియు బయోటెక్ పరిశ్రమలో అలాగే సాధారణంగా సహజంగా భారతదేశంలో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆయన అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో, అనేక దశాబ్దాల తర్వాత మొదటిసారిగా, మనకు సమర్థ రాజకీయ నాయకత్వం మరియు సుపరిపాలనా యంత్రాంగం ఉంది. ఇది వాడుకలో లేని నిబంధనలను వదలివేయడానికి మరియు ప్రారంభ సౌలభ్యం కోసం సంస్కరణలను తీసుకురావడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార సౌలభ్యం కోసం సంస్థాగతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, విధానపరమైన జాప్యాలను నివారించడానికి అనవసరమైన నిబంధనలు తొలగించడానికి ఖచ్చితమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని పరిశ్రమ నాయకులకు ఆయన సూచించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని హైదరాబాద్ ఫార్మా సిటీ (HPC) ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఆర్ అండ్ బీ మరియు తయారీపై దృష్టి తో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ క్లస్టర్. ఈ క్లస్టర్‌కు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యతను బట్టి భారత ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)గా గుర్తించిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడిన హైదరాబాద్ ఫార్మా సిటీ ఔషధ విలువ గొలుసు అంతటా పరస్పర దోహద సహజీవనం యొక్క నిజమైన విలువను ఉపయోగిస్తుందని మంత్రి తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 సీ ఎస్ ఐ ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్) ల్యాబ్‌లలో ప్రతి ఒక్కటి విభిన్నమైన ప్రత్యేక రంగ కృషి కి అంకితం చేయబడింది . "ఒక వారం, ఒక ల్యాబ్" ప్రచారం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తోంది. వారు చేస్తున్న పనిని ప్రదర్శించడం ద్వారా ఇతరులు దానిని ఉపయోగించుకోవచ్చు మరియు లబ్దిదారులు దాని గురించి తెలుసుకుంటారు. వర్తమాన అవసరాలకు అనుగుణంగా నూతన పరివర్తన తో, సీ ఎస్ ఐ ఆర్ కోసం కొత్త ట్యాగ్‌లైన్ - “సీ ఎస్ ఐ ఆర్-ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా” రూపొందించామని అని ఆయన అన్నారు. 4,500 మందికి పైగా శాస్త్రవేత్తల సమూహంతో, సీ ఎస్ ఐ ఆర్ అమృత్ కాల్‌లో గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్‌గా ఉద్భవించగలదని మరియు పునరుజ్జీవింపజేయగలదని మంత్రి ఉద్ఘాటించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మే 2014 నుండి అన్ని వైజ్ఞానిక ప్రయత్నాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చురుకైన మరియు నిరంతర మద్దతుతో, భారతదేశం సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఎస్‌టిఐ) పర్యావరణ వ్యవస్థలో ప్రతి రోజు కొత్త శిఖరాలను ఎదుగుతోందని అన్నారు. 2015 వరకు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 130 దేశాల్లో మన దేశం 81వ స్థానంలో ఉన్నామని, అయితే 2022 నాటికి 40వ స్థానానికి చేరుకున్నామని, నేడు పీహెచ్‌డీల విషయంలో ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో భారత్ ఉందని, స్టార్టప్ ఎకోసిస్టమ్ పరంగా ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో మనం కూడా వున్నామని అని మంత్రి పునరుద్ఘాటించారు.
విద్యా మరియు పరిశోధనా సంస్థల అధిపతులు, వివిధ పరిశ్రమల (ఫార్మా, బయోటెక్, అగ్రో, పవర్), శాస్త్రవేత్తలు, సిబ్బంది, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మనం రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము “నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. మేము 8 దశాబ్దాలుగా ఎదురుచూసిన సీఎస్‌ఐఆర్‌కు ఇప్పుడు మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్ కలైసెల్వి నాయకత్వం వహిస్తున్నారు.
సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఇన్‌స్టిట్యూట్ ఏర్పడి దాదాపు 80 సంవత్సరాలు అవుతోంది, ప్రాథమిక మరియు అనువాద పరిశోధనలను తీవ్రంగా కొనసాగించింది మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా పని చేస్తోంది. రసాయన శాస్త్రం, రసాయన సాంకేతికతలకు సంబంధించిన ప్రాథమిక మరియు అనువర్తిత పరిశోధన రంగాలలో సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ అత్యుత్తమంగా ఉందని ఆయన తెలిపారు. "కాన్సెప్ట్ టు వాణిజ్యీకరణ" పద్ధతిలో పారిశ్రామిక ప్రాజెక్టులను చేపట్టేందుకు ఇన్‌స్టిట్యూట్ అత్యాధునిక పైలట్ ప్లాంట్ సౌకర్యాలను కలిగి ఉందని కూడా ఆయన తెలియజేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ ఏ సీ ఎల్ ద్వారా ఇటీవల ప్రారంభించబడిన హైడ్రాజైన్ హైడ్రేట్ ప్లాంట్‌ను సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ లో అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత ఆధారంగా రూపొందించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. బోవెన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వాయురహిత గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ (ఏజీఆర్) టెక్నాలజీ ఆధారిత ప్లాంట్ గురించి ప్రధాన మంత్రి తన ప్రముఖ నెలవారీ రేడియో కార్యక్రమం “మాన్ కీ బాత్”లో ప్రస్తావించారని ఆయన చెప్పారు.
ఎయిడ్స్ నిర్వహణలో అవసరమైన ఏ జెడ్ టీ వంటి ప్రాణాలను రక్షించే జెనరిక్ ఔషధాల కోసం సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ అనేక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని, ఇది ప్రపంచ మార్కెట్లో ఔషధ ధరను తగ్గించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.
కైక్సిన్ కోసం యాంటీ-వైరల్ డ్రగ్స్ , కోవిడ్-19 వ్యాక్సిన్ సహాయకులు వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన పరిష్కారాలను అతి తక్కువ సమయంలో సామాన్యులకు అందించేందుకు మహమ్మారి సమయంలో సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ పరిశ్రమతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 1990లో సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ సీ టీ కి మాంట్రియల్ ప్రోటోకాల్ తీర్మానాలను పరిష్కరించేందుకు స్థాపించబడిన జాతీయ ప్రయోగశాలలో ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్లోరో & ఆగ్రో కెమికల్స్ డిపార్ట్‌మెంట్ మొట్టమొదటిది. ఓజోన్ క్షీణత లో క్లోరోఫ్లోరో కార్బన్‌లకు (CFCలు) ప్రత్యామ్నాయాలుగా బాగా పరిగణించబడిన సిఫార్సు చేయబడిన హైడ్రోఫ్లోరోకార్బన్‌ల (HFCలు) కోసం స్వదేశీ మరియు అంతర్జాతీయంగా సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ఈ డిపార్ట్‌మెంట్ కు అప్పగించటం జరిగింది.
(Release ID: 1905337)
Visitor Counter : 210