ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ప్రజలకు అందుబాటులో ఉండే ఏఐ వ్యవస్థల్లో భారత ఏఐ వ్యవస్థ అతి పెద్దదిగా ఉంటుంది.. కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


మనీకంట్రోల్ ఇండియా ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొన్న శ్రీ చంద్రశేఖర్

ఫిన్ టెక్ తదుపరి తరం అవసరాలకు అవసరమైన సౌకర్యాలను భారతదేశ ఏఐ వ్యవస్థ అభివృద్ధి చేస్తుంది.. శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

భారతదేశ వ్యవస్థాపక శక్తి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ఫిన్‌టెక్ .. శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 07 MAR 2023 8:25PM by PIB Hyderabad

ఈ నెలాఖరులో ప్రారంభించనున్న ఇండియా ఏఐ కార్యక్రమం ప్రపంచంలో  ప్రజలకు అందుబాటులో ఉండే అతిపెద్ద  డేటాసెట్‌లలో ఒకటిగా ఉంటుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్,ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈరోజు ముంబైలో  జరిగిన మనీకంట్రోల్ ఇండియా ఫిన్‌టెక్ సదస్సులో  శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన శ్రీ చంద్రశేఖర్ భారతదేశ ఏఐ కార్యక్రమం తదుపరి తరం  ఫిన్‌టెక్ ,ఇంటర్నెట్ రంగాల అవసరాలు తీర్చే విధంగా ఉంటుందన్నారు. భారతదేశంలో ఫిన్‌టెక్ రంగం అభివృద్ధి, దేశ సాంకేతిక రంగంలో  ఫిన్‌టెక్  పాత్రను వివరించారు.

 

 ఫిన్‌టెక్ రంగం అభివృద్ధితో దశాబ్దాల తరబడి అపరిష్కారంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కలిగింది అని శ్రీ చంద్రశేఖర్ పేర్కొన్నారు.  ఫిన్‌టెక్ వల్ల  మధ్య దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్దిదారులకు చేరుతున్నాయని మంత్రి అన్నారు. 

 ఫిన్‌టెక్ వ్యవస్థలో యూనిఫైడ్ చెల్లింపుల వ్యవస్థ కీలకంగా ఉంటుందని పేర్కొన్న శ్రీ చంద్రశేఖర్ '  ఫిన్‌టెక్ అమలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా  ఫిన్‌టెక్ అమలుశాతం 67 గా ఉంది. భారతదేశంలో  ఫిన్‌టెక్ అమలు శాతం  87 వరకు ఉంది' అని శ్రీ చంద్రశేఖర్ వివరించారు. 

' 2014లో మన ఆర్థిక వ్యవస్థ రెండు అంకెల కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ భిన్న రంగాల్లో అభివృద్ధి పథంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తోంది.డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వినూత్న ఆవిష్కరణలతో అభివృద్ధి సాధిస్తుంది' అని శ్రీ చంద్రశేఖర్ అన్నారు. 

భారతదేశ వ్యవస్థాపక శక్తి, ఆత్మవిశ్వాసానికి ఫిన్‌టెక్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఫిన్‌టెక్ ద్వారా పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని భారత యువశక్తి చాటి చెబుతున్నదని మంత్రి అన్నారు. 

ఫిన్‌టెక్ రంగం అభివృద్ధికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని శ్రీ చంద్రశేఖర్ అన్నారు. ' వ్యవస్థ అభివృద్ధికి ఆటంకం కలిగించని విధంగా ప్రభుత్వం చట్టాలు రూపొందించి అమలు చేస్తోంది' అని మంత్రి అన్నారు.    

ఇండియా ఏఐ కార్యక్రమాన్ని ప్రస్తావించిన శ్రీ చంద్రశేఖర్ ' ప్రజలకు అందుబాటులో ఉండే ఏఐ వ్యవస్థల్లో భారత ఏఐ వ్యవస్థ అతి పెద్దదిగా ఉంటుంది.  ఫిన్‌టెక్, ఇంటర్నెట్ రంగాల అవసరాలు తీర్చేవిధంగా ఏఐ కార్యక్రమం అమలు జరుగుతుంది' అని మంత్రి అన్నారు. 

మంత్రి ప్రసంగం తర్వాత మనీ కంట్రోల్ ఎడిటోరియల్ సిబ్బంది తో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. 

***

 

 



(Release ID: 1905055) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi