మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
‘జన్ ఔషధి దివస్’ చివరి రోజు వేడుకలకు హాజరైన ఎం ఓ ఎస్ డాక్టర్. ఎల్. మురుగన్
Posted On:
07 MAR 2023 5:11PM by PIB Hyderabad
28.02.2023 నాటికి 9182 ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు (PMBJKలు) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/యూటీలలో దేశంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తున్నాయి.
జన్ ఔషధి ఔషధాల ధర కనీసం 50% మరియు కొన్ని సందర్భాల్లో, బ్రాండెడ్ ఔషధాల మార్కెట్ ధరలో 80% నుండి 90% వరకు చౌకగా ఉంటుంది.
పీ ఎం బీ జే పీ (PMBJP) యొక్క ఉత్పత్తులలో 1759 మందులు మరియు 280 సర్జికల్ & వినియోగ వస్తువులు పీ ఎం బీ జే కే ల ద్వారా అమ్మకానికి ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో 28.02.2023 వరకు, 565 కొత్త పీ ఎం బీ జే కే లు తెరవబడ్డాయి.
పీ ఎం బీ ఐ రూ. 1095 కోట్లు అమ్మకాల ద్వారా దాదాపు రూ. 6600 కోట్లు పౌరులకు ఆదా చేయడానికి దారితీసింది.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్ జన్ ఔషధి దివస్ చివరి రోజు వేడుకలను ప్రారంభించడానికి ఈరోజు న్యూఢిల్లీలోని ఐపెక్స్ భవన్‌ను సందర్శించారు.
28.02.2023 నాటికి, 9182 ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు (పీ ఎం బీ జే కేలు) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/యూటీలలో దేశంలోని అన్ని జిల్లాలలో ఉన్నాయి. జన్ ఔషధి ఔషధాల ధర కనీసం 50% మరియు కొన్ని సందర్భాల్లో, బ్రాండెడ్ ఔషధాల మార్కెట్ ధరలో 80% నుండి 90% వరకు తక్కువగా ఉంటుంది. పీ ఎం బీ జే పీ యొక్క ఉత్పత్తి బాస్కెట్‌లో 1759 మందులు మరియు 280 సర్జికల్ మరియూ వినియోగ వస్తువులు అమ్మకానికి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో 28.02.2023 వరకు, 565 కొత్త పీ ఎం బీ జే కే లు తెరవబడ్డాయి. పీ ఎం బీ ఐ రూ. 1095 కోట్ల అమ్మకాల ద్వారా దాదాపు రూ.6600కోట్లు పౌరులకు ఆదా చేయడానికి దారితీసింది.
న్యూఢిల్లీలో జన్ ఔషధి జన్ చేతన అభియాన్ వేడుకలను ప్రారంభించడానికి జన్ ఔషధి రథ్ ను కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జెండా ఊపి ప్రారంభించారు. దీనితో దేశవ్యాప్తంగా 5వ జన ఔషధి వేడుకలు ప్రారంభం అయ్యాయి
2023 జన్ ఔషధి దివస్ యొక్క మూడవ రోజు దేశవ్యాప్తంగా ‘జన్ ఔషధి - ఏక్ కదమ్ మాతృ శక్తి కి ఒరే’గా పాటించబడింది. అన్ని రాష్ట్రాలు/యూటీలలోని 34 ప్రదేశాలలో జన్ ఔషధి కేంద్రాల వద్ద మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు మరియు మహిళా లబ్ధిదారులు జన్ ఔషధి ఔషధాల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి సమాచారాన్ని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రుతుక్రమ ఆరోగ్యంపై ప్రత్యేక చర్చలు కూడా జరిగాయి. నిర్ణీత ప్రదేశాలలో 3500 మందికి పైగా మహిళలకు మహిళా సంభందిత ఉత్పత్తులతో కూడిన కిట్‌లు పంపిణీ చేయబడ్డాయి.
జన్ ఔషధి దివస్ 2023 నాల్గవ రోజును 'బాల మిత్ర దివాస్'గా జరుపుకున్నారు. ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) 5వ జన ఔషధి దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా వారోత్సవాలను నిర్వహించింది. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) యొక్క నాల్గవ రోజు కార్యక్రమాలు పిల్లలకు అంకితం చేయబడింది.
జన ఔషధి దివాస్ 2023లోఐదవ రోజున దేశవ్యాప్తంగా జన్ ఔషధి -జన ఆరోగ్య మేళాలు (ఆరోగ్య శిబిరాలు) మరియు హెరిటేజ్ వాక్‌లు (హెల్త్ వాక్ విరాసత్ కే సాథ్) నిర్వహించబడ్డాయి.
జన్ ఔషధి దివస్ 2023 యొక్క ఆరవ రోజు ఈరోజు "ఆవో జన్ ఔషధి మిత్ర బనేన్"గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జనరిక్ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మై గోవ్ (MyGov) ప్లాట్‌ఫారమ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ‘జన్ ఔషధి శపథ్’ డిజిటల్‌గా ప్రతిజ్ఞ చేశారు.
ఈ పథకం ప్రభుత్వ ఏజెన్సీలు అలాగే ప్రైవేట్ వ్యవస్థాపకులచే నిర్వహించబడుతుంది, ఇందులో నిర్దిష్ట బ్రాండింగ్ ఆధారిత రిటైల్ మెడికల్ అవుట్‌లెట్‌లను సరసమైన అల్లోపతి మందులను విక్రయించడానికి తెరుస్తారు. జనాభాలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వారికి నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూడడం, విద్య మరియు ప్రచారం ద్వారా జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం, నాణ్యత అధిక ధరకు మాత్రమే పర్యాయపదంగా ఉంటుందనే భావనను ఎదుర్కోవడం పీ ఎం బీ జే పీ కేంద్రాన్ని ప్రారంభించడంలో వ్యక్తిగత వ్యవస్థాపకులను నిమగ్నం చేయడం ద్వారా ఉపాధిని సృష్టించడం పరియోజన ముఖ్య లక్ష్యాలు.
"ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన", భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ విభాగం యొక్క ఒక గొప్ప చొరవ, సరసమైన ధరలో నాణ్యమైన మందులను అందించే ప్రయత్నంలో సామాన్య ప్రజలపై విశేషమైన ప్రభావాన్ని చూపడంలో విజయవంతమైంది. దుకాణాల సంఖ్య 9100 కంటే ఎక్కువ పెరిగింది మరియు 763 జిల్లాల్లో 743 జిల్లాలు ప్రస్తుతం కవర్ చేయబడ్డాయి. ఇంకా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో, పీ ఎం బీ జే పీ అమ్మకాలు రూ. 665.83 కోట్లు (MRP వద్ద). దీని వల్ల దేశంలోని సాధారణ పౌరులకు సుమారు రూ. 4000 కోట్లు ఆదా అవుతుంది
అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన జెనరిక్ ఔషధాలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)ని భారత ప్రభుత్వ రసాయనాలు మరియూ ఎరువుల మంత్రిత్వ శాఖ ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రారంభించింది. ఈ పథకం కింద, జనరిక్ ఔషధాలను అందించడానికి జనౌషధి కేంద్రాలు అని పిలువబడే ప్రత్యేక అవుట్‌లెట్‌లు తెరవబడ్డాయి. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక జన్ ఔషధి స్టోర్ ఉండాలనే లక్ష్యంతో జన్ ఔషధి పథకం నవంబర్, 2008లో ప్రారంభించబడింది.
***
(Release ID: 1904958)
Visitor Counter : 148