విద్యుత్తు మంత్రిత్వ శాఖ

భారతదేశం ఆధునిక మరియు చురుకైన విద్యుత్ సరఫరా వ్యవస్థ ను కలిగి ఉంటుంది; టాస్క్ ఫోర్స్ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది


విద్యుత్ శక్తి ఉత్పాదన లో ఎక్కువ పునరుత్పాదక శక్తిని కలపడం, ఇప్పటికే ఉన్న ప్రసార సామర్థ్యాన్ని మెరుగ్గా ఉపయోగించడం, తక్కువ అంతరాయాలు, సైబర్-దాడులు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి త్వరగా యధాతధ స్థితి కి రావటానికి భవిష్యత్ సంసిద్ధతో కూడిన విద్యుత్ ప్రసార వ్యవస్థ.

కృత్రిమ మేధ మరియు మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి భవిష్యత్ అంచనా నిర్వహణ సాంకేతికను ఉపయోగించే వ్యవస్థ; సరఫరా ఆస్తుల నిర్మాణం మరియు తనిఖీలో రోబోట్‌లు & డ్రోన్‌లు ఉపయోగించబడతాయి

24X7 నమ్మకమైన, సరసమైన విద్యుత్తు మరియు సుస్థిరత లక్ష్యాలను చేరుకోవాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి ఆధునిక సరఫరా గ్రిడ్ అవసరమని కేంద్ర విద్యుత్ మరియూ ఎన్ ఆర్ ఈ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ అన్నారు.

గుర్తించబడిన సాంకేతిక పరిష్కారాలను స్వీకరించడానికి అవసరమైన ప్రమాణాలు మరియు నిబంధనలను రూపొందించడానికి మరియు అత్యున్నత పనితీరు స్థాయిలను నిర్దేశంచడానికి సీ ఈ ఏ

Posted On: 07 MAR 2023 10:56AM by PIB Hyderabad

గ్రిడ్ యొక్క నిజ-సమయ పర్యవేక్షణ, స్వీయ నిర్వహణ, మెరుగైన పరిస్థితుల అంచనా, విద్యుత్ శక్తి లో పునరుత్పాదక విద్యుత్ శక్తి  వాటాను పెంచే సామర్థ్యం, ప్రసార సామర్థ్యం యొక్క మెరుగైన వినియోగం, సైబర్-దాడులు అలాగే ప్రకృతి వైపరీత్యాల సంధర్భంగా స్వీయ-దిద్దుబాటు వ్యవస్థల ద్వారా బలవంతంగా అంతరాయాలను తగ్గించడం కేంద్రీకృత మరియు డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం మొదలైన విశిష్ట అంశాలతో దేశం త్వరలో ఆధునిక మరియు తెలివైన చురుకైన విద్యుత్ సరఫరా వ్యవస్థను కలిగి ఉంటుంది.  వీటితో పాటుగా ఇతర సిఫార్సులు సెప్టెంబరు, 2021లో, సీ ఎం డీ పవర్ గ్రిడ్ అధ్యక్షతన సరఫరా రంగాన్ని ఆధునీకరించడానికి మరియు తెలివైన భవిష్యత్తు సిద్ధత గల మార్గాలను సూచించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఉన్నాయి .  టాస్క్ ఫోర్స్‌లోని ఇతర సభ్యులలో స్టేట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీస్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీస్, ఎం ఓ ఈ టీ వై, ఐ ఐ టీ కాన్పూర్, ఎన్ ఎస్ జీ పీ ఎం యూ  మరియు ఈ పీ టీ ఏ ప్రతినిధులు ఉన్నారు.

 

గత వారం కేంద్ర విద్యుత్ మరియూ ఎన్ ఆర్ ఈ మంత్రి శ్రీ ఆర్ కే. సింగ్ అధ్యక్షతన జరిగిన చర్చల తర్వాత కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఈ సమావేశంలో ప్రజలకు 24x7 నమ్మకమైన మరియు సరసమైన విద్యుత్‌ను అందించడానికి మరియు సుస్థిరత లక్ష్యాలను చేరుకోవాలనే ప్రభుత్వ దార్శనికతను సాధించడానికి ఆధునిక విద్యుత్ సరఫరా గ్రిడ్ చాలా అవసరమని మంత్రి నొక్కిచెప్పారు. సైబర్ దాడులు మరియు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పూర్తి స్వీయ-దిద్దుబాటు వ్యవస్థ , డిజిటల్‌గా నియంత్రించబడే, వేగంగా ప్రతిస్పందించే గ్రిడ్ అవసరం అని శ్రీ సింగ్ అన్నారు. గ్రిడ్‌ను రక్షించడానికి మరియు పెద్ద అంతరాయం ఏర్పడకుండా నిరోధించడానికి, ఏదైనా ఆకస్మిక సందర్భంలో నిర్దిష్ట ప్రాంతాలను విడిగా ఉండేలా ఇటువంటి వ్యవస్థ నిర్ధారిస్తుంది అని మంత్రి చెప్పారు. టాస్క్ ఫోర్స్ యొక్క ప్రయత్నాలను అభినందిస్తూ, దేశంలో బలమైన మరియు ఆధునిక ప్రసార నెట్‌వర్క్‌ను నిర్మించడానికి గుర్తించిన సాంకేతిక పరిష్కారాలను స్వీకరించడానికి మరియు బెంచ్‌మార్క్ పనితీరు స్థాయిలను నిర్ధారించడానికి అవసరమైన ప్రమాణాలు మరియు నిబంధనలను రూపొందించాలని శ్రీ సింగ్ సీ ఈ ఏ ని ఆదేశించారు.

 

టాస్క్ ఫోర్స్ తన నివేదికలో పలు సాంకేతిక మరియు డిజిటల్ పరిష్కారాలను సిఫార్సు చేసింది, వీటిని రాష్ట్ర ప్రసార గ్రిడ్‌లను భవిష్యత్తులో సిద్ధంగా ఉంచడానికి అవలంబించవచ్చు. ఈ సిఫార్సులు ప్రస్తుత ప్రసార వ్యవస్థ యొక్క ఆధునీకరణ వర్గాల క్రింద చేర్చబడ్డాయి; నిర్మాణం & పర్యవేక్షణ, కార్యకలాపాలు & నిర్వహణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం; స్మార్ట్ & ఫ్యూచర్-రెడీ ట్రాన్స్మిషన్ సిస్టమ్; మరియు శ్రామిక శక్తి యొక్క నైపుణ్యం. కేంద్రీకృత రిమోట్ మానిటరింగ్, స్కాడా, ఫ్లెక్సిబుల్ ఏ సీ ట్రాన్స్‌మిషన్ పరికరాలు , డైనమిక్ లైన్ లోడింగ్ సిస్టమ్ (DLL), వైడ్ ఏరియా మెజర్‌మెంట్ సిస్టమ్ (WAMS)ని ఉపయోగించి పీ ఎం యూ (PMU)లు మరియు డేటా అనలిటిక్‌లు, హైబ్రిడ్ ఏ సీ / హెచ్ వీ డీ సీ  సిస్టమ్‌తో సహా సబ్‌స్టేషన్ల ఆపరేషన్, కేంద్రీకృత రిమోట్ మానిటరింగ్‌ని టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది. ఏ ఐ / ఎం ఎల్ అల్గారిథమ్‌లు, హెచ్ టీ ఎల్ ఎస్ కండక్టర్‌లు, ప్రాసెస్ బస్ బేస్డ్ ప్రొటెక్షన్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ జీ ఐ ఎస్/హైబ్రిడ్ సబ్‌స్టేషన్, సైబర్ సెక్యూరిటీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మరియు డ్రోన్స్ & రోబోట్‌లను ట్రాన్స్‌మిషన్ అసెట్స్ యొక్క నిర్మాణం/తనిఖీని ఉపయోగించి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ టెక్నిక్స్, రోబోట్‌ల ఉపయోగం మానవ జోక్యాన్ని తగ్గించడం మరియు ప్రాణహాని/ప్రమాదాలను తగ్గించడమే కాకుండా నిర్మాణం మరియు నిర్వహణ సమయంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంతోపాటు సమయాన్ని ఆదా చేస్తుంది. గ్లోబల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీల పనితీరు ఆధారంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ లభ్యత మరియు వోల్టేజ్ నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ బెంచ్‌మార్క్‌లను కూడా సిఫార్సు చేసింది.

 

స్వల్పకాలిక నుండి మధ్యకాలిక సిఫార్సులు 1-3 సంవత్సరాలలో అమలు చేయబడతాయి, దీర్ఘకాలిక జోక్యాలను 3-5 సంవత్సరాల వ్యవధిలో అమలు చేయాలని ప్రతిపాదించబడింది.

***



(Release ID: 1904873) Visitor Counter : 186