ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా (సీజీఏ) బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎస్‌.ఎస్‌. దూబే

Posted On: 06 MAR 2023 7:50PM by PIB Hyderabad

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా (సీజీఏ) శ్రీ ఎస్‌.ఎస్‌. దూబే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా శ్రీ దూబే విధులు నిర్వర్తిస్తారు.

1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ఐసీఏఎస్‌) అధికారి శ్రీ దూబే. 06 మార్చి 2023 నుంచి అమలులోకి వచ్చేలా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా నియమితులయ్యారు. సీజీఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్‌) అడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా సేవలు అందించారు.

అంతకుముందు, కేంద్ర గృహ నిర్మాణ & పట్టణ వ్యవహారాల శాఖలో, పారిశ్రామిక విధానం &ప్రోత్సాహం విభాగంలో చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌గా, పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెవెన్యూ విభాగం, సరఫరాల విభాగంలో కంట్రోలర్/డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌గా, బడ్జెటింగ్, అకౌంటింగ్, చెల్లింపులు, అంతర్గత ఆడిట్ మొదలైనలో ఇన్‌ఛార్జ్‌గా శ్రీ దూబే బాధ్యతలు నిర్వహించారు. దేవస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్ & చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడు.

కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌ మీద గృహ నిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ & ఆర్థిక సలహాదారుగా శ్రీ దూబే పని చేశారు. ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌), సీడబ్ల్యూసీని (పీఎస్‌యూ) పర్యవేక్షించారు.

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ వంటి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఎబీసీసీ, హుడ్కో, అనేక రాష్ట్రాల మెట్రో రైల్ కార్పొరేషన్ల బోర్డుల్లో శ్రీ దూబే భారత ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా సేవలు అందించారు.

శ్రీ దూబేకు ఐక్యరాజ్యసమితిలో ఐదు సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం కూడా ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం కోసం న్యూదిల్లీలో సేకరణలు & రవాణా అధిపతిగా సేవలు అందించారు.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) అంటే అకౌంటింగ్ విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి 'ముఖ్య సలహాదారు'. సాంకేతికంగా మంచి మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్ వ్యవస్థను స్థాపించడం, నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ ఖాతాల తయారీ & సమర్పణకు సీజీఏ బాధ్యత వహిస్తుంది. ఖజానా నియంత్రణ, కేంద్ర ప్రభుత్వం కోసం అంతర్గత ఆడిట్‌ల నిర్వహణను కూడా సీజీఏ చూసుకుంటుంది.

 

****


(Release ID: 1904763) Visitor Counter : 223


Read this release in: English , Urdu , Hindi