ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ప్రపంచ బుక్ ఫెయిర్ 2023లో ‘ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ’పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


పరిశోధన ఆధారంగా రూపొందిన పత్రాలు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారతదేశం అందించ గల అవకాశాలను ప్రపంచానికి తెలియజేసే మాధ్యమంగా పనిచేస్తాయి.. డాక్టర్ మాండవీయ

కోవిడ్-19 సమయంలో సాంప్రదాయ మూలాలు వారసత్వం ఆధారంగా భారతదేశం ప్రణాళిక అమలు చేసి విజయం సాధించింది... మాండవీయ

" కోవిడ్ నివారణ కోసం భారతదేశం అమలు చేసిన టీకా కార్యక్రమం 3.4 మిలియన్ల మంది ప్రాణాలు రక్షించి మార్గదర్శక విధానంగా గుర్తింపు పొందింది." .. డాక్టర్ మాండవీయ

Posted On: 04 MAR 2023 11:10PM by PIB Hyderabad

కేంద్ర అదనపు కార్యదర్శి శ్రీ సజ్జన్ సింగ్ యాదవ్ రచించిన 'ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ - ఫ్రమ్ కౌ పాక్స్ టు వ్యాక్సిన్ మైత్రి' పుస్తకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శన 2023లో ఈరోజు ఆవిష్కరించారు.కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడంలో భారతదేశం సాధించిన అద్భుతమైన విజయాన్ని శ్రీ సజ్జన్ సింగ్ యాదవ్ తన పుస్తకంలో వివరించారు.కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఇతర సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల శక్తి సామర్ధ్యాలపై అపారమైన నమ్మకం కలిగి ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రణాళిక రూపొందించారని డాక్టర్ మాండవీయ అన్నారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తమపై ప్రధానమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సవాళ్లను అధిగమించి ఇంతకు ముందు ఏ దేశం సాధించని ఘనత భారతదేశం సాధించేలా కృషి చేశారన్నారు. శాస్త్రవేత్తలు,ఆరోగ్య రంగ నిపుణులు చేసిన కృషి వల్ల దేశ అవసరాలకు సరిపోయే టీకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్‌లను సరఫరా చేయగల టీకాలను నిర్ణీత సమయంలో సరఫరా చేస్తోందని మంత్రి తెలిపారు. . ఆరోగ్య సంరక్షణ నిపుణులు అచంచలమైన అంకితభావంతో పనిచేశారని ప్రశంసించిన డాక్టర్ మాండవీయ "దేశంలో ఎటువంటి కొరత లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ టీకా కార్యక్రమంలో భారతదేశం 2.2 బిలియన్ డోస్‌లను అందించింది. దీనివల్ల 3.4 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను ప్రభుత్వం రక్షించింది." అని అన్నారు. ఇతర దేశాలు టీకా పట్ల అపోహతో ఉన్న సమయంలో భారతదేశం టీకా అనుకూల కోవిడ్ నిర్వహణ నమూనా రూపొందించి అమలు చేసిందని మంత్రి వివరించారు. 

 "వ్యాక్సిన్ పై జరిగిన పరిశోధన, తయారీ, టీకా కార్యక్రమం వివరాలను పుస్తకంలో సవివరంగా వివరించారు. పుస్తకం కేవలం మహమ్మారి సంక్షోభాన్ని మాత్రమే కాకుండా 2500 సంవత్సరాల వ్యాక్సిన్ చరిత్రను కూడా వివరిస్తుంది." అని డాక్టర్ మాండవీయ అన్నారు. “పరిశోధన ఆధారంగా రూపొందిన పత్రాలు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారతదేశం అందించ గల అవకాశాలను ప్రపంచానికి తెలియజేసే మాధ్యమంగా పనిచేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రచయితలు పనిచేయాలి. పరిశోధన ఆధారంగా రూపొందిన పత్రాలు భారతదేశ వారసత్వ సంపదకు నిదర్శనంగా ఉంటాయి. కోవిడ్-19 సమయంలో భారతదేశం అనుసరించిన విధానం సాంప్రదాయ మూలాలపై ఆధారపడి రూపొందింది." అని డాక్టర్ మాండవీయ అన్నారు. . " వారసత్వం జ్ఞానాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది. కాల పరీక్ష తట్టుకుని భారతదేశ వారసత్వం జ్ఞానం నిలిచింది. సంక్షోభ సమయాల్లో వారసత్వం జ్ఞానం ఆదర్శప్రాయంగా నిలిచింది " అని ఆయన వివరించారు. మహమ్మారి సంక్షోభ సమయంలో భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు అనుసరించాయని పేర్కొన్న డాక్టర్ మాండవీయ దీనికి ఉదాహరణ 'నమస్తే' అని అన్నారు. “మన ప్రజలు మన వారసత్వాన్నిశోధించాలి. శాస్త్రీయఅంశాల ఆధారంగా జరిగే పరిశోధనతో సంప్రదాయాల విలువ తెలుస్తుంది. భారతదేశం అనుసరించిన సంప్రదాయం ప్రపంచ దేశాల గుర్తింపు పొందింది." అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. . 

మరుగున పడిన, మరచిపోయిన భారతదేశం సంప్రదాయాలు, వారసత్వ సంపద అంశాలను క్రోడీకరించి పరిశోధన-ఆధారిత పుస్తకాలు సిద్ధం చేయాలని రచయితలకు మంత్రి సూచించారు.

టీకా సహకారంతో 12 రకాల వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు.సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న భారతదేశం తల్లులు, యువకులు,నవజాత శిశువులకు అందజేస్తుందని అన్నారు.

 

“ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ- కౌ పాక్స్ టు వ్యాక్సిన్ మైత్రి" పుస్తకం భారతదేశం అమలు చేసిన టీకా కార్యక్రమాన్ని వివరిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా భారతదేశం అమలు చేసిన కార్యక్రమం గుర్తింపు పొందింది. టీకా పట్ల నెలకొన్న అపోహలు, టీకా తీసుకోవాలన్న ఆత్రుత, లభ్యత, రవాణా సమస్యలు, అందరికీ టీకా అందుబాటులోకి తేవడం,సమర్ధ సమాచారం, శీతలీకరణ సౌకర్యాలు, టీకా కేంద్రాలు లాంటి అనేక సంక్లిష్ట, బహుముఖ సవాళ్ల నేపథ్యంలో అమలు జరిగిన టీకా కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరిగి విజయవంతం అయ్యింది. ఈ అంశాలను తన పుస్తకంలో ప్రస్తావించిన రచయిత భవిష్యత్తు ఎదురయ్యే సవాళ్లు, అభివృద్ధి సాధించడానికి భారతీయ వ్యాక్సిన్ పరిశ్రమకు గల అవకాశాలను తన పుస్తకంలో వివరించారు. కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం మరియు పంపిణీ చేయడంలో భారతదేశం సాధించిన అద్భుతమైన విజయాన్ని కూడా ఇది లోతుగా ప్రస్తావించారు. .

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీ లోక్ రంజన్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గోవింద్ ప్రసాద్ శర్మ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

***

 



(Release ID: 1904365) Visitor Counter : 121


Read this release in: English , Urdu