వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయం లో కనీసం 25% సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులలో జరగాలి: వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి


‘‘మేలైన విత్తనాలు, పని ఖర్చులను తగ్గించడం, నిల్వ - రవాణా మెరుగుపరచడం , మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పించడం అనే రైతుల సంక్షేమ నాలుగు దశ లను ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకున్నారు,”

ప్రతి ఐ సి ఎ ఆర్ సంస్థ రైతుల ప్రయోజనాల కోసం ఏటా శిక్షణా కార్యక్రమం : డి ఎ ఆర్ ఇ అండ్ డైరెక్టర్ జనరల్, ఐ సి ఎ ఆర్ డాక్టర్ హిమాన్షు పాఠక్

‘మిల్లెట్స్ (శ్రీ అన్న) ద్వారా .
‘పోషకాహారం, ఆహారం, పర్యావరణ భద్రత’ అనే అంశంపై ముగిసిన మూడు రోజుల పూసా కృషి విజ్ఞాన మేళా

Posted On: 04 MAR 2023 9:06PM by PIB Hyderabad

మిల్లెట్స్ (శ్రీ అన్న) ద్వారా ‘పోషకాహార, ఆహార పర్యావరణ భద్రత' అనే ఇతివృత్తం తో మూడు రోజుల (02-04 మార్చి, 2023) పూసా కృషి విజ్ఞాన మేళా ఢిల్లీ లోని ఐ సి ఎ ఆర్ - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, క్యాంపస్‌లో జరిగింది. కేంద్ర వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి, శ్రీ కైలాష్ చౌదరి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఐ సి ఎ ఆర్ - ఐ ఎ ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ సింగ్ ముఖ్య అతిథికి, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహిళా రైతులతో సహా ఆరుగురు ఫెలో రైతులు , 42 మంది ఇన్నోవేటివ్ రైతులను  ఐ ఎ ఆర్ ఐ  ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు’తో సత్కరించారు.

 

  

శ్రీ కైలాష్ చౌదరి తన ప్రసంగంలో, భారతదేశ వ్యవసాయ ఉత్పత్తి 2013-14లో 265 మిలియన్ టన్నుల నుండి గత సంవత్సరం 315 మెట్రిక్ టన్నులకు పెరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 324 మెట్రిక్ టన్నులకు చేరుకోనుందని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం నాలుగు దశలను లక్ష్యంగా పెట్టుకున్నారని, అవి నాణ్యమైన విత్తనాలు, పని ఖర్చులను తగ్గించడం, నిల్వ /  రవాణాను మెరుగుపరచడం , మార్కెట్‌ సౌలభ్యం కల్పించడం , రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను అందించడం అని ఆయన వివరించారు.

 

వ్యవసాయ భూమిలో కనీసం 25% వ్యవసాయం సేంద్రీయ , సహజ వ్యవసాయ పద్ధతులపై జరిగేలా చూడాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఐ సి ఎ ఆర్ ను కోరిందని శ్రీ చౌదరి చెప్పారు. పోషకాహార భద్రత కోసం వివిధ రకాల చిరు ధాన్యాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కొత్త , వినూత్న వ్యవసాయ సాంకేతికతలు ఆహారం , పర్యావరణ భద్రత ప్రధాన పాత్రను ఆయన పునరుద్ఘాటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, పంటల రకాలు రైతులకు చేరువ కావాలని, రైతుల విశ్వాసాన్ని చూరగొనేందుకు రైతుల పొలాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.

చిన్న సన్నకారు. రైతుల ఆదాయం పెంచడానికి .ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, సేంద్రియ వ్యవసాయం, సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకం (పరంపరగత్ కృషి వికాస్ యోజన) వంటి వివిధ పథకాల కింద వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ చౌదరి చెప్పారు.

 

ఈ సందర్భంగా ఐ సి ఎ ఆర్ సెక్రటరీ, డేర్ అండ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాల కోసం ప్రతి ఐ సి ఎ ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఏటా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రకటించారు. ప్రగతి ప్రకృతి చేయి చేయి కలిపి కలసి సాగాలి, - అని ఆయన అన్నారు. ఇటీవల  ఐ సి ఎ ఆర్ - ఐ ఎ ఆర్ ఐ ని సందర్శించిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పూసా క్యాంపస్‌లో సుమారు రెండు గంటలు గడిపి, భారతదేశ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రపంచంలోనే నెం.1 అని ట్వీట్ చేశారని డాక్టర్ పాఠక్ చెప్పారు.

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు పూసా కృషి విజ్ఞాన మేళా-2023ని సందర్శించారు. వాతావరణాన్ని తట్టుకోగలిగే గోధుమలు, ఆవాలు, కాయధాన్యాలు, చిక్‌పీయా, కూరగాయలు, పూలు ,పండ్ల పంటల ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా ప్రయోజనం పొందారు. సమీకృత వ్యవసాయ పద్ధతి నమూనాపై ఉపయోగకరమైన ముందస్తు విజ్ఞానాన్ని పొందారు. డాక్టర్ రవీంద్ర నాథ్ పడారియా, జాయింట్ డైరెక్టర్ (ఎక్స్‌టెన్షన్), డాక్టర్ జెపిఎస్ దబాస్, ఇన్‌ఛార్జ్, క్యాటాట్, ఐసిఎఆర్-ఐఎఆర్‌ఐ, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ కు చెందిన అనేక సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. మూడు రోజుల ఈ మెగా రైతు మేళాలో మిల్లెట్స్ (శ్రీ అన్న) పై ప్రత్యేక ఎగ్జిబిషన్లతో పాటు, , రైతు స్నేహపూర్వక సాంకేతికతలు, ఆవిష్కరణలు , ఉత్పత్తుల ను ప్రదర్శించారు.

 

*****



(Release ID: 1904344) Visitor Counter : 145


Read this release in: English , Urdu