శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రవాస బారతీయు లకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వైభవ్ ఫెలోషిప్ లు అందించే కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ప్రపంచశ్రేణి ప్రాజెక్టులు, ఉత్పత్తుల రూపకల్పనకు దేశీయ మేధావులు, విదేశాలలోని భారత సంతతి మేధావులు కలసికట్టుగా కృషి చేసేందుకు నిర్దేశించిన ఫెలోషిప్ వైభవ్ : డాక్టర్ జితేంద్ర సింగ్
రాగల 25 సంవత్సరాల అమృత్ కాల్ లో భారత్ దేశ శాస్త్ర సాంకేతిక సామర్ధ్యం భారత ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్తును నిర్వచించి , నిర్దేశిస్తుందన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Posted On:
28 FEB 2023 6:21PM by PIB Hyderabad
ప్రవాస బారతీయు కోసం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర) మంత్రి, భూ విజ్ఞాన శాస్త్ర(స్వతంత్ర),ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది , ప్రజాఫిర్యాదులు, పెన్షన్, అణు ఇంధనం, రక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వైభవ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు.
విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్, వైబవ్ ఫెలోషిప్ భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో పరిశోధన వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు దీనిని ఉద్దేశించినట్టు చెప్పారు. దీనిద్వారా భారతీయ విద్యాసంస్థలు, ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల మధ్య సహకారానికి, ఫాకల్టీ, పరిశోధకులు విదేశాలనుంచి ఇండియాకు రావడానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రవాస భారత మేధావులు, భారతదేశంలోని మేధావులతో కలిసి ప్రపంచశ్రేణి ప్రాజెక్టులు చేపట్టడానికి, ఉత్పత్తులు తయారుచేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు.
ఇందుకు దరఖాస్తు చేసుకునే వారు ప్రవాస బారతీయులై(ఎన్.ఆర్.ఐ) కానీ భారత సంతతి వారు కాని, విదేశాల లోని భారత పౌరులు కానీ అయి ఉండాలి. వీరు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి, ఎండి, ఎంస్ డిగ్రీ పొంది ఉండాలి. దీనికి తోడు దరఖాస్తుదారుడు విదేశీ విద్యా సంస్థలో లేదా పరిశోధన, పారిశ్రామిక సంస్థలో పరిశోధన, అభివృద్ధిలో మంచి పనితీరు కనబరుస్తున్న వ్యక్తి అయి ఉండాలి. . వీరు భారతదేశంలోని ఏదైనా పరిశోధన సంస్థ, విద్యాసంస్థలో సంవత్సరానికి ఒకటినుంచి రెండు నెలల కాలం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
.ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014 వ సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి , ప్రభుత్వ ప్రాధాన్యతలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వశాఖ లక్ష్యాలలో, ఇతర విభాగాలైన అంతరిక్షశాస్త్రం, అణుఇంధనం, భూ విజాఞన శాస్త్రం లక్ష్యాలలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. దేశంలో ప్రతిభావంతులకు, సమర్థత కలిగిన వారికి కొరత లేదని అన్నారు.2014 లో విధాన ప్రణాళిక స్థాయి నుంచి రాజకీయ వ్యవహారాల వరకు అన్నింటా మార్పు కనిపిస్తోందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటివరకూచేసిన 8 స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగాలలో అద్భుతమైన శాస్త్ర విజ్ఞాన చర్యలను ప్రకటించారన్నారు. 2014 ఆగస్టు 15న ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ మిషన్‌ను ప్రకటించారని, అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించినపుడు గ్రామీణప్రాంతాలలోని ప్రజలు ఎంతో ఊపిరిపీల్చుకున్నారని ఆయన తెలిపారు. ప్రత్యేకించి యువత, మహిళలు ఆరోగ్యం,పరిశుభ్రతకు సంబంధించి దీనిని కొనియాడారన్నారు.అలాగే ప్రధానమంత్రి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కార్యక్రమాలను ప్రకటించారన్నారు.
వీటిని 2015 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించారన్నారు. ఆ తర్వాత డిజిటల్ ఇండియా మిషన్ ప్రకటించారని ఇది ప్రత్యక్ష నగదు బదిలీకి , జెఎఎం ట్రినిటీకి , యుపిఐకి వీలు కల్పించిందన్నారు. ఆ తర్వాత గగన్‌యాన్ మిషన్, డిజిటల్ హెల్త్, డీప్ సీ మిషన్, ను ప్రకటించారని, గత సంవత్సరం వినూత్న ఆవిష్కరణలకు పిలుపునిచ్చారని, జైజవాన్, జై కిసాన్, జైవిజ్నాన్ జై అనుసంధాన్ నినాదం ఇచ్చారన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి, ప్రస్తావించారన్నారు. 2021,2022 ప్రసంగాలలో ఆయన డీప్ సీ మిషన్ గురించి తెలిపారన్నారు.
గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ కు సంబంధించి 130 దేశాల జాబితాలో మనం 2015 వరకు 81 స్థానంలో ఉండేవారమని, అయితే 2021 నాటికి మన పరిస్థితి గణనీయంగా మెరుగుపడి 40కి చేరిందన్నారు.ప్రస్తుతం భారతదేశం, పిహెచ్‌డి ల విషయంలో ప్రపంచంలోని తొలి మూడు స్థానాలలో ఉందని, స్టార్టప్ వాతావరణంలో ప్రపంచంలో ముందువరుసలో ఉన్న మూడు దేశాల లో ఉందని అన్నారు. పబ్లికేషన్ల సంఖ్య విషయంలో కూడా దేశ పనితీరు మెరుగుపడిరదన్నారు. నేషనల్ సైన్స్ డాటాబేస్ గణాంకాలప్రకారం 2013లో మన దేశం ఈ విషయంలో 6 వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఇది 3 వ స్థానానికి చేరిందన్నారు. ఇక పేటెంట్స్ విషయానికి వస్తే, దేశీయ పేటెంట్ ఫైలింగ్‌ల విషయంలో 9వ ర్యాంకులో ఉందని, అలాగే 2013లో పరిశోధన పత్రాల నాణ్యత విషయంలో మన దేశం 2013లో 13 వ ర్యాంకులో ఉండగా ఇది ఇప్పుడు 9 వ ర్యాంకుకు చేరిందన్నారు.
భారతదేశపు శాస్త్ర పరిశోధన శక్తి రాగల 35 సంవత్సరాల అమృత్ కాల్‌లో దేశ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించనున్నదని చెప్పారు.భారతప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ గా ఉన్న ప్రొఫెసర్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ, ఈ ఏడాది సైన్స్‌డే నినాదం, ప్రపంచ శాస్త్ర విజ్ఞానం ప్రపంచ సంక్షేమం కోసం గా ఉందన్నారు. భారతదేశపు జి`20 అధ్యక్షతకు అనుగుణంగా డాక్టర్‌జితేంద్ర సింగ్ ఈ నినాదం అందుకున్నారన్నారు. భారత దేశం జి`20 దేశాలు, ఇతర దేశాలతో కలిసి శాస్త్ర విజ్ఞాన ప్రగతికి కట్టుబడి ఉందని అన్నారు.
భారతదేశ ఆర్థిక ప్రగతికి సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు కీలక స్తంభాలుగా ఉన్నాయన్నారు.
డిఎస్‌టి కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేయడంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. భారత ప్రభుత్వం సైన్స్ విభాగాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు కేటాయింపులు పెంచినట్టు చెప్పారు.
మాజీ పిఎస్‌ఎ ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్, డిబిటి, కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, భూ విజ్ఞాన మంత్రిత్వ
శాఖకుచెందిన ఎం.రామచంద్రన్, మాజీ కార్యదర్శులు, శాస్త్రవేత్తలు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.
***
(Release ID: 1903515)
Visitor Counter : 145