కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'క్యాప్టివ్ నాన్-పబ్లిక్ నెట్‌వర్క్ ప్రొవైడర్' సేవల కోసం బీఎస్‌ఎన్‌ఎల్-టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం
Posted On:
28 FEB 2023 7:16PM by PIB Hyderabad
ఖాతాదారు సంస్థలకు 'క్యాప్టివ్ నాన్-పబ్లిక్ నెట్‌వర్క్' (సీఎన్‌పీఎన్) సేవలను అందించడం కోసం 'టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్'తో (టీసీఐఎల్) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో (బీఎస్‌ఎన్‌ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.
మొబైల్ సాంకేతికత రంగంలో విశేష అనుభవం ఉన్న టీసీఐఎల్, ఖాతాదారు సంస్థలకు బలమైన ఎండ్-టు-ఎండ్ ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్ పరిష్కారాలను అందిస్తుంది. సురక్షితమైన, విశ్వసనీయమైన, తక్కువ జాప్యం, అధిక నాణ్యమైన ప్రసారాలను అందించడం ద్వారా పారిశ్రామిక రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు 5జీ వల్ల ప్రారంభం అవుతాయి.
4జీ/5జీ నెట్‌వర్క్‌ల కోసం స్వదేశీ ఉప వ్యవస్థల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది. అయితే, అవి విజయవంతం కావడానికి, మార్కెట్‌తో మమేకం కావడానికి, ఖాతాదార్ల అవసరాలను తీర్చగల వాణిజ్యపరమైన పరిష్కారాల తరహాలో వాటిని ఏకీకృతం చేయాలి. సీఎన్‌పీఎన్ నెట్‌వర్క్‌ల్లో విదేశీ తయారీ ఉత్పత్తులతో పాటు స్వదేశీ ఉత్పత్తులను కూడా ఉత్తమంగా ఉపయోగించుకునేలా టీసీఐఎల్ నిర్ధరిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/పీఎస్‌యూ కార్యాలయాలు, పరిశ్రమలు, గనులు, చమురు శుద్ధి కర్మాగారాలు, విమానాశ్రయాల్లో ప్రైవేట్ 5జీని అమలు చేయాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 1903305)
Visitor Counter : 164