పర్యటక మంత్రిత్వ శాఖ
దేఖో అప్నా దేశ్ చొరవ కింద బాబా సాహెబ్ అంబేడ్కర్ యాత్ర టూర్ ప్యాకేజీని నిర్వహించనున్న ఐఆర్‌సిటిసి
ప్రతిపాది 07 రాత్రులు, 08 రోజుల భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణం ఢిల్లీ నుంచి ప్రారంభం అవుతుంది
Posted On:
24 FEB 2023 4:54PM by PIB Hyderabad
డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ జీవితంతో సంబంధం కలిగి ఉన్న కొన్ని ప్రముఖ స్థలాలను ఆవరిస్తూ రూపొందించిన దేఖో అప్నా దేశ్ చొరవ కింద బాబా సాహెబ్ అంబేడ్కర్ యాత్రను ఐఆర్‌సిటిసి నిర్వహించనుంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ యాత్ర తొలి ప్రయాణం ఏప్రిల్ 2023లో న్యూఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. దేఖో అప్నా దేశ్ చొరవ కింద ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) కలిసి భారతదేశవ్యాప్తంగా ఉన్న సర్క్యూట్‌ల ఆధారంగా వివిధ ఇతివృత్తాలతో భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్ళను రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ప్రతిపాదిత 07 రాత్రులు, 08 రోజులు సాగనున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ టూరు ఢిల్లీలో ప్రారంభం అయ్యి, బాబా సాహెబ్ జన్మస్థలమైన (భీమ్ జన్మభూమి) మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్ (మావ్) తొలి హాల్ట్ను కలిగి ఉంటుంది. తర్వాత రైలు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు ప్రయత్నిస్తుంది, అక్కడ నుంచి పర్యాటకులు నవయాన బౌధ్ధ స్మారక చిహ్నాన్ని ప్రతిష్ఠించిన దీక్షా భూమిని సందర్శించేందుకు వెళతారు. సాంచి వెళ్ళేందుకు నాగపూర్ నుంచి రైలు బయలుదేరుతుంది. సాంచిలో ని సందర్శనా స్థలాల్లో బౌద్ధ స్థూపాన్ని, ఇతర బౌద్ధ ప్రదేశాలలోనూ చూస్తారు. సాంచి తర్వాత గమ్యం వారణాసి, ఇక్కడ పర్యాటకులు సార్‌నాథ్ & కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతిమ గమ్యంగా గయ ఉండనుంది. అక్కడ పర్యాటకులను ప్రముఖ మహాబోధి ఆలయాన్ని, ఇతర బౌద్ధ మఠాలను సందర్శించేందుకు పవిత్ర క్షేత్రమైన బోధగయకు తీసుకువెడతారు. రాజ్‌గిర్, నలంద, ఇతర ప్రముఖ బౌధ్ధ ప్రదేశాలను కూడా రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. ఈ పర్యటన అంతిమంగా న్యూఢిల్లీలో ముగుస్తుంది. పర్యాటకులకు ఢిల్లీలో, మథుర, ఆగ్రా, కంటోన్మెంట్ స్టేషన్లలో రైలును ఎక్కేందుకు/ దిగేందుకు ఎంపిక ఉంటుంది.
బాబా సాహెబ్‌గా పిలుచుకునే డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. దానితో పాటుగా, ఆయన ప్రముఖ న్యాయనిపుణుడు, రాజకీయ కార్యకర్త, ఆంథ్రొపాలజిస్ట్, రచయిత, వక్త, చరిత్రకారుడు, రచయిత, ఆర్థికవేత్త, మేధావి. తన జీవితకాలమంతా అస్పృశ్యత వంటి సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు పోరాడటమే కాక సామాజికంగా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిలబడ్డారు. ఐఆర్‌సిటి రూపకల్పన చసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ యాత్ర అన్నటూర్ లక్ష్యం అంబేడ్కర్ జీవితంతో ముడిపడిన ప్రదేశాలు, గమ్యస్థానాలను పట్టిచూపడం.
దేశీయ పర్యాటకంలో ప్రత్యేక ఆసక్తి కలిగిన సర్క్యూట్‌లను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ అయిన దేఖో అప్నా దేశ్‌కు అనుగుణంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ రైలును ఐఆర్‌సిటిసి నిర్వహిస్తోంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ యాత్రకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఐఆర్‌సిటి వెబ్‌సైట్ ః https://www.irctctourism.comలో అందుబాటులో ఉండనున్నాయి.
***
(Release ID: 1902312)
Visitor Counter : 160