పర్యటక మంత్రిత్వ శాఖ
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (పర్యాటక మంత్రిత్వ శాఖ), జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం
హాస్పిటాలిటీలో జాను ఐస్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్ ఆశించే వారందరికీ బహుమతిగా ఉపయోగించడం మరియు పిజి డిగ్రీ ప్రోగ్రామ్‌ల గుర్తింపు
Posted On:
23 FEB 2023 10:00PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ గా నోయిడాలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ సమక్షంలో అవగాహన ఒప్పందం పై జేఎన్‌యూ వైస్ వైస్ ఛాన్సలర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సంతకం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం ఆతిథ్య రంగంలో యూజీ, పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఈఐటీ) ప్రదానం చేసే డిగ్రీలకు 2023-24 విద్యా సంవత్సరం నుంచి జేఎన్‌యూ గుర్తింపు లభిస్తుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీ కిషన్ రెడ్డి గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని అర్హతలు ఎన్‌సీహెచ్‌ఈఐటీ కలిగి ఉందన్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలోకి ప్రవేశించే ఔత్సాహికులకు జేఎన్‌యూ గుర్తింపు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. కోవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నదన్నారు. తాజా జీ-20 సమావేశాలు భారత పర్యాటక రంగాన్ని పునరుజ్జీవింప చేసేందుకు దోహదపడ్డాయని శ్రీ కెసిహన్ రెడ్డి తెలిపారు. జీ-20 సదస్సులో భాగంగా దేశవ్యాప్తంగా పలు దేశాల ప్రతినిధులతో సుమారు 250 సమావేశాలు జరుగుతాయని మంత్రి వివరించారు.
అతిథి దేవో భవ అన్న భారత సాంప్రదాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని అతిధులకు ఆతిధ్యం ఇచ్చి జీ-20 దేశాల్లో భారత ఆతిథ్య రంగానికి గుర్తింపు తేవాలని మంత్రి సూచించారు. పర్యాటక రంగానికి బ్రాండింగ్ లభించేలా ఎన్‌సీహెచ్‌ఈఐటీ, జేఎన్‌యూ పరిశోధనలు చేపట్టాలని మంత్రి సూచించారు. హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో టూరిజం క్లబ్‌లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపిన శ్రీ కిషన్ రెడ్డి ఇప్పటికే 5000 క్లబ్‌లను ప్రారంభించామని చెప్పారు.
పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మాట్లాడుతూ పరిశోధన విద్యా రంగంలో జేఎన్‌యూ గుర్తింపు సాధించిందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా జేఎన్‌యూ ర్యాంకింగ్ మరియు గుర్తింపు పొందిందన్నారు. జేఎన్‌యూ, ఎన్‌సీహెచ్‌ఈఐటీ ల మధ్య కుదిరిన ఒప్పదం వల్ల ఐఐహెచ్ఎం విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఒప్పందంలో భాగంగా పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు సవరించి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఏర్పాటైన కార్యక్రమంలో పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, జేఎన్‌యూ అధికారులు, హోటల్ / ఆతిథ్య పరిశ్రమకు చెందిన నిపుణులు, ఐహెచ్ఎం లకు చెందిన విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌సీహెచ్‌ఈఐటీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తూ తనకు అనుబంధంగా ఉన్న ఐహెచ్ఎం సంస్థల ద్వారా ఆతిథ్య రంగంలో విద్య, శిక్షణ కార్యక్రమాలు అందిస్తూ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఎన్‌సీహెచ్‌ఈఐటీ కి అనుబంధంగా పనిచేస్తున్న దాదాపు 95 సంస్థలు బి.ఎస్సీ, హెచ్ హెచ్ఏ, ఎం.ఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. జేఎన్‌యూ గుర్తింపు వల్ల ఈ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
ఆతిథ్య, సేవా రంగాలకు అవసరమైన నైపుణ్యం, వ్యాపార మెళుకువలు, యాజమాన్య అంశాలతో బి.ఎస్సీ, హెచ్ హెచ్ఏ కోర్సు రూపొందించారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జూనియర్ మేనేజ్మెంట్, సూపర్వైజర్, ఆపరేషనల్ స్థాయిలో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన అర్హత పొందుతారు. కాలక్రమేణా ఆతిథ్య రంగంలో అగ్రస్థానానికి వెళతారు.
నిర్వహణ పరిశోధన అంశాలతో ఎం.ఎస్సీ హెచ్ఏ కోర్సు నిర్వహిస్తున్నారు. మేనేజ్మెంట్ స్థాయిలో పని చేయడానికి లేదా అధ్యాపక వృత్తి చేపట్టడానికి విద్యార్థులు ఈ కోర్సులో ఎక్కువగా చేరుతున్నారు.
ఎన్‌సీహెచ్‌ఈఐటీ కి అనుబంధంగా పనిచేస్తున్న ఉన్న ఐహెచ్ఎంలు 2021 సంవత్సరానికి "సిఇఒ వరల్డ్" ఉత్తమ ఆతిథ్యం, హోటల్ మేనేజ్మెంట్ సంస్థలకు ఇచ్చిన గుర్తింపులో భారతదేశంలో అగ్రస్థానం, ప్రపంచంలో 14 వ స్థానంలో ఉన్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) భారతదేశంలో ప్రముఖ అగ్రగామి విశ్వవిద్యాలయం. బోధన,పరిశోధన రంగాల్లో జేఎన్‌యూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) 3.91 గ్రేడ్ పాయింట్లు (4 స్కేల్ పై) సాధించిన జేఎన్‌యూ భారతదేశంలోమొదటి స్థానంలో నిలిచింది. భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలకు 2016 లో ఇచ్చిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో జేఎన్‌యూ 3 వ స్థానంలో, 2017 లో 2 వ స్థానంలో నిలిచింది. 2017 లో భారత రాష్ట్రపతి ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డును కూడా జేఎన్‌యూ అందుకుంది. 1966 లో పార్లమెంటు చట్టం ద్వారా జేఎన్‌యూ ఏర్పాటయింది. , విశ్వవిద్యాలయం ఆలోచనలు సాహసం, ప్రయోగాలు, ఎడతెగని అన్వేషణ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న జేఎన్‌యూ వైవిధ్యభరిత మేధో అన్వేషణకు ప్రాధాన్యత ఇస్తోంది.
జెఎన్‌యు, ఎన్‌సిహెచ్‌ఎంసిటి ల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఎన్‌సిహెచ్‌ఎంసిటి యుజి & పిజి డిగ్రీ ప్రోగ్రామ్‌లకు జెఎన్‌యు లభిస్తుంది. ఎన్‌సిహెచ్‌ఎంసిటి కి అనుబంధంగా పనిచేస్తున్న ఐహెచ్‌ఎంల విద్యార్థులు జెఎన్‌యు నుండి డిగ్రీని పొందుతారు. దీనివల్ల భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా మెరుగైన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో చేరడానికి ప్రయోజనం చేకూరుస్తుంది. విదేశీయులు, ఎన్ఆర్ఐలు ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు పొందడం వల్ల ఐహెచ్‌ఎంలకు ప్రయోజనం చేకూరుతుంది. విద్య పూర్తి చేసుకున్న వారికి దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో ఉద్యోగాలు లభించడానికి వీలవుతుంది.
***
(Release ID: 1902301)