ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ ఎకోసిస్టమ్’ను ప్రారంభించిన శ్రీ అశ్విని వైష్ణవ్


ప్రభుత్వం చొరవగా టెలికాం తయారీ, వందే భారత్ అభివృద్ధిలో ఇదొక విజయం - శ్రీ అశ్విని వైష్ణవ్

భారతదేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి లేకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ నిలకడగా ఉండదు - శ్రీ అల్కేష్ కుమార్ శర్మ

Posted On: 18 FEB 2023 8:57PM by PIB Hyderabad

కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నిన్న ఢిల్లీలో ‘సెమీకాన్ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ ఎకోసిస్టమ్’ని ప్రారంభించారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ; సెమి అధ్యక్షుడు, ఐఎస్ఎం అడ్వైజరీ బోర్డు సభ్యుడు శ్రీ అజిత్ మనోచా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ అమితేష్ కుమార్ సిన్హా, ఇతర సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమ నుండి ప్రతినిధులు, సంభావ్య సెమీకాన్ పెట్టుబడిదారులు,  విద్యావేత్తలు కూడా పాల్గొన్నారు. 

 

WhatsApp Image 2023-02-18 at 8.59.39 PM.jpeg

సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న శ్రీ అశ్విని వైష్ణవ్

 

శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, టెలికాం తయారీలో సాధించిన విజయాన్ని, ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ అభివృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశ్రమ అభివృద్ధికి కావలసిన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం అందరి అభిప్రాయాలను స్వీకరించడానికి సంసిద్ధతతో ఉందని అన్నారు. 'మీ విజయం, మా విజయం మరియు ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ విజయం' అని కేంద్ద్ర మంత్రి తెలిపారు. 

శాఖ కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ సభికులకు  స్వాగతం పలికారు. ఆటోమోటివ్, పవర్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిలో మొత్తం ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా భారత్‌లో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ నిలకడగా ఉండదని ఆయన అన్నారు. 
భారతదేశం 'ఆజాదికా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటుంది.  జీ20 అధ్యక్షత స్థానాన్ని చేపట్టింది, ఐఎస్ఎం సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని బలోపేతం చేయడానికి, భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ మ్యాప్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లలో భారతదేశాన్ని ప్రపంచంలోని విశ్వసనీయ భాగస్వామిగా చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేస్తూ, అవసరమైన తయారీ సామర్థ్యాలు, సుస్థిర వ్యూహాలతో సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, ఇతర సౌకర్యాల స్థాపనను ప్రోత్సహించడానికి, ఈ సదస్సును నిర్వహించే చొరవను ఐఎస్ఎం తీసుకుంది.
ఈ సదస్సులో విస్తృతంగా అనేక అంశాలను స్పృశిస్తూ గోష్టి కార్యక్రమాలు జరుగుతాయి. 
i) భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థపై ప్యానెల్ చర్చ; 
ii) సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని సులభతరం చేయడంపై మెకిన్సే సీనియర్ భాగస్వామి మార్క్ పటేల్ ప్రెజెంటేషన్ 
iii) ఎల్ అండ్ టీ, పిడిఎఫ్ సోలుషన్స్ , మైక్రాన్, జాకబ్స్,లిండే భాగస్వామ్యంతో ఫ్యాబ్ నిర్మాణం అవసరమైన రసాయనాలు, వాయువుల లభ్యత గురించి ప్యానెల్ చర్చ 
iv) జయ జగదీష్, ఎస్ వి పి ఇండియా ద్వారా నైపుణ్యం, విజన్‌పై ప్రదర్శన; 
v) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల నుండి ప్యానెలిస్ట్‌లతో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, సంసిద్ధతకు సంబంధించిన ప్యానెల్ చర్చ; 
vi) పరిశ్రమల సవాళ్లకు సంబంధించిన ప్యానెల్ చర్చ

 

 

***



(Release ID: 1900536) Visitor Counter : 163


Read this release in: English , Urdu