అణుశక్తి విభాగం
దేశ రాజధాని న్యూఢిల్లీకి ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో హర్యానా లో గోరఖ్ పూర్ పట్టణంలో ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు... డాక్టర్ జితేంద్ర సింగ్
ఇంతకు ముందు ఎక్కువగా దక్షిణ లేదా పశ్చిమ భారత రాష్ట్రాలకు పరిమితం అయిన అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను దేశంలో మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి
Posted On:
18 FEB 2023 3:42PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఇది ఒకటి
బహుముఖ అవసరాల కోసం భారతదేశ అణు సామర్థ్యాన్ని ఎక్కువ చేయాలన్న ప్రధాని మోడీ సూచనకు అనుగుణంగా గోరఖ్ పూర్ ప్లాంట్ ఏర్పాటు డాక్టర్ సింగ్ .. .
10 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది..డాక్టర్ సింగ్ హైదరాబాద్, ఫిబ్రవరి 19:
దేశ రాజధాని న్యూఢిల్లీ కి 150 కిలోమీటర్ల దూరంలో హర్యానా రాష్ట్రంలో ఉన్న గోరఖ్ పూర్ పట్టణంలో ఉత్తర భారతదేశ మొట్టమొదటి అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు అవుతుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి,అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ అంశాన్ని వెల్లడించారు. దేశంలో ఇంతవరకు అణు విద్యుత్ కేంద్రాలు దక్షిణ లేదా పశ్చిమ దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే, కేవలం దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఈ నిర్ణయం అతి ముఖ్యమైనదని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
భారత్ అణు సామర్థ్యాన్ని పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యానికి అనుగుణంగా గత ఎనిమిదేళ్లలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని జితేంద్ర సింగ్ తెలిపారు. 10 అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడానికి అవసరమైన అనుమతులను శ్రీ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి అవసరమైన సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనికోసం ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ లను ఏర్పాటు చేయడానికి భారత అణుశక్తి విభాగానికి అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో గోరఖ్ పూర్ గ్రామ సమీపంలో గోరఖ్ పూర్ అణు విద్యుత్ పరియోజన (జిహెచ్ఎవిపి) ప్లాంట్ నిర్మాణ దేశంలో ఉంది. దీనిలో సాంకేతిక పరిజ్ఞానం తో అభివృద్ధి చేసిన 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (పిహెచ్ డబ్ల్యుఆర్) యూనిట్లు ఏర్పాటు అవుతాయి.
ప్లాంట్ నిర్మాణానికి 20,594 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. మొత్తం కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు రూ.4,906 కోట్లు ఖర్చు చేశారు (మొత్తం ఆర్థిక పురోగతి 23.8 శాతం).
ఫైర్ వాటర్ పంప్ హౌస్ (ఎఫ్ డబ్ల్యుపిహెచ్), భద్రతా పరమైన పంప్ హౌస్ (ఎస్ ఆర్ పిహెచ్), ఇంధన నిల్వ ప్రాంతాలు 1,2, వెంటిలేషన్ స్టాక్, ఓవర్ హెడ్ ట్యాంకు , స్విచ్ యార్డ్ కంట్రోల్ బిల్డింగ్, సేఫ్టీ సంబంధిత,నాన్ సేఫ్టీ సంబంధిత కాల్వలు, కందకాలు, రిటైనింగ్ గోడలు, గార్లాండ్ డ్రెయిన్ వంటి ప్రధాన ప్లాంట్ భవనాలు/నిర్మాణాల నిర్మాణం వేగంగా సాగుతోంది.
టర్బైన్ బిల్డింగ్-1,2, 220 కె వి స్విచ్ యార్డ్ , ఐడిసిటి-1ఎ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి భూమి సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఐడిసిటి , 400 కేవీ స్విచ్ యార్డ్, ఎమర్జెన్సీ వాటర్ పాండ్, స్టేషన్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఐడిసిటి ప్యాకేజీ , టర్బైన్ ఐలాండ్ ప్యాకేజీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు స్థలాన్ని అప్పగించారు.
ప్రైమరీ కూలెంట్ పంపులు, కాలాండ్రియా, రియాక్టర్ హెడ్, ఇంధనం నింపే యంత్రాలు, మోడరేటర్ మరియు ఇతర D20 హీట్ ఎక్స్ఛేంజర్ లు లాంటి ప్రధాన దీర్ఘకాలిక తయారీ సైకిల్ పరికరాలు/కాంపోనెంట్ ల కొరకు కొనుగోలు ఆర్డర్ లు జారీ అయ్యాయి. మొదటి యూనిట్ కోసం ఎండ్ షీల్డ్ లు, స్టీమ్ జనరేటర్ లు ఇప్పటికే నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాయి. ఇతర పరికరాల తయారీ వివిధ దశల్లో ఉంది . నిర్మాణ ప్రణాళికకు నిర్ణీత సమయానికి ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఆపరేషనల్ శీతలీకరణ నీటి అవసరాలు తీర్చడానికి తోహానా నుండి జిహెచ్ఎవిపి వరకు హర్యానా ఇరిగేషన్ & వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చేపట్టిన కందకం నిర్మాణం సంతృప్తికరంగా సాగుతోంది.
***
(Release ID: 1900534)
Visitor Counter : 456