కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సేవలలో నాణ్యతను సమీక్షించిన ట్రాయ్


- అయాచిత వాణిజ్య కమ్యూనికేషన్‌లపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రాయ్

Posted On: 18 FEB 2023 2:26PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్న్యూఢి్ల్లీలో ప్రధాన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో (టీఎస్పీఎస్సమావేశాన్ని నిర్వహించింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న టెలికాం సేవల నాణ్యత మరియు అయాచిత వాణిజ్య కమ్యూనికేషన్ (యుసీసీముప్పుకు సంబంధించిన సమస్యలను సమీక్షించిందిసేవల నాణ్యత, వినియోగదారులు తమ టెలికాం సేవల అనుభవ నాణ్యతలో మెరుగుదలని ప్రదర్శించడానికి తగని చర్యలు తీసుకోవాలని టి.ఎస్.పీలను అథారిటీ ఆదేశించిందివినియోగదారులు ఎదుర్కొంటున్న కాల్ మ్యూటింగ్, వన్ వే స్పీచ్ సమస్యను విశ్లేషించిప్రాధాన్యతపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని టీ.ఎస్.పి.లను కోరారు. 5జీ నెట్వర్క్ను విడుదల చేస్తున్నప్పుడుటి.ఎస్.పి.లు ఇప్పటికే ఉన్న టెలికాం సేవల క్యూఓఎస్కి కనీసం భంగం లేదా క్షీణత ఉండేలా చూసుకోవాలని ట్రాయ్ సూచించింది.

దీర్ఘకాలిక నెట్‌వర్క్ అంతరాయాలను ట్రాయ్ నిశితంగా పరిశీలిస్తోందని ట్రాయ్ తెలిపింది. టీఎస్పీలకు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం అందించింది.  ఇటువంటి అంతరాయాలు సేవల నాణ్యత మరియు వినియోగదారు అనుభవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని ట్రాయ్ పేర్కొందిఅన్ని టెలికాం ప్రొవైడర్లు ఏదైనా జిల్లా లేదా రాష్ట్రంలో ఇటువంటి అంతరాయాలుంటే ట్రాయ్ కి నివేదించాలని కోరిందిఅవసరమైతే విషయంలో తగిన నియంత్రణను తీసుకురావడాన్ని ట్రాయ్ పరిశీలించవచ్చిని పేర్కొంది. క్యూఓఎస్ బెంచ్మార్క్ కోసం ఆన్లైన్ డేటా సేకరణ మరియు లైసెన్స్ సర్వీస్ ఏరియాస్టేట్ లెవెల్ లేదా తక్కువ గ్రాన్యులారిటీతో పనితీరు నివేదికలను రూపొందించడానికి వాటి ప్రాసెసింగ్ కోసం సిస్టమ్లను ప్లాన్ చేసి అమలు చేయాలని ట్రాయ్ టి.ఎస్.పి.లను కోరిందిఇది టీఎస్పీల ద్వారా క్యూఓఎస్ పనితీరు రిపోర్టింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది, తద్వారా సమ్మతి భారం తగ్గుతుంది. నెట్వర్క్ వ్యాప్తి మరియు పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని, 5జీ సేవల రోల్అవుట్ కోసం సెటప్ చేయాలని.. మరియు వివిధ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయబడిన ముఖ్యమైన వినియోగ సందర్భాలను పరిగణనలోకి తీసుకునిటీఎస్పీల ద్వారా అంతర్గత క్యూఓఎస్ పర్యవేక్షణ కోసం 24x7 మరియు 360-డిగ్రీల ప్రాతిపదికన సిస్టమ్లను అమలు చేయాలని టీఎస్పీలను ట్రాయ్ కోరిందిక్యూఓఎస్ పర్యవేక్షణ మరియు నిర్వహణ కోసం ప్రామాణిక మరియు ఏఐ/ఎంఎల్ పద్ధతులను అనుసరించడం ద్వారా నెట్‌వర్క్ ఫీచర్‌ల దోపిడీ కూడా వెలుగులోకి వస్తుందని పేర్కొంది.

 

16.02.2023 ట్రాయ్ జారీ చేసిన రెండు ఆదేశాలను సమయానుకూలంగా అమలు చేయాలని టి.ఎస్.పి.లను కోరిందికొంతమంది టెలిమార్కెటర్లు ప్రిన్సిపల్ ఎంటిటీస్ (పీఈలుయొక్క హెడ్డర్స్ మరియు మెసేజ్ టెంప్లేట్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి  రెండు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. టెలిఫోన్ నంబర్లను ఉపయోగించే టెలిమార్కెటర్లతో సహా అనధికార లేదా నమోదుకాని టెలిమార్కెటర్ల నుండి వచ్చే సందేశాలను కూడా అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయినమోదిత టెలిమార్కెటర్లు లేదా 10 అంకెల నంబర్ల నుండి అవాంఛిత కాల్లను తగ్గించడానికి మరియు నిర్వహణ మరియు పర్యవేక్షణ కోసం వాటిని డీఎల్టీ  ప్లాట్ఫారమ్పైకి తీసుకురావాలని ట్రాయ్ సూచించింది.

***

 


(Release ID: 1900531) Visitor Counter : 199