వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (NPG) 43వ సమావేశ నిర్వహణ
రైల్వే ప్రాజెక్టులను పరిశీలించి ముఖ్యమైన మూడింటిని సిఫార్సు చేసిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్
Posted On:
17 FEB 2023 5:36PM by PIB Hyderabad
పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ సంస్థాగత ఫ్రేమ్‌వర్క్ కింద ఏర్పాటైన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ 3 ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులను పరిశీలించి సిఫార్సు చేసింది.
పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ-DPIIT ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షతన, నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ నిర్వహించిన సమావేశంలో రైల్వేమంత్రిత్వ శాఖ , రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ MoRTH, శక్తి ఉత్పాదన, పెట్రోలియం; సహజ వాయువు మంత్రిత్వ శాఖ - MoPNG, రహదారి మూలకాల నమూనా జాబితా విభాగం-MIRE, టెలి కమ్యూనికేషన్స్ విభాగం DoT, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ-MoCA, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ-MoPSWతో సహా అన్ని మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల ప్రణాళికా విభాగాల అధిపతులు, నీతి ఆయోగ్, అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ MoEF-CCల నుంచి ప్రత్యేక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఔరంగాబాద్ - అంకై స్టేషన్ల మధ్య లైన్ల పెంపు:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, అంకై మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టును నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ పరిశీలించింది. ఇది ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి అమృత్‌సర్, హైదరాబాద్, నిజామాబాద్ మొదలైన సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది.
ప్రతిపాదిత ప్రాజెక్ట్ పెరుగుదల సెక్షన్ సామర్థ్యాన్ని 114% నుంచి 143%కి పెంచుతుంది; ఇప్పటివరకు సింగిల్ లైన్‌గా ఉన్న ఈ దారిలో గూడ్స్, ప్యాసింజర్ ట్రాఫిక్‌ను మెరుగుపరుస్తుంది. ఈ రానుపోను రైలు పట్టాల విడి ఏర్పాటు ఆరావళి దక్షిణ్ సంపర్క్ కారిడార్‌లో ఉన్నందున దాదాపు పారిశ్రామిక సమూహాల సరుకు రవాణా అవసరాలను కూడా తీర్చగలదు. ఇది ప్రయాణీకులకు; సరకు రవాణాకు మేలు ఉదాహరణగా నిలుస్తుంది, అలాగే మొత్తం 38 గ్రామాల్లోని 98 లక్షల జనాభాకు అందుబాటుగా దౌల్తాబాద్, ఔరంగాబాద్; జల్నా పారిశ్రామిక ప్రాంతాలను రాకపోకలకు అనవుగా కలుపుతుంది.
భద్రక్-విజయనగరం మధ్య మిగులు విభాగంలో 3వ లైన్:
భారతదేశ పశ్చిమ తీరం; దక్షిణ కోస్తా మధ్య సరుకు రవాణాను మెరుగుపరచడానికి, ఒడిషా; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భద్రక్- విజయనగరం మధ్య బ్యాలెన్స్ విభాగంలో 3వ లైన్‌ను జోడించడంపై నిర్ణాయక బృందం ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించింది. ఈ ప్రాంతం తూర్పు తీరంలోని ఓడరేవులకు వెన్నెముకగా ఉంది. మౌలిక సదుపాయవనరుగా పని చేస్తున్నందున, ప్రతిపాదిత రైల్వే లైన్ గోపాల్‌పూర్, దామ్రా; రాబోయే భావనపాడు అనే మూడు ప్రధానేతర ఓడరేవులను; పారాదీప్; విశాఖపట్నంతో సహా రెండు ప్రధాన ఓడరేవులను రవాణాకు అనుకూలంగా అనుసంధానం చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ఖుర్దా, జగన్నాథ్‌పూర్; శ్రీకాకుళంలోని బహుళార్థ రవాణాకు అనువుగా గూడ్స్ షెడ్‌లకు నేరుగా వెళ్లడానికి సులభతరం చేస్తుంది; ప్రధాన రహదారి కార్గో కదలికను రైలుమార్గానికి తరలించేందుకు సాధ్యం అవుతుంది. ప్రతిపాదిత ప్రాజెక్ట్ హౌరా-చెన్నై రైల్వే మార్గంలో ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది; ఈ దారి సరుకు రవాణాకు అంకితం చేసినందున రైల్వేల రవాణా భాగస్వామ్య వాటాను పెంచుతుంది.
సోన్‌నగర్ - ఆండాల్ 3వ, 4వ రైల్వే లైన్:
మెరుగైన వ్యాగన్ తిరిగివచ్చే సమయం, ప్యాసింజర్ రైళ్ల మెరుగైన సమయపాలనను నిర్ధారించడానికి, బీహార్, జార్ఖండ్; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని సోన్‌నగర్ ఆండాల్ మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్‌లను జోడించే ప్రాజెక్ట్ ను ఎన్పీజీ అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వే మిషన్ 3000 MT ప్రణాళికలో భాగం; అభివృద్ధి చెందుతున్న టెక్స్ టైల్ హబ్ ఉన్న గయ ప్రాంతాన్ని , ఉక్కు అవసరాలున్న ధన్‌బాద్ ను, హజారీబాగ్, సీ ఫుడ్ క్లస్టర్, బొగ్గు నిల్వల జిల్లాను పశ్చిమ్ వర్ధమాన్ వంటి ఇనుప ఖనిజ ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన జిల్లాలను కలుపుతుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈ విభాగంలో రైళ్ల సగటు వేగం గంటకు 33 కి.మీ నుంచి 55 కి.మీ వరకు పెరుగుతుంది. ప్రాజెక్టులో ఈ విభాగం లాజిస్టిక్స్ నెట్‌వర్క్ లో మొత్తం మెరుగుదలను నిర్ధారిస్తుంది, ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది; స్వర్ణ చతుర్భుజి కింద అత్యంత సంతృప్త ఢిల్లీ - హౌరా రైల్వే మార్గం మీద ఉన్న రద్దీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఈ ప్రాంతంలో నౌకాశ్రయ అనుసంధానానికి ఈ హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్ లు చాలా కీలకమైనవి కాబట్టి వాటి ప్రాముఖ్యతను ప్రత్యేక కార్యదర్శి నొక్కి చెప్పారు. నెట్వర్క్ ప్రాజెక్టు గ్రూపు ద్వారా మూల్యాంకనం చేయబడిన మొత్తం 3 ప్రాజెక్ట్ లు; అనుసంధాన సమస్యలు పరిష్కరించడానికి; సరైన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ వాటాను సాధించడానికి కొన్ని సూచనలతో అమలు చేయడానికి సిఫార్సు చేశారు.
***
(Release ID: 1900430)
Visitor Counter : 188