వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పశు జాతులు నమోదులో పాల్గొన్న వారిని సన్మానించిన ఐసీఏఆర్ సన్మానం


స్థానిక జాతుల పశువులను గుర్తించడం ద్వారా వ్యవసాయ, పశుసంవర్ధక రంగాలను సుసంపన్నం చేయాలి - శ్రీ తోమర్

Posted On: 16 FEB 2023 6:59PM by PIB Hyderabad

దేశం అన్ని ప్రాంతాల్లో ఉన్న దేశవాళీ పశువుల సంపదను గుర్తించాల్సి ఉందని  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. దేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ జాతుల పశువులను గుర్తించడం ద్వారా  వ్యవసాయ, పశుసంవర్ధక రంగాన్ని సుసంపన్నం చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) న్యూ ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ లో నిర్వహించిన యానిమల్ బ్రీడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీ తోమర్ ప్రసంగించారు. శ్రీ తోమర్ మాట్లాడుతూ  దేశంలో దాదాపు సగం పశువుల వర్గీకరణ ఇంతవరకు జరగలేదన్నారు.వర్గీకరించని ప్రత్యేక జాతులకు చెందిన పశువులను సాధ్యమైనంత త్వరగా   గుర్తించి వాటి  పరిరక్షణకు చర్యలు అమలు జరగాలని మంత్రి పేర్కొన్నారు. దేశంలో అన్ని జాతుల పశువులను గుర్తించి వర్గీకరించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. క్లిష్టమైన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి  రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పశుసంవర్ధక శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పశుసంవర్ధక శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిషన్ మోడ్ లో దేశంలోని అన్ని జంతు జన్యు వనరులను గుర్తించి నమోదు చేసే కార్యక్రమాన్ని   ఐసిఎఆర్ ప్రారంభించింది. దేశవ్యాపితంగా యంత్రాంగం కలిగి ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పశుసంవర్ధక శాఖలు, స్వచ్ఛంద సంస్థలు  స్వదేశీ జంతు జన్యు వనరులను నమోదు చేయడానికి   ఐసిఎఆర్ కు సహకారం అందిస్తాయి. 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త జాతుల పశువులను గుర్తించడంలో సహకరించిన అన్ని వర్గాలను   శ్రీ తోమర్ అభినందించారు. కొత్తగా గుర్తించిన దేశవాళీ పశు సంపద ప్రత్యేకంగా ఉన్నాయన్నారు.  దేశంలో  ఇది అన్ని ప్రాంతాలలో విస్తృతంగా లభిస్తున్న వైవిధ్య భరిత పశువుల జాతి ఉందన్నారు.  . మానవ నాగరికత అభివృద్ధి చెందిన కాలం నుంచి  పశుపోషణ చారిత్రాత్మకంగా వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంది. దేశ జనాభాలో ఎక్కువ శాతం ప్రజలు పశువులను పోషిస్తూ  పశుసంవర్ధక రంగంపై  ఆధారపడి జీవిస్తున్న భారతదేశంలో నూతన పశు జాతులను గుర్తించాల్సిన ఆవాసం ఉంది. జంతు జీవవైవిధ్యం సమృద్ధిగా ఉన్న భారతదేశంలో  ప్రజలు యుగాల నుండి వివిధ రకాల జాతులను పెంచుతున్నారు. ఆహారం, ఫైబర్, రవాణా, ఎరువు, వ్యవసాయ అవసరాలు వంటి వివిధ ప్రయోజనాల కోసం పశువులను  ఉపయోగిస్తున్నారు. గతంలో రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని జీవించే విధంగా దేశవాళి పశువుల జాతులను అభివృద్ధి చేశారు. పశుసంవర్ధక, పౌల్ట్రీ రంగంలో భారతదేశం  గొప్ప వైవిధ్యం వైపు ప్రపంచం మొత్తం ప్రస్తుతం చూస్తోంది. దేశంలో జంతు జన్యు వనరులను గుర్తించి, నమోదు చేయడానికి అమలు జరుగుతున్న కార్యక్రమం పట్ల ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) హర్షం వ్యక్తం చేసింది.  

కార్యక్రమంలో  10 రకాల పశువులు, 5 రకాల పందులు, 4 గేదెలు, 3 మేక, కుక్క, గొర్రెలు, గాడిద, బాతుతో సహా కొత్తగా నమోదైన 28 జాతుల బ్రీడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ స్వదేశీ జాతులపై సార్వభౌమాధికారాన్ని పొందడానికి, 2019 సంవత్సరం  నమోదైన అన్ని జాతుల వివరాలను గెజిట్ ద్వారా నోటిఫై చేయడం జరుగుతోంది. కార్యక్రమంలో డీఏహెచ్ డీ, ఐసీఏఆర్, ఆయా సంస్థల అధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు  పాల్గొన్నారు.

***



(Release ID: 1899995) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi