యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుల్మార్గ్ లో ముగిసిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్


విజేతలకు పతకాలు ప్రదానం చేసిన క్రీడల శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రామాణిక్

జమ్మూ కాశ్మీర్ లో నూతన యుగం ప్రారంభం. ప్రతిభతో దేశానికి గర్వ కారణంగా నిలిచిన జమ్మూ కాశ్మీర్ క్రీడాకారులు .. కేంద్ర మంత్రి

26 స్వర్ణాలు, 25 రజతాలు, 25 కాంస్య పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జమ్మూ కాశ్మీర్

Posted On: 14 FEB 2023 7:22PM by PIB Hyderabad
ఖేలో ఇండియా 3వ  వింటర్ గేమ్స్ ఈ రోజు గుల్మార్గ్ లో ముగిసాయి. క్రీడల పోటీల్లో  క్రీడాకారులు, పర్యాటకులు మరియు వివిధ విభాగాల అధికారులతో సహా 2000 మందికి పైగా పాల్గొన్నారు. 26 స్వర్ణాలు, 25 రజతాలు, 25 కాంస్య పతకాలు సాధించి పతకాల పట్టికలో జమ్మూ కాశ్మీర్ అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 13 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 10 స్వర్ణాలు, 14 రజతాలు, 7 కాంస్య పతకాలు సాధించింది.  ఆర్మీ 10 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించింది.
క్రీడల ముగింపు కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఝా ,  యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సర్మద్ హఫీజ్, జమ్ముకశ్మీర్ క్రీడా మండలి  కార్యదర్శి నుజాత్ గుల్,  గుల్మార్గ్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈవో,  వింటర్ గేమ్స్ రౌఫ్ ట్రంబూ అధ్యక్షుడు మేజర్ జనరల్ ఆర్కే సింగ్,   సంబంధిత శాఖల అధికారులు, క్రీడాకారులు, పర్యాటకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
  గుల్మార్గ్ లో జరిగిన 3వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మునుపటి ఈవెంట్లతో పోలిస్తేపెద్ద ఎత్తున జరిగాయని కేంద్ర హోం, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి అన్నారు. ఇతర అంతర్జాతీయ పోటీల స్థాయిలో భవిష్యతులో వింటర్ గేమ్స్ నిర్వహిస్తామని  ఆయన అన్నారు.
 జమ్మూ కాశ్మీర్ లో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ గవర్నర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొన్న  సర్ఫరాజ్ అహ్మద్, ఆరిఫ్ ఖాన్ వంటి క్రీడాకారులు మన దేశానికి గర్వకారణం గా నిలిచారన్నారు.
' గత రెండేళ్లలో ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లోని ప్రతి జిల్లాలో ఇండోర్ స్టేడియంలతో  పాటు ప్రతి పంచాయతీలో ఆటస్థలాలు అభివృద్ధి చేసింది' అని ఆయన అన్నారు.
జూనియర్ బాలికల షూ క్రీడ, స్ప్రింట్ బాలుర విజేతలకు పతకాలు ప్రదానం చేసిన మంత్రి  పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి  స్వర్ణం సాధించిన జమ్ముకశ్మీర్ క్రీడాకారులను మంత్రి అభినందించారు.   ఖేలో ఇండియా శీతాకాల  క్రీడల నిర్వహణకు సహకరించిన వివిధ విభాగాల అధికారులు, జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్, పర్యాటక శాఖ, గుల్మార్గ్ డెవలప్మెంట్ అథారిటీ, గుల్మార్గ్ కేబుల్ కార్ కార్పొరేషన్, హోటల్ యజమానులు మరియు వింటర్ గేమ్స్ అసోసియేషన్ లకు  ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్మద్ హఫీజ్ మాట్లాడుతూ 3వ ఖేలో ఇండియా శీతాకాల క్రీడలను జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి  చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .  ఐదు రోజుల కార్యక్రమాన్ని అద్భుత భూమి గుల్మార్గ్ లో మంచు పండుగగా అభివర్ణించారు.  గుల్మార్గ్ దేశంలో శీతాకాలపు క్రీడల రాజధానిగా గుర్తింపు పొందింది అని అన్నారు.
వందన సమర్పణ చేసిన నూజత్ గుల్  కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ గవర్నర్ లకు  కృతజ్ఞతలు తెలిపారు
***

(Release ID: 1899285)
Read this release in: English , Urdu , Hindi