భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో 100 శాతం వాటాలు సేకరించి విలీనం చేసుకోవడానికి బీసీపీ టాప్కో II పీటీఈ. లిమిటెడ్ కు ఆమోదం తెలిపిన సీసీఐ

प्रविष्टि तिथि: 13 FEB 2023 7:50PM by PIB Hyderabad

ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో 100 శాతం వాటాలు సేకరించి విలీనం చేసుకోవడానికి బీసీపీ టాప్కో II పీటీఈ. లిమిటెడ్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. 

ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (టార్గెట్) లో 100 శాతం వాటాలు సేకరించి విలీనం చేసుకోవాలని కి బీసీపీ టాప్కో II పీటీఈ. లిమిటెడ్ ( అక్వైరర్) ప్రతిపాదించింది. దీని ప్రకారం (i) 2022 నవంబర్ 16న కుదిరిన వాటాల కొనుగోలు ఒప్పందం మేరకు టార్గెట్ ప్రమోటర్ కు చెందిన 51.67% వాటాలను అక్వైరర్ సేకరిస్తుంది. (ii) టార్గెట్ సంస్థ వాటాల రూపంలో సేకరించిన మిగిలిన 48.33% వాటాలను అక్వైరర్ సంస్థ (ఒక గుర్తించిన వ్యక్తి ద్వారా) కాంపోజిట్ ఆఫర్ ( డీ లిస్టింగ్ ఆఫర్ తో కూడిన ఓపెన్ ఆఫర్) ద్వారా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (షేర్లు మరియు టేకోవర్‌ల గణనీయమైన సముపార్జన) నిబంధనలు, 2011 మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఈక్విటీ షేర్ల తొలగింపు) నిబంధనలు, 2021 (సమిష్టిగా, “ప్రతిపాదిత నిబంధనలు”) ప్రకారం  వర్తించే నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుంటుంది.  

స్థాపించబడిన రోజు నుంచి అక్వైరర్ సంస్థ భారతదేశంలో గాని ప్రపంచంలో మరెక్కడా గాని ఏ విధమైన ఉత్పత్తులు / సేవలు అందించడంలో మరియు/లేదా పెట్టుబడి పెట్టే వ్యాపారాన్ని గాని నిర్వహించడం లేదు.  బ్లాక్‌స్టోన్ ఇంక్  అనుబంధ సంస్థలు సూచిస్తున్న/లేదా నిర్వహిస్తున్న  నిధుల ద్వారా అక్వైరర్ పనిచేస్తోంది.

టార్గెట్ సంస్థ భారతదేశంలో ఒక  పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. టార్గెట్ సంస్థ, దాని అనుబంధ సంస్థలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతికత (ఐటి ) ,ఐటీ ఆధారిత సేవలు అందిస్తోంది.  
సీసీఐ  వివరణాత్మక ఉత్తర్వులు త్వరలో జారీ అవుతాయి. 

***


(रिलीज़ आईडी: 1898996) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी