భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ప్లాటిన్ 2170 జీఎంబీహెచ్ & లాంక్సెస్‌కు చెందిన జేవీ హోల్డ్‌కో అయిన జెన్‌తే ఎల్‌ఎక్స్‌ఎస్ జీఎంబీహెచ్‌లోకి లాంక్సెస్ ఏజీకి చెందిన హెచ్‌పీఎం బిజినెస్ సంస్థను, కొనింకిల్జ్కే జీఎస్‌ఎం ఎన్.వి.కి చెందిన డీఈఎం బిజినెస్ సంస్థను విలీనం చేయడానికి సీసీఐ ఆమోదం
Posted On:
13 FEB 2023 7:49PM by PIB Hyderabad
ప్లాటిన్ 2170 జీఎంబీహెచ్ & లాంక్సెస్‌కు చెందిన జేవీ హోల్డ్‌కో అయిన జెన్‌తే ఎల్‌ఎక్స్‌ఎస్ జీఎంబీహెచ్‌లోకి లాంక్సెస్ ఏజీకి చెందిన హెచ్‌పీఎం బిజినెస్‌ను, కొనింకిల్జ్కే జీఎస్‌ఎం ఎన్.వి.కి చెందిన డీఈఎం బిజినెస్‌ను విలీనం చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత విలీనంలోని ముఖ్యాంశాలు:
- జెన్‌తే ఎల్‌ఎక్స్‌ఎస్ జీఎంబీహెచ్‌లోకి (జేవీ హోల్డ్‌కో) హెచ్‌పీఎం బిజినెస్ & హెచ్‌పీఎం బిజినెస్ విలీనం
- జేవీ హోల్డ్‌కోపై ప్లాటిన్ 2170 జీఎంబీహెచ్ (అడ్వెంట్ హోల్డ్‌కో), లాంక్సెస్ డ్యూచ్లాండ్ జీఎంబీహెచ్ (ఎల్‌డీజీ) ఉమ్మడి నియంత్రణ
- విలీనం ముగిసిన తర్వాత జేవీ హోల్డ్‌కోలో అడ్వెంట్ హోల్డ్‌కోకు 58-70% & ఎల్‌డీజీకి 30-42% వాటా
అడ్వెంట్ హోల్డ్‌కోను పరోక్షంగా జీపీఈ ఎక్స్ నియంత్రిస్తుంది, ఇదొక ఫండ్. బోస్టన్‌లో ఉన్న ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నియంత్రించే సంస్థలు ఈ ఫండ్ నిర్వహణను చూసుకుంటాయి.
జర్మనీకి చెందిన లాంక్సెస్ ఏజీ పూర్తి యాజమాన్యంలో కొనసాగుతున్న అనుబంధ సంస్థ ఎల్‌డీజీ. 33 దేశాల్లో వ్యాపారం చేస్తున్న ప్రత్యేక రసాయనాల కంపెనీ లాంక్సెస్. ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం కెమికల్ ఇండర్మీడియేట్స్, అడిటివ్స్, ప్రత్యేక రసాయనాలు, ప్లాస్టిక్ తయారీ, విక్రయాలు.
జేవీ హోల్డ్‌కో అనేది కొత్తగా స్థాపించిన సంస్థ. ఇది ప్రస్తుతం పూర్తిగా ఎల్‌డీజీ యాజమాన్యంలో ఉంది. హెచ్‌పీఎం బిజినెస్‌ను & హెచ్‌పీఎం బిజినెస్‌ను జేవీ హోల్డ్‌కో ఏకీకృతం చేస్తుంది.
అధిక పనితీరు చూపే థర్మోప్లాస్టిక్ పాలిమర్ల తయారీ, విక్రయాలను హెచ్‌పీఎం బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీల సమూహం ద్వారా ఈ వ్యాపారం జరుగుతోంది. ఇవన్నీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎల్‌డీజీ భాగస్వామ్యం కలిగిన అనుబంధ సంస్థలు.
నిర్మాణ సంబంధిత వస్తువులను డీఈఎం బిజినెస్ ఉత్పత్తి చేస్తుంది, విక్రయిస్తుంది. కొనింకిల్జ్కే జీఎస్‌ఎం ఎన్.వి. గ్రూప్ కంపెనీల్లో ఇది ఒకటి.
సీసీఐ నుంచి వివరణాత్మక ఆదేశం రావలసివుంది.
****
(Release ID: 1898977)
Visitor Counter : 140