ఆర్థిక మంత్రిత్వ శాఖ
2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి గడిచిన నాలుగేళ్లలో డిజిటల్ చెల్లింపుల పరిమాణంలో 200% పైగా వృద్ధి
Posted On:
13 FEB 2023 6:29PM by PIB Hyderabad
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ గల భీమ్-యుపిఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసాన్ రావ్ కరాడ్ ఈ రోజు లోక్ సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం లో ఈ విషయం తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాల ఫలితంగా, భారతదేశంలో డిజిటల్ లావాదేవీలలో సమూలమైన మార్పు వచ్చిందని, ఇది గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో డిజిటల్ లావాదేవీల పరిమాణం పెరుగుదల పరంగా కింద చూపిన విధంగా ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఆర్థికసంవత్సరం
|
పరిమాణం (రూ. కోట్లలో)
|
2018-19
|
2326.02
|
2019-20
|
3400.25
|
2020-21
|
4374.45
|
2021-22
|
7197.68
|
సోర్స్- ఆర్ బి ఐ
పై పట్టిక నుండి గమనించినట్లుగా, 2018-19 నుండి గత నాలుగేళ్లలో డిజిటల్ చెల్లింపుల పరిమాణంలో 200% పైగా పెరుగుదల ఉందని మంత్రి పేర్కొన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పి సి ఐ) నుండి సేకరించిన డేటా ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన యుపిఐ లావాదేవీలు 45 బిలియన్లు, గత 3 సంవత్సరాలలో 8 రెట్లు ,గత 4 సంవత్సరాలలో 50 రెట్లు వృద్ధిని చూపించాయి. గత ఏడాది అంటే 2022లో నమోదైన యూపీఐ లావాదేవీల నెలవారీ డేటా ఇలా ఉంది.
నెల
|
యు పి ఐ లావాదేవీలు (రూ. కోట్లలో)
|
జనవరి-22
|
461.715
|
ఫిబ్రవరి-22
|
452.749
|
మార్చి-22
|
540.565
|
ఏప్రిల్-22
|
558.305
|
మే-22
|
595.52
|
జూన్ -22
|
586.275
|
జూలై-22
|
628.84
|
ఆగస్టు-22
|
657.963
|
సెప్టెంబర్-22
|
678.08
|
అక్టోబర్-22
|
730.542
|
నవంబర్-22
|
730.945
|
డిసెంబర్-22
|
782.949
|
సోర్స్- ఎన్ పి సి ఐ
|
|
భీమ్-యూపీఐ ప్లాట్ ఫాం పై రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), ఈ-కామర్స్ లావాదేవీలను, తక్కువ విలువ (అంటే రూ.2,000 వరకు) పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ పథకం బ్యాంకులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. యూపీఐ లైట్, యూపీఐ 123 పేలను చౌకైన, యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ లుగా ఈ స్కీమ్ ప్రోత్సహిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి ఎంఈఐటీవై రూ.2,600 కోట్లు కేటాయించింది.
బలమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా , రూపే డెబిట్ కార్డులు , భీమ్-యుపిఐలను అన్ని రంగాలు ,విభాగాలలో తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ చెల్లింపుల విధానంగా ప్రోత్సహించడం ద్వారా ప్రోత్సాహక పథకం డిజిటల్ చెల్లింపులను పెంపొందించిందని మంత్రి పేర్కొన్నారు.
బ్యాంకులు తమ కస్టమర్లకు మెరుగైన, ఇబ్బంది లేని బ్యాంకింగ్ సేవలను డిజిటల్ మోడ్ లో అందించేందుకు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని అవలంబిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
అంతేకాకుండా, దేశ ప్రజలకు ఇబ్బంది లేని ,అంతరాయం లేని బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేయడానికి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, దేశంలో డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, ఎన్ సి పి ఐ, బ్యాంకులు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. వీటిలో భీమ్-యూపీఐ, యూపీఐ-123, ఆధార్ పేమెంట్ బ్రిడ్జి, ఏఈపీఎస్ మొదలైనవి ఉన్నాయని మంత్రి తెలిపారు.
****
(Release ID: 1898974)
Visitor Counter : 220