వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

తన ప్రయాణంలో 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA)


ఎగుమతులు 1987-88లో 0.6 USD బిలియన్ల నుండి 2021-22లో 24.77 USD బిలియన్లకు పెరిగాయి; 2022-23 నాటికి దాదాపు 30 USD బిలియన్లను సాధించడానికి సిద్ధంగా ఉంది

APEDA ఉత్పత్తులు 200 దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది

ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి దేశవ్యాప్తంగా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు మరియు వాణిజ్య సమావేశాలను నిర్వహిస్తున్న APEDA.

Posted On: 13 FEB 2023 3:12PM by PIB Hyderabad

1986లో స్థాపించిన వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA), కామర్స్ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ఇప్పటివరకు జరిగిన దాని విజయవంతమైన 37 సంవత్సరాల ప్రయాణంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

1987-88లో కేవలం USD 0.6 బిలియన్ ఎగుమతితో ప్రారంభమైన APEDA యొక్క క్రియాశీల జోక్యం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ఏప్రిల్-డిసెంబర్ 2022-23 వరకు USD 19.69 బిలియన్ల కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. అలాగే ఎగుమతి సామర్థ్యాన్ని 200 దేశాలకు విస్తరించింది. 2021-22 సంవత్సరంలో, 24.77 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను APEDA ఎగుమతి చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) APEDAకి నిర్దేశించిన లక్ష్యం USD 23.56 బిలియన్లు. అందులో 84% అంటే 19.69 బిలియన్ డాలర్లు డిసెంబర్ 2022 వరకు సాధించడం జరిగింది. అలాగే మిగిలిన లక్ష్యాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సైతం అధికారులు భావిస్తున్నారు.

WTO ట్రేడ్ డేటా ప్రకారంభారతదేశం 1986లో 25వ స్థానంలో ఉంది. ఇది 1987లో 28వ స్థానానికి మరియు 1988లో 29వ స్థానానికి పడిపోయింది. అయితే, 2019లో కౌంటీ స్థానం 10వ ర్యాంక్‌కు చేరుకోవడంతో భారతదేశం ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది. ఆ తర్వాత 2020లో 9వ స్థానానికి మరియు 2021లో 8వ ర్యాంక్‌కి చేరడం ద్వారా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని కొత్త స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో, APEDA భారతదేశం నుండి ఎగుమతుల ప్రోత్సాహం మరియు అభివృద్ధి సాధించడంతో పాటూ సులభంగా వ్యాపారం చేయడం కోసం IT-ప్రారంభించిన కార్యకలాపాలను ప్రోత్సహించింది. APEDA కాగిత రహిత కార్యాలయం (రీ-ఇంజనీరింగ్డిజిటల్ సంతకాలుఎలక్ట్రానిక్ చెల్లింపు సౌకర్యం), APEDA మొబైల్ యాప్ఇలా దశల వారీగా ఆన్‌లైన్ సేవల డెలివరీపర్యవేక్షణ మరియు మూల్యాంకనంఏకరీతి యాక్సెస్ మరియు వర్చువల్ ట్రేడ్ ఫెయిర్ వంటి కార్యక్రమాలను చేపట్టింది.

APEDA యొక్క జోక్యం వ్యవసాయ ఎగుమతుల కోసం దేశంలోని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మరియు అప్‌గ్రేడ్ చేయడానికి మరియు వ్యవసాయ ఎగుమతుల నాణ్యతను పెంపొందించడానికి దారితీసింది.

'వోకల్ ఫర్ లోకల్మరియు 'ఆత్మనిర్భర్ భారత్కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును దృష్టిలో ఉంచుకుని, APEDA స్థానికంగా లభించే GI (భౌగోళిక సూచికలు) ట్యాగ్ కలిగిన దేశీయజాతి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంపై దృష్టి సారించింది. కొత్త ఉత్పత్తులు మరియు కొత్త ఎగుమతి గమ్యస్థానాలను గుర్తించడం జరిగింది. తదనుగుణంగా ట్రయల్ షిప్‌మెంట్‌లు సైతం సులభతరం చేయడం జరిగింది.

ఈ రోజు వరకు, 417 నమోదిత GI ఉత్పత్తులు ఉన్నాయి. అయితే వాటిలో దాదాపు 150 GI ట్యాగ్ చేసిన ఉత్పత్తులు వ్యవసాయ మరియు ఆహార GI ని కలిగి ఉన్నాయి. వీటిలో 100 కంటే ఎక్కువ నమోదిత GI ఉత్పత్తులు APEDA షెడ్యూల్డ్ ఉత్పత్తుల (తృణధాన్యాలుతాజా పండ్లు మరియు కూరగాయలుప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు, etc) పరిధిలోకి వస్తాయి.

భారతదేశం ఎగుమతి చేసిన కొన్ని జాతి మరియు GI ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులలో డ్రాగన్ ఫ్రూట్పేటెంట్ పొందిన విలేజ్ రైస్జాక్‌ఫ్రూట్జామూన్బర్మీస్ ద్రాక్షడీహైడ్రేటెడ్ మహువా పువ్వులు మరియు పఫ్డ్ రైస్ ఉన్నాయి. GI రకాల మామిడి, GI ట్యాగ్ చేసిన షాహి లిచ్చిభలియా గోధుమలుమదురై మల్లికింగ్ చిల్లీమిహిదానాసీతాభోగ్దహను ఘోల్వాడ్ సపోటాజల్గావ్ అరటివజకులం పైనాపిల్మరయూర్ బెల్లంమేఘాలయ నుండి ఖాసీ మాండరిన్ (GI) మొదలైనవి.

వ్యవసాయ ఎగుమతి ఆధారిత ఉత్పత్తిఎగుమతి ప్రమోషన్, రైతులకు పలు అంశాల పట్ల మెరుగైన అవగాహన కలిగించడం మరియు ప్రభుత్వ విధానాలు - కార్యక్రమాలతో సమకాలీకరణ పై దృష్టి సారించివ్యవసాయ ఎగుమతి విధానం మొదటిసారిగా రాష్ట్రాలలో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి ఒక సంస్థాగత యంత్రాంగంగా 2018లో అడుగుపెట్టింది. భారతదేశం రైతు-కేంద్రీకృత విధానానికి ప్రాధాన్యతనిస్తోంది.

APEDAలో మార్కెట్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివరణాత్మక మార్కెట్ విశ్లేషణతో కూడిన E-మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికల వ్యాప్తి కార్యకలాపాలు సైతం ప్రారంభించారు.

FPOలు/FPCలుకోఆపరేటివ్‌లు ఎగుమతిదారులతో పరస్పరం చర్చించేలా ఒక వేదికను అందించడం కోసం APEDA తన వెబ్‌సైట్‌లో Farmer Connect పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తూ, APEDA రికార్డు సమయంలో వారణాసి అగ్రి – ఎక్స్‌పోర్ట్ హబ్ (VAEH)ని అభివృద్ధి చేయడం ద్వారా ల్యాండ్‌లాక్డ్ పూర్వాంచల్‌ను వ్యవసాయ సంబంధిత ఎగుమతి కార్యకలాపాలలో కొత్త గమ్యస్థానంగా మార్చడంలో పెద్ద అడుగు వేసింది. ఎగుమతి కార్యకలాపాలు ప్రాథమిక మౌలిక సదుపాయాల కొరత కారణంగా  ఎగుమతి కార్యకలాపాలు శూన్యంగా ఉన్న వారణాసి ప్రాంతం, దీని కారణంగా ఇప్పుడు వ్యవసాయ ఎగుమతి కార్యకలాపాలతో కళకళలాడుతోంది.

APEDA జోక్యం తర్వాతవారణాసి ప్రాంతం ఎగుమతుల విషయంలో ఆదర్శప్రాయమైన మార్పులను నమోదు చేసింది. అలాగే పూర్వాంచల్ ప్రాంతం నుండి చాలా తక్కువ వ్యవధిలో అనేక విధలుగా మొట్టమొదటి- విజయాలను సాధించింది. హిమాలయ పర్వత శ్రేణి, J&K నుండి లడఖ్ వరకు వ్యవసాయ ఎగుమతులు మరియు వాటికి సంబంధించి ప్రాంత అభివృద్ధి సాధించడం కూడా ఒక విజయం. ఈశాన్య ప్రాంతంఉత్తరప్రదేశ్ఉత్తరాంచల్బీహార్మధ్యప్రదేశ్ వంటి భూపరివేష్టిత రాష్ట్రాలు తమ ఉత్పత్తులను రైతుల నుండి సేకరించిదిగుమతి చేసుకునే దేశాల రిటైల్ చెయిన్‌లలో ప్రదర్శించినప్పుడు వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించాయి.

APEDA బాస్కెట్ క్రింద గల అనేక వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో బాస్మతీయేతర బియ్యం భారతదేశపు వ్యవసాయ ఎగుమతి పదార్థంగా ఉద్భవించింది. 2022-23 తొమ్మిది నెలల్లో USD 4663 మిలియన్ల ఎగుమతితోప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది గణనీయమైన సహకారాన్ని సైతం నమోదు చేసింది. 2022-23లో APEDA ఎగుమతి బాస్కెట్‌లోని ఇతర వ్యవసాయ ఉత్పత్తులు బాస్మతి బియ్యంతృణధాన్యాలు ఇతర ప్రాసెస్ చేసిన వస్తువులు మరియు మాంసంపాల పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

వెబ్‌లో ఇండియన్ మిల్లెట్స్ ప్రమోషన్‌లో భాగంగా, APEDA మిల్లెట్స్ పోర్టల్‌ను రూపొందించిఅభివృద్ధి చేసి ప్రారంభించింది. ఇది మిల్లెట్లను ప్రోత్సహించడానికి ప్రత్యేక పోర్టల్ ఇండియన్ మిల్లెట్ ఎక్స్ఛేంజ్‌ను కూడా సృష్టించింది.

వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క కీలక రంగాలలో ఒకటిఎందుకంటే ఇది దేశంలోని శ్రామిక వర్గంలో 65% మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది. అలాగే ప్రధాన కీలక పరిశ్రమలకు కూడా ఇది ఆధారం. 2020-21లో వ్యవసాయం GDPకి 20.2% మరియు భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో 14.1% వాటాను అందించింది.

దేశం నుండి వ్యవసాయం మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి యొక్క ప్రాముఖ్యతను గ్రహించిప్రభుత్వం 1986 లో వాణిజ్య మంత్రిత్వ శాఖ క్రింద పార్లమెంటు చట్టం ద్వారా వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA)ని ఏర్పాటు చేసింది. అప్పుడు కొత్తగా సృష్టించిన ఈ సంస్థ అప్పటికే ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (PFEPC) స్థానంలో ఉంది. APEDA తన 14 ఉత్పత్తి వర్గాలలో దాని ఆదేశం మరియు పని యొక్క పరిధి ప్రకారం చాలా కార్యకలాపాలను చేపట్టింది. ఇందులో ప్రధానంగా పండ్లు మరియు కూరగాయలుప్రాసెస్ చేసిన పండ్లు మరియు కూరగాయలుజంతువులుపాల మరియు పౌల్ట్రీ ఉత్పత్తులు మరియు తృణధాన్యాలు ఉన్నాయి.

చాలా సంవత్సరాలుగా, APEDA దాని అన్ని ఉత్పత్తి వర్గాలకు ఉత్పత్తి భద్రతనాణ్యత మరియు ప్రపంచ ప్రమోషన్‌కు సంబంధించిన సమస్యలను పర్యవేక్షిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 700 కంటే ఎక్కువ ఉత్పత్తులను రాజీ చేసింది. దిగుమతి చేసుకునే దేశాలలో పర్యావరణ మరియు ఆహార భద్రత సమస్యల గురించి వ్యవసాయ అవగాహన మరియు నిరంతరం అదనపు ఆహార నిబంధనలు మరియు వినియోగదారుల ప్రాధాన్యతలతో, APEDA తన వాణిజ్య ఎగుమతిదారులకు ఎగుమతి అవసరాల గురించి నిరంతరం అవగాహన కల్పిస్తోంది. దేశం నుండి ఎగుమతుల కోసం ఎగుమతి ఆధారిత ఉత్పత్తిని కలిగి ఉన్నందుకు; అలాగే సాధారణ అవసరాల కోసం సంబంధిత సభ్య ఎగుమతిదారుల ద్వారా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సహాయం అందిస్తోంది.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల దిగుమతి చేసుకునే దేశాలకు అవసరమైన ఆహార భద్రత మరియు ట్రేస్‌బిలిటీ యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, APEDA మెరుగైన నాణ్యత ప్రమాణాల తయారీగుర్తింపు పొందిన ప్రభావవంతమైన ఉత్పత్తుల కోసం విధానాలుఅవశేష పర్యవేక్షణ ప్రోటోకాల్ అభివృద్ధిప్రయోగశాలల గుర్తింపు, మరియు ట్రేస్బిలిటీ సిస్టమ్స్ అమలుమొదలైనవి.. అంశాలలో నాణ్యతా అభివృద్ధి రంగంలో అనేక కార్యక్రమాలను చేపట్టింది.

భారత ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (NPOP) అభివృద్ధిని ప్రారంభించింది. దీనిని మే 22001న ప్రభుత్వం ఆమోదించింది. అలాగే NPOP కి సెక్రటేరియట్‌గా APEDA ని నియమించారు.

బాస్మతి ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (BEDF) దేశవ్యాప్తంగా వాటాదారుల కోసం వర్క్‌షాప్‌లు/సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది.

APEDA యొక్క దూరదృష్టి విధానంఅత్యంత ప్రభావమంతమైన మరియు స్థిరమైన ప్రయత్నాలు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క స్థిరమైన మరియు నాణ్యమైన సరఫరాదారుగా భారతదేశం స్థానం పొందేలా చేసాయి.

***



(Release ID: 1898953) Visitor Counter : 182


Read this release in: English , Urdu