ఉక్కు మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ రరంగం కింద స్టీల్ ఉత్పత్తి యూనిట్లు
प्रविष्टि तिथि:
13 FEB 2023 3:14PM by PIB Hyderabad
దేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎఐఎల్), రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) అన్న రెండు ప్రభుత్వ రంగ స్టీల్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి.
కాగా,01.02.2023 నాటికి ఎస్ఎఐఎల్ ప్లాంట్లు లేదా యూనిట్లలో 65,895మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, ఆర్ఐఎన్ఎల్‌లో 16,368మంది ఉన్నారు.
గత ఐదేళ్ళల్లో ఏ స్టీల్ సంస్థ కూడా తన కార్యకలాపాలను నిలిపివేయలేదు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎఐఎల్ ప్లాంటు లేదా యూనిట్ అయిన విశ్వేశ్వరయ్య ఐరన్& స్టీల్‌ప్లాంట్ మూసివేతకు ప్రక్రియ ప్రారంభం అయింది.
ప్రభుత్వరంగ యూనిట్‌ను మూసివేస్తే కాంట్రాక్టు కార్మికులకు వర్తించే చట్టం, దానికోసం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పరిహారాన్ని అందిస్తారు.
ఈ సమాచారాన్ని కేంద్ర స్టీలు & గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి శ్రీ ఫగ్గనన్ సింగ్ కులస్తే రాజ్యసభకు నేడు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.
******
(रिलीज़ आईडी: 1898831)
आगंतुक पटल : 142