వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గుర్తింపు పొందిన 12 ఛాంపియన్ సర్వీసెస్ రంగాలపై దృష్టి కేంద్రీకరించడానికి 'సేవలలో ఛాంపియన్ రంగాల కోసం కార్యాచరణ ప్రణాళిక'ను రూపొందించిన కేంద్రం.
ఈ ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్‌ల కోసం గుర్తింపు పొందిన నోడల్ మినిస్ట్రీస్/డిపార్ట్‌మెంట్ల సెక్టోరల్ కార్యక్రమాలకు మద్దతుగా 5000 కోట్ల రూపాయలు కేటాయించారు
Posted On:
10 FEB 2023 6:14PM by PIB Hyderabad
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, టూరిజం & హాస్పిటాలిటీ సర్వీసెస్, మెడికల్ వాల్యూ ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ & లాజిస్టిక్స్ సర్వీసెస్, అకౌంటింగ్ మరియు ఫైనాన్స్, సేవలు, ఆడియో విజువల్ సేవలు, న్యాయ సేవలు, కమ్యూనికేషన్ సేవలు, నిర్మాణం మరియు సంబంధిత ఇంజనీరింగ్ సేవలు, పర్యావరణ సేవలు, ఆర్థిక సేవలు మరియు విద్యా సేవలు అనే 12 గుర్తించబడిన ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్‌లపై దృష్టి కేంద్రీకరించడానికి 'సేవల్లో ఛాంపియన్ సెక్టార్‌ల కోసం యాక్షన్ ప్లాన్'ను కేంద్రం రూపొందించింది. ఇందుకోసం రూ. 5000 కోట్లు ఈ రంగాల కోసం గుర్తించిన నోడల్ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల సెక్టోరల్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి కేటాయించారు. రాష్ట్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈరోజు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పుకొచ్చారు.
కింది వాటిని కలిగి ఉన్న సేవలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుంది:
i. బహుపాక్షిక, ప్రాంతీయ మరియు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా అర్థవంతమైన మార్కెట్ యాక్సెస్ గురించి చర్చలు జరపడం.
ii. గ్లోబల్ ఎగ్జిబిషన్ ఆన్ సర్వీసెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ మొదలైన అంతర్జాతీయ ఫెయిర్‌లు/ఎగ్జిబిషన్‌లలో పాల్గొనడం మరియు నిర్వహించడం ద్వారా వాణిజ్య ప్రచారం చేయడం దీని ముఖ్య విధి. అలాగే నిర్దిష్ట మార్కెట్‌లు మరియు రంగాల కోసం కేంద్రీకృత వ్యూహాలు సైతం చేపట్టడం జరుగుతుంది.
iii. వాటాదారులతో కాలానికి అనుగుణంగా సంప్రదింపులు జరపడం ద్వారా గుర్తింపు పొందిన దేశీయ రంగాల సవాళ్లు మరియు ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా, సేవల రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి దేశీయ సంస్కరణల ఎజెండాను కొనసాగించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లతో నిమగ్నమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
iv. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వివిధ సేవల రంగాలలో, ముఖ్యంగా ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్లలో భారతీయ ప్రమాణాలను రూపొందించడానికి ప్రత్యేక సేవల రంగ డివిజన్ కౌన్సిల్ (SSDC)ని ఏర్పాటు చేసింది. సాధ్యమైన చోట, సేవల నాణ్యత ప్రపంచ అంచనాలకు సరిపోయేలా నిర్ధారించడానికి భారత ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలతో సమన్వయం చేయడం జరిగింది.BIS ఇప్పటికే జనవరి, 2023 వరకు సేవలపై 143 ప్రమాణాలను ప్రచురించింది.'
v. ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు దేశంలోని ప్రతి జిల్లాలో సంభావ్య మరియు వైవిధ్యమైన గుర్తింపును ఎగుమతి హబ్‌లుగా మార్చాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చొరవ కింద, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ద్వారా వాణిజ్య శాఖ జిల్లాల నుండి గుర్తింపు పొందిన ఉత్పత్తులు/సేవలను ఎగుమతి చేయడానికి సంస్థాగత యంత్రాంగాలను రూపొందించడానికి నేరుగా రాష్ట్రాలు/UTలు మరియు జిల్లాలతో కలిసి పని చేస్తుంది. రాష్ట్రాలు/యూటీలతో సహా అన్ని వాటాదారులతో సంప్రదించి దేశంలోని అన్ని జిల్లాల్లో ఎగుమతి సామర్థ్యం ఉన్న ఉత్పత్తులు మరియు సేవలు గుర్తించడం జరిగింది.
అన్ని ఎగుమతి యూనిట్లు భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల భూభాగంలో ఉన్నందున, సేవల ఎగుమతులతో సహా అన్ని ఎగుమతులలో, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యక్ష మరియు పరోక్ష సహకారం ఉంది. వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న SEZ యూనిట్ల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా సేవల ఎగుమతుల వివరాలు అనుబంధం 1 లో పొందుపరిచారు.
అనుబంధం – 1
సేవల ఎగుమతులు (కోట్ల రూపాయలలో)
|
రాష్ట్రం
|
2019-20
|
2020-21
|
2021-22
|
2022-23 (Dec22 వరకు)
|
కర్ణాటక
|
1,20,969
|
1,30,742
|
1,60,576
|
1,46,465
|
తమిళ నాడు
|
93,740
|
1,02,344
|
1,15,975
|
1,10,166
|
మహారాష్ట్ర
|
99,343
|
1,07,090
|
1,19,833
|
1,08,517
|
తెలంగాణ
|
71,022
|
78,111
|
97,180
|
94,920
|
హర్యానా
|
25,958
|
25,057
|
25,514
|
24,153
|
ఉత్తర్ ప్రదేశ్
|
21,653
|
22,384
|
27,068
|
23,919
|
పశ్చిమ బెంగాల్
|
16,586
|
16,838
|
18,473
|
14,999
|
కేరళ
|
12,059
|
12,992
|
16,392
|
14,706
|
గుజరాత్
|
5,507
|
5,099
|
6,454
|
6,542
|
ఒడిశా
|
1,718
|
2,164
|
2,630
|
2,486
|
ఛండీఘర్
|
2,597
|
2,572
|
2,605
|
2,279
|
మధ్య ప్రదేశ్
|
722
|
969
|
1,592
|
2,055
|
పంజాబ్
|
1,029
|
1,295
|
1,715
|
1,515
|
ఆంధ్ర ప్రదేశ్
|
426
|
595
|
623
|
1,438
|
రాజస్థాన్
|
1,179
|
1,306
|
1,411
|
1,220
|
మొత్తం
|
4,74,508
|
5,09,558
|
5,98,043
|
5,55,380
|
(Release ID: 1898155)
|