భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌ను స్వావలంబన దేశంగా మార్చే లక్ష్యంతో వాహన & వాహన విడిభాగాల పరిశ్రమ కోసం, 'నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్‌' కోసం పీఎల్‌ఐ పథకాలను ప్రారంభించిన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

Posted On: 10 FEB 2023 3:27PM by PIB Hyderabad

వాహన & వాహన విడిభాగాల పరిశ్రమ కోసం, 'నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్‌' కోసం రెండు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.

(i)  వాహన & వాహన విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్‌ఐ పథకం:- వాహన & వాహన విడిభాగాల రంగంలో భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ రంగానికి 'పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ & ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ' పేరిట పీఎల్‌ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 5 సంవత్సరాల కాలానికి (FY2022-23 - FY2026-27) మొత్తం రూ.25,938 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో ఈ పథకాన్ని ఆమోదించింది. ఈ ఐదేళ్లలో ఆశించిన ఉపాధి కల్పన, అర్హత కల అమ్మకాల్లో సంచిత పెరుగుదల అంచనా వరుసగా 1.45 లక్షలు (ప్రత్యక్ష ఉపాధి), ₹2,31,500 కోట్లు. ఈ పథకం వివరాలను https://heavyindustries.gov.in/UserView/index?mid=2482 లింక్‌ ద్వారా చూడవచ్చు

(ii) నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్‌ కోసం పీఎల్‌ఐ పథకం:- భారతదేశంలో అత్యాధునిక రసాయన బ్యాటరీల (ఏసీసీ) ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం పీఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. మొత్తం 7 సంవత్సరాలకు (రెండు సంవత్సరాల ఏర్పాటు కాలంతో సహా) రూ.18,100 కోట్ల కేటాయింపులు చేసింది. లబ్ధిదారు సంస్థ సాధించాల్సిన మొత్తం అంచనా పెట్టుబడి రూ.27,000 కోట్లు. ఈ పథకం ద్వారా 2.7 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పథకం వివరాలను https://heavyindustries.gov.in/UserView/index?mid=2487లో చూడవచ్చు

ఆత్మనిర్భర్ భారత్‌ దృష్ట్యా, భారతదేశాన్ని స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి వాహన & వాహన విడిభాగాల పరిశ్రమ కోసం, 'నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్‌' కోసం పీఎల్‌ఐ పథకాలను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులకు దేశీయ విలువ జోడింపు (డీవీఏA) కోసం ఈ పథకాలను ఆమోదించింది. వాహన పీఎల్‌ఐలో, ప్రోత్సాహకం పొందడానికి కనీసం 50% డీవీఏ అవసరం. ఏసీసీ పీఎల్‌ఐ పథకంలో, లబ్ధిదారుల సంస్థలు రెండో సంవత్సరం చివరి నాటికి కనీసం 25% డీవీఏ, ఐదో సంవత్సరం ముగిసే నాటికి 60% సాధించాలి.

 

*****


(Release ID: 1898153) Visitor Counter : 242


Read this release in: English , Hindi , Tamil