గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అర్బన్ 20 అనేది గ్లోబల్ పీర్ లెర్నింగ్‌కు గొప్ప అవకాశంగా భావించాలి: అర్బన్ 20 ప్రారంభ సమావేశంలో శ్రీ హర్దీప్ ఎస్ పూరి


నగరాలు అనుసరించే విధానాలు మరియు పద్ధతులు వాస్తవానికి ప్రపంచ అభివృద్ధి అజెండాలపై శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని ఈ సంవత్సరం యూ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ నిరూపిస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి

క్లైమేట్ ఫైనాన్స్‌ను వేగవంతం చేయడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వినూత్న ఆర్థిక సాధనాలను రూపొందించే వేదికగా అర్బన్ 20 గ్రూప్ ఉంటుంది: శ్రీ హర్దీప్ ఎస్. పూరి

Posted On: 10 FEB 2023 2:35PM by PIB Hyderabad

“భారతదేశం మరియు ‘ఛైర్ సిటీ’ అహ్మదాబాద్‌లచే నడిపించబడినందున ఈ సంవత్సరం అర్బన్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ నగరాలు అనుసరించే విధానాలు మరియు అభ్యాసాలు వాస్తవానికి ప్రపంచ అభివృద్ధి అజెండాలపై శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని నిరూపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది ప్రపంచ భవిష్యత్తు యొక్క  అనుసంధానాన్ని మరింతగా చాటి  చెబుతుంది. అలాగే ఆర్థిక శ్రేయస్సులో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ” అని జీ20  అర్బన్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సిటీ షెర్పా మీటింగ్‌లో కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం & సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి తన ఆడియో-విజువల్ సందేశంలో చెప్పారు.


ఈ సంవత్సరం యూ20 సదస్సు ఔచిత్యాన్ని వివరిస్తూ 'వసుధైవ కుటుంబం - ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్‌తో ప్రతిధ్వనిస్తూ, ఈ సంవత్సరం శిఖరాగ్ర సదస్సు పరస్పర ప్రయోజనకరమైన మరియు స్థిరమైన అంతర్జాతీయ ఆర్థిక సహకారం ఉద్భవిస్తుంద" అని శ్రీ హర్దీప్ ఎస్. పూరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో తన ఆడియో సందేశంలో " గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ గవర్నెన్స్‌లోని ముఖ్యమైన సమస్యలపై భారతదేశం ఎలా ఎక్కువగా ఉపన్యాసాలు మరియు చర్యలను నడిపిస్తుందో మంత్రి వివరించారు. 2014 నుండి భారతదేశం  పట్టణ పునరుజ్జీవన పరివర్తన కథ ఒక ఉదాహరణ. ఇది ఇతర దేశాలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ నుండి నేర్చుకోవడానికి బ్లూప్రింట్‌గా మారింది" అని వివరించారు.

నగరాల ఆర్థిక సామర్థ్యాన్ని సుస్థిర పద్ధతిలో ఉపయోగించుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించిన శ్రీ పూరి..వాతావరణ మార్పులపై ఇటీవల ముగిసిన కాప్-27 మరియు జీవవైవిధ్యంపై జరిగిన కాప్-15 పట్టణ స్థితిస్థాపకతను పెంపొందించాల్సిన తక్షణ అవసరాన్ని పునరుద్ఘాటించాయి. తద్వారా నగరాలు ప్రపంచ ఒత్తిళ్లు మరియు షాక్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

వేగవంతమైన పట్టణీకరణ నేపథ్యంలో మెరుగైన ప్రణాళిక, విధానాలు మరియు పాలన ద్వారా నీటి భద్రతను నిర్ధారించడం చాలా కీలకమని మంత్రి నొక్కి చెప్పారు. "ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలో ఇది గణనీయమైన జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే మరియు పంచుకునే ప్రాంతం అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను." అని తెలిపారు.

కోరుకున్న సామాజిక ఆర్థిక ఫలితాలను అందించడానికి సాంప్రదాయ ప్రణాళిక నమూనాలను పునరాలోచించడం నగరాలకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం అని మంత్రి అన్నారు. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు మరియు ఫైనాన్సింగ్‌పై బలమైన చర్చ అవసరమని పేర్కొన్నారు.

క్లైమేట్ ఫైనాన్స్‌ను వేగవంతం చేసేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వినూత్న ఆర్థిక సాధనాలను రూపొందించే వేదికగా ఈ అర్బన్ 20 గ్రూప్ అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్లోబల్ పీర్ లెర్నింగ్‌కు అర్బన్ 20 లేదా యూ20ని గొప్ప అవకాశంగా చూడాలని శ్రీ పూరి అన్నారు. ఈ ప్రారంభ సమావేశంలో పాల్గొంటున్న వారి సమిష్టి అనుభవాలు మరియు చర్చల సమయంలో నేర్చుకున్న పాఠాలు జీ 20 నాయకులతో పంచుకోగల ధైర్యమైన, దూరదృష్టి గల రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు.

అర్బన్ 20 (యూ20), జీ20 కింద ఒక ఎంగేజ్‌మెంట్ గ్రూప్. ఇది జీ20 దేశాలలోని నగరాల నుండి సిటీ షెర్పాలు, మేయర్‌లు మరియు ప్రతినిధులను కలిసి, కీలకమైన పట్టణ సవాళ్లను సమిష్టిగా ఉద్దేశించి మరియు జీ20 చర్చలకు తెలియజేయడానికి కీలకమైన వేదిక. ఆరవ యూ20  ప్రారంభ సమావేశమైన సిటీ షెర్పా సమావేశం..యూ 20కి చైర్ సిటీ అయిన అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 9, 2023న అహ్మదాబాద్‌లో ప్రారంభించబడింది.

ఫిబ్రవరి 9-10, 2023న అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దాదాపు 40 నగరాల నుండి 70 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే పార్టిసిపెంట్ నగరాల నుండి 200 మందికి పైగా ప్రతినిధులు, యూ20 కన్వీనర్లు, జీ20కి సంబంధించిన వివిధ వర్కింగ్ గ్రూపులు మరియు ఎంగేజ్‌మెంట్ గ్రూపుల ప్రతినిధులు,  ప్రభుత్వం, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల నుండి సీనియర్ అధికారులు మరియు ఇతర ఆహ్వానిత అతిథులు పాల్గొంటున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, అహ్మదాబాద్ మేయర్ శ్రీ కిరీట్‌కుమార్ జె పర్మార్, భారతదేశ జీ20 షెర్పా, శ్రీ అమితాబ్ కాంత్, ఇతర ప్రముఖులు ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. శ్రీ పటేల్ తన ప్రధాన ఉపన్యాసంలో..యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్ యొక్క గొప్ప పట్టణ వారసత్వాన్ని హైలైట్ చేశారు. గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

భారతదేశ  జీ20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ యూ20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రాముఖ్యతపై తన ఆలోచనలను పంచుకున్నారు. దీనిని ముందుకు తీసుకెళ్లడంలో నగరాల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్నారు.

జీ 20 ప్రెసిడెన్సీకి బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించాలని మరియు నగరాలను డి-గ్లోబలైజింగ్, డి-కార్బనైజింగ్ మరియు డిజిటలైజ్ చేయాలనే సందేశాన్ని తీసుకువెళ్లాలని ఆయన ప్రతినిధులందరికీ స్పష్టమైన పిలుపు ఇచ్చారు.

సీ40 మరియు యూసిఎల్‌జీకి చెందిన యూ20 కన్వీనర్‌లు సమావేశానికి హాజరైన నగర షెర్పాలందరి ద్వారా ఒక రౌండ్ పరిచయాలను సులభతరం చేశారు.

రెండవ సెషన్‌లో పట్టణ ప్రాధాన్యతలు మరియు కీలకమైన జీ20 వర్కింగ్ గ్రూపులలో భాగంగా చర్చించబడుతున్న అంశాల మధ్య కలయిక ప్రాంతాలను అన్వేషించింది. సెషన్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ చైర్ శ్రీ సోలమన్ ఆరోకిరాజ్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ కోఆర్డినేటర్ శ్రీ కమల్ కిషోర్ మరియు డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు డాక్టర్ సందీప్ ఛటర్జీ ప్రజెంటేషన్‌లు ఇచ్చారు. యూ20తో జీ20 స్ట్రీమ్‌ల సహకారం మరియు కలయికల ప్రాముఖ్యతను వారు వివరించారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  పట్టణ ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లలో సంస్కరణలు, మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ మరియు సుస్థిర సేవల వైపు వెళ్లడం వంటి సంస్కరణల ఆవశ్యకతను హైలైట్ చేస్తూ ‘ఇండియాస్ అర్బన్ ఇంపెరేటివ్’పై ప్రత్యేక ప్రదర్శనను అందించారు.

అహ్మదాబాద్ మరియు గుజరాత్‌లోని ఇతర నగరాలు చేపడుతున్న మార్గదర్శక పనిని ప్రదర్శించడానికి ప్రత్యేక సెషన్ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గుజరాత్ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ముఖేష్ కుమార్, హెచ్‌ఎల్‌సి ఆఫ్ అర్బన్ ప్లానర్స్, అర్బన్ ఎకనామిస్ట్‌లు మరియు ఇన్‌స్టిట్యూషన్‌ల చైర్‌పర్సన్ శ్రీ కేశవ్ వర్మ మరియు ప్రొఫెసర్ హెచ్‌ఎం శివానంద స్వామి - ప్రొఫెసర్ ఎమిరిటస్, సిఒఈ-యూటీ సరసమైన గృహాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి మరియు స్థిరమైన పట్టణ రవాణాకు ఉదాహరణల విజయాల గురించి మాట్లాడారు.
 
గత సెషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిటీ షెర్పాలు తమ జీ20 జాతీయ ప్రభుత్వ సహచరులతో ప్రాధాన్యతలో చర్చించాలనుకుంటున్న పట్టణ సమస్యలు మరియు అవకాశాల గురించి చర్చించారు.  అహ్మదాబాద్ నగరానికి చెందిన షెర్పా (యూ20 2023 చైర్) ప్రవీణ్ చౌదరి తమ నాయకత్వంలో  పరిష్కరించాలనుకుంటున్న ప్రధాన సమస్యలను తెలిపారు. జకార్తా నగరానికి చెందిన షెర్పా (యూ20 2022 చైర్) శ్రీ హయాతి జకార్తా చక్రంలో మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించిన యూ20 సిఫార్సులు జీ20 లీడర్స్ బాలి డిక్లరేషన్ ద్వారా ప్రతిబింబించబడ్డాయి మరియు ఆమోదించబడ్డాయని తెలిపారు. తద్వారా యూ20 ప్రభావం చూపుతుందని చెప్పారు. 20కి పైగా అంతర్జాతీయ నగరాలు ఓపెన్ ఫ్లోర్ చర్చలో పాల్గొన్నాయి మరియు జీ20 వర్క్‌స్ట్రీమ్‌లు మరియు యూ20 మధ్య సంభాషణను కొనసాగించడానికి  జీ20 ప్రముఖులు జారీ చేసిన ఆహ్వానాలకు ప్రతిస్పందించాయి.

ప్రతినిధులు చేపట్టిన సబర్మతీ ఆశ్రమం మరియు అటల్ బ్రిడ్జి సందర్శన నగర విహారంతో సదస్సు తొలి రోజు ముగిసింది. దీని తర్వాత గుజరాత్ ప్రభుత్వం సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద సంగీత మరియు నృత్య ప్రదర్శన మరియు గాలా డిన్నర్‌తో సహా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


(Release ID: 1898142) Visitor Counter : 239


Read this release in: English , Urdu , Hindi , Tamil