జల శక్తి మంత్రిత్వ శాఖ
అంతర్గత జల రవాణాను ప్రోత్సహించేందుకు జాతీయ జలమార్గాల అభివృద్ధి
Posted On:
09 FEB 2023 1:12PM by PIB Hyderabad
రేవులు, ఓడరవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం పర్యావరణ అనుకూల, ఉచితధరలు, నిర్ధిష్ట మార్గాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైన చోట ప్రస్తుతమున్న రైలు, రోడ్డు రవాణాకు అనుబంధంగా ప్రత్యామ్నాయ పద్ధతిలో ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ (ఐడబ్ల్యుటి -అంతర్గత జల రవాణా) కోసం జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.
మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్వతంత్రప్రతిపత్తిగల సంస్థ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) షిప్పింగ్, నౌకాయానం కోసం జాతీయ జలమార్గాల (ఎన్‌డబ్ల్యు) క్రమబద్ధీకరించి, అభివృద్ధి చేయడమే కాక, నదిలో 200టి నౌకలను నడిపేందుకుఉ 35 నుంచి 45 మీటర్ల వెడల్పు, 2 నుంచి 3 మీటర్ల లోతుతో నావిగేషన్ చానెల్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనితో జలమార్గంలో మరింత నీరు అందుబాటులో ఉండి, అందుబాటులో ఉన్న కనీస లోతు (ఎల్ఎడి) మెరుగుపడేందుకు తోడ్పడి ప్రయాణం సాఫీగా సాగడానికి, రవాణా ఖర్చు తగ్గించేందుకు ప్రత్యక్షంగా సహాయం చేస్తుంది.
అదనంగా, దేశంలో ఇన్‌ల్యాండ్ జలరవాణాను ప్రోత్సహించేందుకు, 24 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 111 ఇన్‌లాండ్ జలమార్గాలు (ఉనికిలో ఉన్న 5, అదనంగా 106 జలమార్గాలు)ను జాతీయ జలమార్గాల చట్టం, 2016 కింద జాతీయ జలమార్గాలుగా (ఎన్‌డబ్ల్యు) ప్రకటించడం జరిగింది. ఎన్‌డబ్ల్యుల జాబితాను జతపరచడమైంది.
అదనంగా, జలవనరులు, నదీ అభివృద్ధి & గంగ పునరుజ్జీవన విభాగం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఆన్ సెడిమెంట్ మేనేజ్‌మెంట్ (ఎన్ఎఫ్ఎస్ఎం - బురద నిర్వహణకు జాతీయ చట్రం)ను రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రాజెక్టు అథారిటీలు/ ఇతర మంత్రిత్వ శాఖల సమగ్ర, సంపూర్ణ నిర్వహణ కోసం రూపొందించింది.
జాతీయ జలమార్గాలలో పూడిక తీయడం, ఒండ్రును తొలగించేందుకు నిబంధనలను ఈ చట్రం పట్టి చూపుతుంది.
ఆమోదించిన ఎన్ఎఫ్ఎస్ఎం పత్రం ప్రజలకు అందుబాటులో ఉంది. దిగువన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా దానిని చూడవచ్చు -
https://drive.google.com/file/d/1p4MQWIu9CDuDhL0Tatc5po4a1yO79b9q/view?usp=share_link
ఈ సమాచారానన్ని జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గురువారం లిఖితపూర్వక సమాధానంలో లోక్‌సభకు వెల్లడించారు.
***
(Release ID: 1897748)
Visitor Counter : 191