Posted On:
08 FEB 2023 5:35PM by PIB Hyderabad
1. . పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ: ఈఆర్ఫీ ఆధారిత విధానంతో పనిచేసే కామన్ నేషనల్ సాఫ్ట్ వేర్ ద్వారా దేశంలో పనిచేస్తున్న 63,000 ప్రాథమిక సహకార సంఘాలను అనుసంధానం చేయడానికి 2,516 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రక్రియ ప్రారంభమైంది.
2. పీఏసీఎస్ లకు మోడల్ ఉప చట్టాలు : పాడి పరిశ్రమ, చేపల పెంపకం, గోదాముల ఏర్పాటు, ఎల్పీజీ/ పెట్రోల్/ గ్రీన్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, సీఎస్ సీ వంటి 25కు పైగా వ్యాపార కార్యకలాపాలను పీఏసీఎస్ లు చేపట్టేందుకు వీలుగా ఆయా రాష్ట్ర సహకార చట్టం ప్రకారం వాటిని స్వీకరించేందుకు రూపొందించిన మోడల్ ఉప చట్టాలు రూపొందించారు.
3. కామన్ సర్వీస్ కేంద్రాలుగా పీఏసీఎస్ లు: పీఏసీఎస్ పనితీరు మెరుగు పరిచి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూసి, గ్రామ స్థాయిలో ఈ- సేవలు అందించి, గ్రామా స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కామన్ సర్వీస్ కేంద్రాలుగా పీఏసీఎస్ పనిచేసేలా చూసేందుకు సహకార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నాబార్డు, సీఎస్ సీ-ఎస్పీవీ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
4. జాతీయ సహకార సమాచార నిధి : విధాన రూపకల్పన, అమలులో భాగస్వాములను సులభతరం చేయడానికి దేశంలో సహకార సంఘాల ప్రామాణిక , నవీకరించిన సమాచార భాండాగారం తయారీ ప్రారంభమైంది.
5. జాతీయ సహకార విధానం: 'సహకారం ద్వారా -సమృద్ధి' దార్శనికతను సాకారం చేయడానికి దోహదపడే నూతన సహకార విధానాన్ని రూపొందించడానికి దేశవ్యాప్తంగా నిపుణులు, భాగస్వాములతో కూడిన జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు అయ్యింది.
6. ఎంఎస్సీఎస్ చట్టం, 2002 కు సవరణ: 97వ రాజ్యాంగ సవరణ నిబంధనలు చేర్చడానికి, పాలనను బలోపేతం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి, బహుళ రాష్ట్ర సహకార సంఘాల్లో జవాబుదారీతనాన్ని పెంచడానికి, ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి జాతీయ స్థాయిలో అమలు జరుగుతున్న ఎంఎస్సిఎస్ చట్టం, 2002 ను సవరించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
7. జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్: వివిధ రంగాల్లో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ కార్యక్రమాలు అమలు చేస్తోంది. స్వయం సహకార గ్రూపుల కోసం స్వయంశక్తి సహకార్ , దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల కోసం 'జింకవాది క్రిషక్ సహకర్', పాడి పరిశ్రమకు 'డెయిరీ సహకార్ ', చేపల పెంపకానికి 'నీల్ సహకార్ ' వంటి కొత్త పథకాలు అమలు జరుగుతున్నాయి. . 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల మొత్తం రూ.34,221 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేయడం జరిగింది.
8.సభ్యులకు రుణాలు అందిస్తున్న సంస్థల్లో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ :: రుణాల్లో సహకార సంఘాల వాటాను పెంచడానికి సీజీటీఎంఎస్ పథకంలో ఎంఎల్ఐ సంస్థలుగా నాన్ షెడ్యూల్డ్ యూసీబీలు, ఎస్టీసీబీలు గుర్తింపు.
9. జెమ్ పోర్టల్ లో 'కొనుగోలుదారులు' గా సహకార సంఘాలు: జెమ్ పోర్టల్ లో 'కొనుగోలుదారు'గా నమోదు చేసుకోవడానికి సహకార సంఘాలకు అనుమతి మంజూరు అయ్యింది. దీని ద్వారా దాదాపు 40 లక్షల మంది విక్రేతల నుంచి వస్తువులు, సేవలు పారదర్శకంగా చౌకగా సులభంగా కొనుగోలు చేయడానికి సహకార సంఘాలకు అవకాశం కలుగుతుంది.
10. సహకార సంఘాలపై సర్చార్జి తగ్గింపు: 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఆదాయం ఉన్న సహకార సంఘాలకు సర్చార్జి 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గింది.
11. కనీస ప్రత్యామ్నాయ పన్ను తగ్గింపు: సహకార సంఘాలకు మ్యాట్ 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది.
12. ఐటీ చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ కింద ఉపశమనం: ఐటీ చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ కింద సహకార సంఘాలు ప్రతి లావాదేవీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు వివరణ ఇచ్చారు.
13. కొత్త సహకార సంఘాలకు పన్ను రేటు తగ్గింపు: 2023-24 కేంద్ర బడ్జెట్ లో 2024 మార్చి 31 వరకు తయారీ కార్యకలాపాలను ప్రారంభించే నూతన సహకార సంఘాల నుంచి ప్రస్తుత రేటు 30% కాకుండా 15% సర్చార్జి వసూలు చేయడం జరుగుతుంది.
14. పీఏసీ లు , పీసీఏఆర్డీబీ ల డిపాజిట్ సేకరణ , రుణాల పరిమితి పెంపు: పీఏసీ లు , పీసీఏఆర్డీబీ ల డిపాజిట్, రుణాల పరిమితిని రూ.20 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. .
15. టీడీఎస్ పరిమితి పెంపు: సహకార సంఘాల నగదు ఉపసంహరణ పరిమితిని టీడీఎస్ కి గురికాకుండా ఏడాదికి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల కు పెంచుతున్నట్లు 2023-24 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు.
16. చక్కెర సహకార మిల్లులకు ఉపశమనం: రైతులకు సరసమైన, లాభదాయకమైన లేదా రాష్ట్ర సూచించిన ధర మేరకు రైతులకు ఎక్కువ ధర చెల్లించే చక్కెర సహకార మిల్లులకు అదనపు ఆదాయపు పన్ను విధించడం జరగదు.
17. సహకార చక్కెర మిల్లుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం: మదింపు సంవత్సరం 2016-17 లో చక్కెర రైతులకు చేసిన చెల్లింపులను ఖర్చుగా చూపించడానికి కేంద్ర బడ్జెట్ 2023-24 వెసలుబాటు కల్పించింది. దీనివల్ల చక్కెర మిల్లులకు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది.
18. కొత్త జాతీయ బహుళ రాష్ట్ర సహకార సంఘం: ఎంఎస్సీఎస్ చట్టం 2002 ప్రకారం నాణ్యమైన విత్తన సాగు, ఉత్పత్తి, పంపిణీ చేయడానికి ఒకే బ్రాండ్ కింద అమ్మకాలు సాగించేందుకు వీలు కల్పించే విధంగా కొత్తగా అపెక్స్ నేషనల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సీడ్ సొసైటీని ఏర్పాటు అవుతుంది.
19. కొత్తగా బహుళ-రాష్ట్ర సహకార సంఘాల ఆర్గానిక్ సంస్థ : గుర్తించిన , ప్రామాణిక సేంద్రియ ఉత్పత్తులు ఉత్పత్తి చేయడానికి, పంపిణీ చేయడానికి,మార్కెట్ చేయడానికి ఎంఎస్సిఎస్ చట్టం, 2002 ప్రకారం అపెక్స్ నేషనల్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ ఆర్గానిక్ సొసైటీ ఏర్పాటు అవుతుంది.
20. బహుళ-రాష్ట్ర సహకార సంఘాల ఎగుమతుల సంస్థ : సహకార రంగం నుంచి ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ఎంఎస్సీఎస్ చట్టం 2002 కింద అపెక్స్ నేషనల్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ సొసైటీని ఏర్పాటు అవుతుంది.