బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు వనరుల హేతుబద్ధీకరణ
Posted On:
08 FEB 2023 4:29PM by PIB Hyderabad
గనుల నుండి వినియోగదారుల వద్దకు బొగ్గు రవాణాలో దూరాన్ని తగ్గించడానికి బొగ్గు వనరుల అనుసంధానాల హేతుబద్ధీకరణ చేయడం అనేది బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క విధాన చొరవ. విద్యుత్ రంగానికి బొగ్గు పంపిణీ అనుసంధాన హేతుబద్ధీకరణ ఫలితంగా గనుల నుండి విద్యుత్ ప్లాంట్‌లకు రవాణా ఖర్చు తగ్గింది. దీని వలన మరింత సమర్థవంతమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి వీలు కలుగుతొంది. రవాణా అవస్థాపన భారాన్ని తగ్గించడం, తరలింపు పరిమితులను సులభతరం చేయడంతో పాటు బొగ్గు ధరను తగ్గించడంలో ఈ చర్య ఎంతగానో దోహదపడుతుంది. జూన్, 2014లో ఏర్పాటైన ఇంటర్-మినిస్టీరియల్ టాస్క్ ఫోర్స్ (ఐఎంటీఎఫ్) సిఫార్సు ఆధారంగా రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అనుసంధాన హేతుబద్ధీకరణ మొదట్లో అమలు చేయబడింది. స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారుల (ఐపీపీలు) అనుసంధానాలను హేతుబద్ధీకరించడానికి.. జూలై, 2017లో మరొక ఐఎంటీఎఫ్ ఏర్పాటు చేయబడింది. ఐపీపీలు/ ప్రైవేట్ సెక్టార్ ప్లాంట్ల కోసం బొగ్గు హేతుబద్ధీకరణకు సంబంధించిన పద్దతి కూడా 15.05.2018న జారీ చేయబడింది. దిగుమతి చేసుకున్న బొగ్గును.. తీర ప్రాంతాల సమీపానికి.. రవాణా చేయబడిన దేశీయ బొగ్గును లోతట్టు ప్రాంతాలకు రవాణా చేయడంతో సహా.. బొగ్గు అనుసంధానాలను మరింత హేతుబద్ధీకరించే అవకాశాన్ని పరిశీలించడానికి అక్టోబర్, 2018లో ఐఎంటీఎఫ్ ఏర్పాటైంది. ఈ పద్దతిని ప్రభుత్వం ఆమోదించింది మరియు 05.06.2020న జారీ చేసింది, ఇది పవర్ మరియు నాన్-రెగ్యులేటెడ్ సెక్టార్ (ఎన్ఆర్ఎస్)ని కవర్ చేస్తుంది. దిగుమతి చేసుకున్న బొగ్గుతో బొగ్గు మార్పిడికి కూడా తగి అనుమతి ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇంకా బొగ్గు నిక్షేపాలు లేవు. అయితే, రాజస్థాన్‌లో లిగ్నైట్ నిల్వలు కనుగొనబడినాయి. 2022-23లో రాజస్థాన్‌లోని చురు మరియు బికనీర్ జిల్లాలో సీఎంపీడీఐఎల్ అన్వేషణకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక కలిగి లేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) చురు జిల్లాలో ఇప్పటి వరకు లిగ్నైట్ సంభవించినట్లు నివేదించబడలేదు. అందువల్ల, ప్రస్తుతం చురులో అన్వేషణను ప్లాన్ చేయడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1897534)
Visitor Counter : 144