ఆర్థిక మంత్రిత్వ శాఖ

భవిష్యత్ విజయవంతపు టెక్నాలజీలలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఒకటి: రిజర్వ్ బాంక్

Posted On: 07 FEB 2023 6:02PM by PIB Hyderabad

భవిష్యత్ విజయవంతపు టెక్నాలజీలలో బ్లాక్  చెయిన్ టెక్నాలజీ ఒకటని భారతీయ రిజర్వ్ బాంక్ తెలియజేసింది. అనేక ఉపయోగాలున్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతబాగా ఉపయోగించుకుంటామనే దాన్నిబట్టి   దాని విస్తృతమైన ప్రయోజనం ఉంటుందని   పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి డాక్టర్  భగవత్ కిసన్ రావు కారద్ రాజ్యసభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ నవకల్పనాత్మక టెక్నాలజీలలో ఒకటిగా గుర్తింపు పొందిందని కూడా రిజర్వ్ బాంక్ తెలియజేసినట్టు మంత్రి పేర్కొన్నారు.  నవ కల్పనలను వాటి రూపకర్తలు పరీక్షించి చూసుకోవటానికి కూడా రిజర్వ్ బాంక్ తగిన వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. 

భారతీయ బాంకులలో బ్లాక్ టెక్నాలజీ వాడకానికి సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన అంశాలనూ గుర్తించలేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే, సీమాంతర చెల్లింపులకు సంబంధించి ఇందులో పాల్గొనే దేశాలు బ్లాక్ చెయిన్ ఆధారిత అప్లికేషన్స్ కొన్నింటిని పరీక్షించి చూసింది.  

***

 


(Release ID: 1897231) Visitor Counter : 174


Read this release in: English , Urdu