ఆర్థిక మంత్రిత్వ శాఖ

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి ఒకే సంవత్సరంలో అత్యధికంగా 89,127 మిలియన్ డాలర్ల విదేశీ రెమిటెన్స్ .

Posted On: 07 FEB 2023 6:05PM by PIB Hyderabad

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు ఒకే సంవత్సరం లో అత్యధికంగా 89,127 మిలియన్ డాలర్ల విదేశీ రెమిటెన్స్ వచ్చాయి.ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం లో తెలిపారు.

 

ఇన్వర్డ్ రెమిటెన్స్ లపై గత ఐదేళ్ల డేటా ఇలా ఉంది.

 

సంవత్సరం

ఇన్వార్డ్ రెమిటెన్స్ లు

(యుఎస్$మిలియన్)

2017-18

69,129

2018-19

76,396

2019-20

83,195

2020-21

80,185

2021-22

89,127

మూలం: ఆర్.బి.ఐ.

 

రెమిటెన్స్ కు సంబంధించి దేశాల వారీగా డేటాను క్రోడీకరించలేదని మంత్రి పేర్కొన్నారు. అధీకృత డీలర్ల (ఏడీ) బ్యాంకుల ద్వారా 2020-21 సంవత్సరానికి ఆర్. బి. ఐ నిర్వహించిన సర్వే ఆధారంగా భారత్ కు ఇన్వర్డ్ రెమిటెన్స్ లలోప్రధాన దేశాల వాటా ఈ విధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

 

2020-21 ఇన్వర్డ్ రెమిటెన్స్ లలో దేశాల వారీగా వాటా

 

సోర్స్ దేశం

మొత్తం రెమిటెన్స్ లలో వాటా (శాతం)

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

23.4

యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్

18.0

యునైటెడ్ కింగ్ డమ్

6.8

సింగపూర్

5.7

సౌదీ అరేబియా

5.1

కువైట్

2.4

ఒమన్

1.6

ఖతార్

1.5

హాంగ్ కాంగ్

1.1

ఆస్ట్రేలియా

0.7

మలేషియా

0.7

కెనడా

0.6

జర్మనీ

0.7

ఇటలీ

0.1

ఫిలిప్పీన్స్

0.0

నేపాల్

0.0

ఇతరులు

31.6

 

ఆధారం: ఆర్. బి. ఐ రెమిటెన్స్ సర్వే, 2021, రెమిటెన్స్ లపై జూలై 2022.

ఆర్. బి. ఐ బులెటిన్. వ్యాసం "కోవిడ్ -19 ప్రతికూలతలు ,భారతదేశం ఇన్వార్డ్ రెమిటెన్సెస్‘‘ లో ప్రచురితం అయింది.

 

భారత రూపాయి విలువ మార్కెట్ ఆధారితమని, ఆర్బీఐ విదేశీ మారక మార్కెట్లను నిశితంగా పర్యవేక్షిస్తుందని, ముందుగా నిర్ణయించిన లక్ష్య స్థాయి లేదా బ్యాండ్ తో సంబంధం లేకుండా మారకం రేటులో అధిక అస్థిరతను నియంత్రించడం ద్వారా క్రమబద్ధమైన మార్కెట్ పరిస్థితులను నిర్వహించడానికి మాత్రమే జోక్యం చేసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

 

****



(Release ID: 1897224) Visitor Counter : 331


Read this release in: English , Urdu