జల శక్తి మంత్రిత్వ శాఖ
గిరిజన ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ స్థితిగతులు
Posted On:
06 FEB 2023 5:06PM by PIB Hyderabad
గిరిజన ప్రాంతాలు, అటవీ, పర్వత ప్రాంతాల్లో మోటారు రహదారి ద్వారా చేరుకోలేని మారుమూల ప్రాంతాలు సహా దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి 2024 నాటికి కుళాయి ద్వారా మంచి నీటి సరఫరాను అందించడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ (జజెఎం) కింద హర్‌ఘర్ జల్‌ను అమలు చేస్తోంది.
జల్ జీవన్ మిషన్‌ను 2019 ఆగస్టులో ప్రకటించే సమయానికి 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పంపు నీటి కనెక్షన్లు ఉన్నాయి. నేటివరకూ, అంటే 02.02.2023 నాటికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలూ అందించిన సమాచారం ప్రకారం గత మూడున్నర ఏళ్ళల్లో 7.83 కోట్ల కుటుంబాలకు పంపు నీటి కనెక్షన్లను అందించడం జరిగింది. దీనితో 02.02.2023 నాటికి దేశంలోని మొత్తం 19.36 గ్రామీణ కుటుంబాలలో దాదాపు 11.07 కోట్ల కుటుంబాలకు వారి గృహాలలో పంపునీటి సరఫరా చేస్తున్నారు.
మిషన్ కింద డెజర్ట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (డిడిపి- ఎడారి అభివృద్ధి కార్యక్రమం), డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రాం (డిపిఎపి - కరువు పీడిత ప్రాంతాలకు కార్యక్రమం)లో గల క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలకు 30% ప్రాముఖ్యతను, ఎస్సీ/ ఎస్టీ జనాభా ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలకు 10%
నిధులు కేటాయిస్తున్న సమయంలో ప్రాముఖ్యతను ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా ఈ ప్రాంతాలను ప్రాధాన్యతలకు అనుగుణంగా కవర్ చేయాలన్నది లక్ష్యం. అదనంగా, మిషన్‌ను వేగవంతంగా అమలు చేసేందుకు జెజెఎం- ఎంఐఎస్‌లో , జెజెఎం డ్యాష్‌బోర్డులో (ప్యానెల్) అత్యున్నత స్థాయిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేబినెట్ కార్యదర్శులు, కార్యదర్శి, ఆయా రాష్ట్రాలు/ కేంద్ర ప్రభుత్వాల ఇన్‌ఛార్జ్ కార్యదర్శులతో క్రమబద్ధంగా సమీక్షా సమావేశాలను, సదస్సులను, వర్క్‌షాపులను, వీడియో కాన్ఫరెన్సులను, క్షేత్ర పర్యటనల ద్వారా ఆయా రాష్ట్రాలతో ఫాలోఅప్ లు, సమర్ధవంతమైన పర్యవేక్షణల కోసం ఏర్పాటు చేసింది.
గిరిజన కుటుంబాలకు అందించిన పంపునీటి కనెక్షన్ల వివరాలను కేంద్రం నిర్వహించడం లేదు. అయితే, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల వారీగా ఆయా రాష్ట్రాలలో, గిరిజన ప్రాంతాలలో గ్రామీణ కుటుంబాలకు 02.02.2023 నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన పంపు నీటి కనెక్షన్ల సమాచారం జాబితాను జోడించిడమైంది.
ఈ సమాచారాన్ని రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1896821)
Visitor Counter : 186