ఆయుష్
బడ్జెట్ 2023-24 ఆయుష్ సేవలు మరియు శాస్త్రీయ పరిశోధనలను పెంచడానికి ప్రధాన ప్రాధాన్యతనిస్తుంది
జాతీయ ఆయుష్ మిషన్ బడ్జెట్ కేటాయింపుల్లో 50 శాతం పెరుగుదల
Posted On:
01 FEB 2023 7:30PM by PIB Hyderabad
ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2023-24 బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థలో ఆయుష్ వ్యవస్థను సమగ్రపరచడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు మొత్తం 20 శాతం పెరిగి రూ.3647 కోట్లకు చేరాయి. ఆయుష్ రీసెర్చ్ కౌన్సిల్స్ ద్వారా ఆయుష్ సిస్టమ్స్‌లో నిర్ధారణ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడంపై కూడా బడ్జెట్‌లో ఉద్ఘాటించారు.
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ఆయుర్వేదానికి సంబంధించిన డేటాబేస్ యొక్క నిర్ధారణ ఆధారిత ఉత్పత్తి అవసరం గురించి మాట్లాడారు, ఇది ఆధునిక విజ్ఞాన పారామితులను పూర్తి చేస్తుంది. ఆయుష్ రీసెర్చ్ కౌన్సిల్స్ మరియు ఇన్‌స్టిట్యూట్‌లకు పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపులు అదే నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.
కేంద్ర ప్రాయోజిత జాతీయ ఆయుష్ మిషన్ (నామ్)కు బడ్జెట్ కేటాయింపులు రూ. 800 కోట్ల నుంచి రూ. 1200 కోట్లకు 50 శాతం పెరిగాయి. ఆయుష్ హాస్పిటల్స్ మరియు డిస్పెన్సరీల ఉన్నతీకరణ ద్వారా అందరికీ అందుబాటు లో తక్కువ ఖర్చుతో కూడిన ఆయుష్ సేవలను అందించడం, వైద్య ఆరోగ్య సదుపాయాలను వైద్య & శ్రేయస్సు కేంద్రాలు గా (HWC) ఉన్నతీకరణ చేయడం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మరియు ఆయుష్ సౌకర్యాల సహ-స్థానంపై ఎన్ ఏ ఎం, పీ హెచ్ సీ లు, సీ హెచ్ సీ లు & డీ హెచ్ లపై ప్రధానంగా దృష్టి సారించింది.
ఎన్ ఏ ఎం వైద్య ఔషధ మొక్కల పెంపకం, ఆయుష్ సరఫరా కోసం నాణ్యమైన మరియు ప్రామాణికమైన పదార్ధాల ఉత్పత్తి, వ్యవసాయ వ్యవస్థలలో ఔషధ మొక్కలను ఏకీకృతం చేయడం మరియు ఔషధ మొక్కల విలువ జోడించిన వస్తువుల ఎగుమతిని పెంచడానికి కూడా మద్దతు ఇస్తుంది.
అన్ని రాష్ట్రాలు (రూ. 920 కోట్లు), కేంద్ర పాలిత ప్రాంతాలు (రూ. 96 కోట్లు) మరియు ఈశాన్య ప్రాంతాలు (రూ. 231 కోట్లు) కూడా గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌లు రూ. 861.97 కోట్ల నుండి రూ. 1246.73 కోట్లకు పెరిగాయి.
బడ్జెట్ భారతీయ సాంప్రదాయ భారతీయ వైద్య విధానం యొక్క బలాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. హోమియోపతి, యునాని, సిద్ధ, నేచురోపతి మరియు సోవా రిగ్పా వంటి ఇతర ఆయుష్ వ్యవస్థలను విద్యా సౌకర్యాన్ని మరియు సామజిక లభ్యత అందుబాటు ను మెరుగుపరచడం ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
***
(Release ID: 1895601)
Visitor Counter : 290