మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉన్నత విద్య -2020-21 మీద అఖిల భారత సర్వే విడుదల చేసిన విద్యా మంత్రిత్వశాఖ


ఉన్నత విద్యలో చేరికలు 4,14 కోట్లకు పెరుగుదల; 4 కోట్లు దాటటం ఇదే మొదటి సారి; 2019-20 నుంచి 7.5%, 2014-15 నుంచి 21% పెరుగుదల

2 కోట్లకు చేరిన మహిళల చేరికలు ; 2019-20 కంటే 13 లక్షల పెరుగుదల

2014-15 తో పోల్చినప్పుడు 2020-21 లో చెప్పుకోదగిన రీతిలో ఎస్సీల చేరికల్లో 28% పెరుగుదల, ఎస్సీ మహిళల్లో 38% చేరికల పెరుగుదల

2014-15 తో పోల్చినప్పుడు 2020-21 లో చెప్పుకోదగిన రీతిలో ఎస్టీల చేరికల్లో 47% పెరుగుదల, ఎస్టీ మహిళల్లో 63.4% చేరికల పెరుగుదల

2014-15 తో పోల్చినప్పుడు 2020-21 లో చెప్పుకోదగిన రీతిలో ఓబీసీల చేరికల్లో 32% పెరుగుదల, ఓబీసీ మహిళల్లో 39% చేరికల పెరుగుదల

2014-15 తో పోల్చినప్పుడు 2020-21 లో చెప్పుకోదగిన రీతిలోఈశాన్య ప్రాంత విద్యార్థుల చేరికల్లో 29% పెరుగుదల, ఈశాన్య ప్రాంత మహిళల్లో 38% చేరికల పెరుగుదల

అన్ని సామాజిక వర్గాలలో స్థూల చేరికల నిష్పత్తి నిరుటి కంటే పెరుగుదల

దూర విద్యలో చేరికలు 2019-20 లో కంటే 2020-21 లో 7% పెరుగుదల

2019-20 కంటే 2020-21 లో యూనివర్సిటీల సంఖ్య 70 పెరుగుదల; కాలేజీల సంఖ్య 1,453 పెరుగుదల

లింగ భేద సూచీ 2017-18 లో 1 కాగా 2020-21 లో 1.05 కు పెరుగ

Posted On: 29 JAN 2023 7:20PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ  శాఖ ఉన్నత విద్య -2020-21 మీద అఖిల భారత సర్వే విడుదల చేసింది. ఈ మంత్రిత్వ శాఖ 2011 నుంచి ఉన్నత విద్య మీద అఖిల భారత సర్వే జరుపుతూ వస్తోంది. ఇందులో భారత భూభాగంలోని అన్ని  ఉన్నత విద్యా సంస్థల సమాచారమూ ఉంటుంది.  విద్యార్థుల చేరికలు, ఉపాధ్యాయుల సమాచారం, మౌలిక సదుపాయాల సమాచారం, ఆర్థిక సంబంధమైన సమాచారం ఇందులో ఉంటాయి. మొట్ట మొదటి సారిగా ఉన్నత విద్యా సంస్థలు వెబ్ డేటా కాప్చర్  ఫార్మాట్ లో ఆన్ లైన్ వేదిక ద్వారా అందించాయి. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కేంద్రం ద్వారా ఉన్నత విద్యాశాఖ నిర్మించింది.

సర్వే ముఖ్యాంశాలు ఇవి:

విద్యార్థుల చేరికలు

ఉన్నత విద్యా సంస్థలలో చేరికలు 2019-20 లో 3.85 కోట్లు ఉండగా 2020-21 లో అది 4.114 కోట్లకు పెరిగింది. 2014-15 నాటి నుంచి చేరికలలో 72 లక్షల (12%) పెరుగుదల నమోదు చేసుకుంది.

మహిళల చేరికలు 2019-20 లో 1.88 కోట్లు కాగా, 2019-20 నాటికి 2.01 కోట్లకు చేరింది. 2014-15 తో పోల్చుకున్నప్పుడు 44 లక్షల మంది పెరుగుదల (28%) నమోదైంది. 

మొత్తం చేరికలలో మహిళలావాటా 2014-15 లో 45% ఉండగా 2020-21 నాటికి అది పెరిగి 49% అయింది.

2011 జనాభా లెక్కల ప్రకారం 18-23 వయోవర్గంలో చేరికలు 25.6% ఉండగా 2019-20 నాటికి అది 27.3 శాతానికి పెరిగింది.

2019-20 తో పోల్చుకున్నప్పుడు 2020-21 లో గిరిజన విద్యార్థుల స్థూల చేరికల నిష్పత్తి 1.9 పాయింట్లు పెరగటం గమనార్హం.

2017-18 నుంచి మహిళల స్థూల చేరికల నిష్పత్తి పురుషులని దాటిపోయింది. లింగ భేద  సూచీలో మహిళల స్థూల చేరికల నిష్పత్తితో, పురుషుల చేరికల నిష్పత్తిని పోల్చినప్పుడు అది 2017-18 లో 1 ఉండగా 2020-21 నాటికి 1.05 కు పెరిగింది.

ఎస్సీ విద్యార్థుల చేరిక 2014-15 లో 46.06 లక్షలు, 2019-20 లో 56.57 లక్షలు ఉండగా 2020-21 లో 58.95 లక్షలు అయింది.

ఎస్టీ విద్యార్థుల చేరిక 2014-15 లో 16.41 లక్షలు కాగా 2019-20 లో 21.6 లక్షలు, 2020-21 లో 24.1 లక్షలకు పెరిగింది.

ఎస్టీ విద్యార్థుల సగటు వార్షిక చేరికలు 2007-08 నుంచి 2014-15 వరకు 75,000 ఉండగా 2014-15 నుంచి 2020-21 కి  అది 1లక్షకు చేరింది.

ఓబీసీ విద్యార్థుల చేరికలు కూడా 2020-21 లో 6 లక్షలు పెరిగి1.48 కోట్లకు చేరాయి.  అది 2019-20 లో 1.42 కోట్లు ఉండేది. ఓబీసీ విద్యార్థుల చేరికలలో 2014-15నుంచి చెప్పుకోదగ్గ పురోగతి ఉంది. దాదాపు 36 లక్షలమంది (32%) పెరిగారు.

ఈశాన్య రాష్ట్రాలలో మొత్తం విద్యార్థుల చేరికలు 2014-15 లో 9.36 లక్షలు కాగా 2020-21 లో అది 12.06 లక్షలకు పెరిగాయి.  

ఈశాన్య రాష్ట్రాలలో మహిళా విద్యార్థుల చేరికలు 2020-21 లో 6.14 లక్షలు. ఇది పురుషుల చేరికల సంఖ్య 5.92 లక్షలకంటే ఎక్కువ. ( ప్రతి 100 మంది పురుషులకూ 104 మంది మహిళలున్నట్టు నికర చేరికల నిష్పత్తి చెబుతోంది.) మొట్టమొదటి సారిగా 2018-19 లో పురుషులకంటే మహిళల చేరికలు పెరగటం మొదలై అదే ధోరణి కొనసాగుతోంది.

దూరవిద్యలో చేరికలు 45.71 లక్షలు (అందులో 20.9 లక్షలమంది మహిళావిద్యార్థులు). ఇది 2019-20 తో పోల్చుకుంటే సుమారు 7 శాతం పెరిగినట్టు. 2014-15 తో పోల్చినప్పుడు 20 శాతం పెరిగినట్టు. 

చేరిన విద్యార్థుల సంఖ్యలో మొదటి ఆరు రాష్ట్రాలు - ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్

ఉన్నత విద్య మీద 2020-21 అఖిలభారత సర్వే ప్రకారం మొత్తం విద్యార్థులలో దాదాపు 79.06% మంది డిగ్రీ స్థాయిలో చేరినవారు కాగా 11.5 % మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల్లో చేరినవారు.

డిగ్రీ స్థాయి కోర్సుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఆర్ట్స్ లో 20.56%, ఆ తరువాత సైన్స్ లో  15.5%, కామర్స్ లో 13.9%, ఇంజనీరింగ్ లో 11.9% చేరారు.

అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అయితే అత్యధికంగా సామాజిక శాస్త్రాలలో 20.56% మంది, ఆ తరువాత  సైన్స్ లో 14.83% మంది చేరారు.

మొత్తం చేరికలలో 55.5 లక్షలమంది సైన్స్ లో చేరగా వాళ్ళలో 26 లక్షలమంది పురుషులు. వారికంటే ఎక్కువగా మహిళల సంఖ్య 29.5 లక్షలుగా నమోదైంది.

ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వాటా 59% కాగా చేరికల వాటా 73.1% నమోదైంది. ప్రభుత్వ కళాశాలల వాటా 21.4% కాగా చేరికల వాటా 34.5% నమోదైంది.

జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలలో చేరికలు 2014-15 తో పోల్చుకుంటే 2020-21 నాటికి  దాదాపు 61% పెరిగాయి.

రక్షణ, సంస్కృతి, బయో టెక్నాలజీ, ఫోరెన్సిక్, డిజైన్, క్రీడల వంటి ప్రత్యేకాంశాల విశ్వవిద్యాలయాలలో చేరికలు 2014-15 నుంచి 2020-21 నాటికి పెరిగాయి.

ఉత్తీర్ణత కూడా పెరిగింది. 2019-20 లో 94 లక్షలుండగా 2020-21 లో 95.4 లక్షలకు పెరిగింది.

ఉన్నత విద్యా సంస్థలలో 2020-21 లో వివిధ మౌలిక సదుపాయాల అందుబాటు :

గ్రంధాలయాలు (97%)

ప్రయోగశాలలు  (88)

కంప్యూటర్ కేంద్రాలు (91%, 2019-20 లో 86%)

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (61%, 2019-20 లో 58%)

నేషనల్ నాలెడ్జ్ నెట్ వర్క్ తో అనుసంధానత  (2019-20 లో 34% కాగా ఇప్పుడు 56%)

సంస్థల సంఖ్య 

మొత్తం నమోదైన విశ్వ విద్యాలయాలు, విశ్వవిద్యాలయ హోదా ఉన్న సంస్థలు 1,113 కాగా కళాశాలలు 43,796. స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థలు 11,296.  

2020-21లో విశ్వవిద్యాలయాల సంఖ్య 70 పెరిగింది.  కళాశాల సంఖ్య 1,453 పెరిగింది.

2014-15 నుంచి 353 విశ్వవిద్యాలయాలు పెరిగాయి. అంటే, పెరుగుదల శాతం 46.4% గా నమోదైంది

జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు 2014-15 లో 75 ఉండగా ఇప్పుడు దాదాపు రెట్టింపై  2020-21 లో 149 అయింది

2014-15 తరువాత ఈశాన్య రాష్ట్రాలలో 191 కొత్త ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి.  

విశ్వవిద్యాలయాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు : రాజస్థాన్ (92), ఉత్తరప్రదేశ్ (84), గుజరాత్ (83)

2014-15 నుంచి 2020-21 మధ్య సగటున ఏటా 59 చొప్పున విశ్వవిద్యాలయాలు అదనంగా వచ్చాయి. 2007-08 నుంచి 2014-15 మధ్య ఇది 50 చొప్పున  ఉండేది.  

17 విశ్వవిద్యాలయాలు (14 ప్రభుత్వ ఆధ్వర్యంలో) 4,375 కళాశాలలు కేవలం మహిళల కోసమే ఉద్దేశించినవి

కళాశాలల సాంద్రత, అంటే అర్హతగల జనాభా (18-23 వయోవర్గం) లో ప్రతి లక్షమందికి  కళాశాలల సంఖ్య 31 గా ఉంది. 2014-15 లో ఇది 27. 

అత్యధిక కళాశాల సాంద్రత ఉన్న రాష్ట్రాలు: కర్ణాటక(62), తెలంగాణ(53), కేరళ (50), హిమాచల్ ప్రదేశ్ (50), ఆంధ్రప్రదేశ్ (49), ఉత్తరాఖండ్ (40), రాజస్థాన్(40), తమిళనాడు (40) 

అత్యధిక కళాశాలలున్న 8 జిల్లాలు: బెంగళూరు అర్బన్ (1058), జైపూర్ (671), హైదరాబాద్ (488), పూణే(466), ప్రయాగ రాజ్ (374), రంగారెడ్డి (345), భోపాల్ (327), నాగపూర్ (318)  

అత్యధిక సంఖ్యలో కళాశాలలున్న రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్

గ్రామీణ ప్రాంతాలలో 43% విశ్వవిద్యాలయాలు,  61.4% కళాశాలలు నెలకొని ఉన్నాయి.

బోధనాసిబ్బంది

మొత్తం బోధనా సిబ్బంది 15,51,070 కాగా వారిలో 57.1% మంది పురుషులు,  42.9% మంది మహిళలు

ప్రతి 100 మంది పురుష అధ్యాపకులకూ మహిళా అధ్యాపకుల సంఖ్య 2014-15 లో 63 ఉండగా 2020-21 నాటికి అది 75 కు పెరిగింది.   

***


(Release ID: 1894602) Visitor Counter : 482


Read this release in: English , Urdu , Marathi , Hindi