కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) వాల్యుయేషన్ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి ఫ్లాగ్‌షిప్ వాల్యుయేషన్ కోర్సు మూడవ బ్యాచ్‌ను ప్రారంభించింది

Posted On: 29 JAN 2023 8:44PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని థింక్ ట్యాంక్ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) ఈ రోజు ఐసీఏ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ (ఐవీసిపి) వాల్యుయేషన్ ఎడ్యుకేషన్‌లో గోల్డ్ స్టాండర్డ్  మూడవ బ్యాచ్‌ను ప్రారంభించింది.

జనవరి 28, 2023న నిర్వహించిన వర్చువల్ ప్రోగ్రామ్‌కు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మరియు బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా శ్రీమతి అనితా షా అకెల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శ్రీ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ జనరల్ మరియు సీఈఓ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్; శ్రీమతి వేణి థాపర్, బోర్డ్ మెంబర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా &ఐఐసీఏ; శ్రీ రాజీవ్ సింగ్ ఎఫ్‌సిఎ, ప్రముఖ వాల్యుయేషన్ ప్రాక్టీషనర్ మరియు అనుబంధ ఫ్యాకల్టీ, ఐఐసీఏ మరియు స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపక అధిపతి ప్రొఫెసర్ (డా) నవీన్ సిరోహి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రసంగించారు.

 

image.png

 

పాల్గొనేవారిని ఉద్దేశించి శ్రీమతి అనితా షా అకెల్లా మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వంలో వాల్యుయేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశంలో వాల్యుయేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని కోర్సు ద్వారా సాఫ్ట్ (అంటే నాలెడ్జ్) మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా వాల్యుయేషన్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడంలో ఐఐసీఏ సహకారం అందించినందుకు ఆమె ప్రశంసించారు. మరింత పారదర్శక, ఏకరీతి మరియు భారతదేశ-కేంద్రీకృత మదింపు ప్రమాణాల ద్వారా  సంస్థ యొక్క మొత్తం మదింపును తీసుకురావడానికి ఐబిబిఐ కృషి చేస్తోందని మరియు ఐఐసీఏ, వాల్యుయేషన్ రంగంలో మరియు నిపుణుల నెట్‌వర్క్‌లో దాని అభివృద్ధి చెందిన సామర్థ్యాలతో ఐఐసిఏ నుండి నిష్పాక్షికతను సమర్థవంతంగా అందించగలదని ఆమె తెలిపారు.

ఐవీసిపీ కోర్సు వ్యవస్థాపక బ్యాచ్‌లో భాగస్వామిగా తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఎంఎస్ వేణి థాపర్ కోర్సు పాఠ్యాంశాలు కేవలం వాల్యుయేషన్ నంబర్ క్రంచింగ్ వ్యాయామం సంకలనం కాదని, సమగ్రమైన, ఇంటర్-డిసిప్లినరీ అవగాహనను అందించడానికి బహుళ కోర్సుల కలయిక అని అభిప్రాయపడ్డారు. ఐసివిపీ ప్రోగ్రామ్ మూల్యాంకన పరిజ్ఞానం, అంచనాలు మరియు వాటి సరైన మరియు సముచితమైన అప్లికేషన్‌ల యొక్క విభిన్న దృక్కోణాల గ్రాన్యులర్ అవగాహన ద్వారా నేర్చుకోవడాన్ని చెబుతుందని వెల్లడించారు.

ఐఐసిఎ డైరెక్టర్ జనరల్ మరియు సిఇఒ శ్రీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..థింక్ ట్యాంక్‌గా ఐఐసిఎ సామర్థ్య పెంపుదల, విద్య, పరిశోధన, న్యాయవాద మరియు వ్యాపార సంఘ సమకాలీన సమస్యలపై సలహా సేవల్లో చురుకుగా నిమగ్నమై ఉందని మరియు ప్రభుత్వ  మూల్యాంకన రంగాలపై దృష్టి సారిస్తుందని అన్నారు. పరిశ్రమ డిమాండ్ చేసే వాటి కంటే ముందుగా అవసరం ఉన్న ప్రాంతాలను ఇన్‌స్టిట్యూట్ గుర్తిస్తుందని ప్రత్యేకమైన పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు. వాల్యుయేషన్ కోర్సును ఎంచుకున్నందుకు పాల్గొనేవారిని ఆయన అభినందించారు.

ఎఫ్‌సిఏ, రిప్యూటేషన్ మరియు అనుబంధ ఫ్యాకల్టీ మరియు ఐఐసీఏ వాల్యుయేషన్ నిపుణులు శ్రీ రాజీవ్ సింగ్  మాట్లాడుతూ..ఐవిసీపి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతమైన వాల్యుయేషన్ కోర్సులలో ఒకటిగా రూపొందించబడిందన్నారు. కోర్స్ కంటెంట్‌లు ఆర్బిట్రేషన్ కాన్సెప్ట్ కోసం వాల్యుయేషన్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ వాల్యుయేషన్ సమస్యలు, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ వాల్యుయేషన్, ఫెయిర్ వాల్యూ మెజర్‌మెంట్ స్టాండర్డ్స్ మరియు బిహేవియరల్ ఫైనాన్స్ వంటి అంతర్జాతీయంగా మరే ఇతర కోర్సు ద్వారా కవర్ చేయబడని అనేక అంశాలు కలిగి ఉన్నాయన్నారు.

వాల్యుయేషన్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి కోర్సులో నిజమైన సమగ్ర విధానం ఉందని ఐఐసిఎ వ్యవస్థాపక హెడ్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ మరియు కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ నవీన్ సిరోహి పేర్కొన్నారు. ఈ కోర్సు ఇంటర్నేషనల్ వాల్యుయేషన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉందని, ఇది ప్రస్తుత ఇంటర్‌కనెక్టడ్ ప్రపంచంలో అవసరమైన గ్లోబల్ ఫ్లేవర్‌ను ఇస్తుందని తెలిపారు. అధ్యాపకుల్లో అకాడెమియా, పరిశ్రమలు మరియు నియంత్రణ సంస్థల నుండి తీసుకోబడిన ప్రపంచ నిపుణులు ఉన్నారని చెప్పారు. పాల్గొనేవారి  వైవిధ్య సమూహం తోటివారి అభ్యాసాన్ని మరియు మదింపు సంబంధిత సమస్యల యొక్క సమగ్ర దృక్పథాన్ని ఏర్పరుస్తుందని అభిప్రాయపడ్డారు.

విభిన్న విద్యా మరియు వృత్తిపరమైన నేపథ్యం మరియు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిజిస్టర్డ్ వాల్యూయర్‌లు మరియు ప్రొఫెషనల్స్‌తో పని చేస్తున్న బ్యాచ్-IIIకి చెందిన 100+ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిలేష్ త్రిపాఠి, శ్రీ నరేంద్ర సౌన్ మరియు మిస్టర్ అభిజిత్ చక్రబర్తి కూడా పాల్గొన్నారు.

ఐఐసిఎ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ (ఐవిసిపి) అనేది ఐఐసిఎ ఫ్లాగ్‌షిప్ కోర్సు. ఇది 'వాల్యుయేషన్ ఎడ్యుకేషన్‌లో గోల్డ్ స్టాండర్డ్' విశిష్టతను సంపాదించింది. 2019లో ప్రారంభించబడింది. విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన 250  మంది కంటే ఎక్కువ మంది 20 కంటే ఎక్కువ సంవత్సరాల సగటు అనుభవంతో కోర్సు కోసం నమోదు చేసుకున్నారు. ఈ కోర్సును ఇంటర్నేషనల్ వాల్యుయేషన్ స్టాండర్డ్స్ కౌన్సిల్ (ఐవిఎస్‌సి) గుర్తించింది. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబిబిఐ) ద్వారా రిజిస్టర్డ్ వాల్యూయర్‌లందరికీ (ఆర్‌వీలు), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్‌ఎస్‌) పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు (పిఎస్‌బిలు) మరియు ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎఫ్‌ఐలు) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఏఎం) సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సిపిఎస్‌ఈలు)లకు సిఫార్సు చేయబడింది.


 

****


(Release ID: 1894601) Visitor Counter : 147


Read this release in: English , Urdu