పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మొబైల్ ఉత్పత్తి యూనిట్ గా జాతికి పునరంకితం అయిన ఓఎన్జీసీ ప్రధాన సాగర్ సామ్రాట్


లోతైన సముద్ర జలాల్లో పనిచేసే సాగర్ సామ్రాట్ నూతన నిక్షేపాలు గుర్తిస్తుంది.. శ్రీ హర్దీప్ ఎస్.పూరి

రానున్న రోజుల్లో భారతదేశంలో రోజుకు అదనంగా 6000 బిబిఎల్ చమురు ఉత్పత్తి అవుతుంది.. శ్రీ హర్దీప్ ఎస్.పూరి

Posted On: 29 JAN 2023 3:03PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహనిర్మాణం,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  శ్రీ హర్దీప్ ఎస్.పూరి  ఓఎన్జీసీ ప్రధాన డ్రిల్లింగ్ యూనిట్  సాగర్ సామ్రాట్ ను మొబైల్ ఆఫ్ షోర్ ఉత్పత్తి యూనిట్ గా జాతికి అంకితం చేశారు. కార్యక్రమం అనంతరం ప్రసంగించిన శ్రీ పూరి ' అనిశ్చిత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనే విధంగా వినూత్న విధానాల ద్వారా పనితీరు మార్చడానికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని సంసిద్ధంగా ఉండాలి అనే విధానానికి  సాగర్ సామ్రాట్ పునరంకితం పెద్ద నిదర్శనం' అని అన్నారు.  
 
 
 
మొబైల్ ఉత్పత్తి యూనిట్ గా సాగర్ సామ్రాట్ జాతికి పునరంకితం చేస్తున్న శ్రీ హర్దీప్ ఎస్.పూరి 
' సాగర్ సామ్రాట్ ఇకపై మొబైల్ ఆఫ్ షోర్ ఉత్పత్తి కేంద్రంగా సాగర జలాల్లో పనిచేస్తుంది. ఓఎన్జీసీ కి సాగర్ సామ్రాట్ పెద్ద ఆస్తి. సాగర్ సామ్రాట్ పునరంకిత కార్యక్రమంలో ఓఎన్జీసీ కుటుంబంలో పాల్గొన్నాను. 1973 లో సాగర్ సామ్రాట్ నిర్మాణం పూర్తయింది. 14 కీలక ఆఫ్ షోర్ పథకాలు, సహజవాయువు నిక్షేపాలు గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన సాగర్ సామ్రాట్ 125 బావులు తవ్వింది' అని శ్రీ పూరి తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
'అత్యాధునిక సాగర్ సామ్రాట్ రోజుకు 20,000 బిపిడి ముడి చమురు ఉత్పత్తి చేసి రోజుకు 2.36 ఎంసిఏం సహజ వాయువును ఎగుమతి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీనివల్ల  రానున్న రోజుల్లో భారతదేశంలో రోజుకు అదనంగా 6000 బిబిఎల్ చమురు ఉత్పత్తి అవుతుంది' అని శ్రీ పూరి తన ట్వీట్ లో వివరించారు. 
'2047 నాటికి  ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక పెద్ద ముందడుగు. సాగర్ సామ్రాట్ లోతైన సముద్ర జిల్లాలో పనిచేసి గతంలో గుర్తించని చమురు నిక్షేపాలను గుర్తిస్తుంది' అని శ్రీ పూరి పేర్కొన్నారు.  
1973 లో సాగర్ సామ్రాట్ నిర్మాణం పూర్తయింది. 14 కీలక ఆఫ్ షోర్ పథకాలు, సహజవాయువు నిక్షేపాలు గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది.  సాగర్ సామ్రాట్ దాదాపు 125 బావులు తవ్వకాల్లో భాగం పంచుకుంది. 
జాక్-అప్ డ్రిల్లింగ్ రిగ్గు గా సాగర్ సామ్రాట్ గతంలో పనిచేస్తోంది. ఇప్పుడు మొబైల్ ఆఫ్ షోర్ ఉత్పత్తి కేంద్రంగా సాగర్ సామ్రాట్ పనిచేస్తుంది. సాగర్ సామ్రాట్ ను జాక్-అప్ డ్రిల్లింగ్ రిగ్గు నుంచి మొబైల్ ఆఫ్ షోర్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడానికి అవసరమైన మార్పులు చేర్పులు టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న ది బ్రిటిష్ ఇంజనీరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ అయిన వుడ్స్ గ్రూప్ కి చెందిన ముస్తాంగ్ చేపట్టింది. 
2022 డిసెంబర్ 23 నుంచి మొబైల్ ఆఫ్ షోర్ ఉత్పత్తి కేంద్రంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం సాగర్ సామ్రాట్ దేశ పశ్చిమ తీరంలో ముంబై కి 140-45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్రన్ ఆఫ్ షోర్-16 క్షేత్రంలో పనిచేస్తోంది. ఓఎన్జీసీ నిర్వహిస్తున్న డబ్ల్యు ఓ-16 బావికి సమీపంలో 76 మీటర్ల లోటు సముద్ర జలాల్లో సాగర్ సామ్రాట్ ఉంది.వెస్ట్రన్ ఆఫ్ షోర్ లో ఉత్పత్తి మరింత ఎక్కువగా జరిగేందుకు సాగర్ సామ్రాట్ కార్యకలాపాలు సహకరిస్తాయి. రోజుకు 20,000 బ్యారెళ్ల సహజ వాయువును ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న యూనిట్ రోజుకు 2.36 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను ఎగుమతి చేస్తుంది. 
 
2023 జనవరి 23న  ముంబై కి 140-45 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న సాగర్ సామ్రాట్ లో ఏర్పాటైన కార్యక్రమంలో శ్రీ పోరి  మొబైల్ ఉత్పత్తి యూనిట్ ను  జాతికి పునరంకితం చేశారు  కార్యక్రమంలో  ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్, పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ పాల్గొన్నారు.  
అనంతరం శ్రీ పూరి సాగర్ సామ్రాట్ ను డ్రిల్లింగ్ రిగ్ గా నిర్వహించిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, సాగర్ సామ్రాట్ పునర్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కలుసుకున్నారు.   ఓఎన్జీసీ  సిబ్బందిని దేశ దేశ ఇంధన వీరులుగా శ్రీ పూరి వర్ణించారు. ఇంధన భద్రత కల్పించడానికి జరుగుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. హైడ్రో కార్బన్ రంగంలో భారతదేశాన్ని పనికిరాని దేశంగా వర్ణించిన సమయంలో సాగర్ సామ్రాట్ నిర్మాణం జరిగిందని పేర్కొన్న శ్రీ పూరి దేశ సహజ వాయువు రంగం సాధించిన ప్రగ్రతిని వివరించారు. 
2025 నాటికి 0.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 2030 నాటికి మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు నిక్షేపాల అన్వేషణ సాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ పూరి వివరించారు. 'నో గో' ప్రాంతాన్ని 99% మేరకు తగ్గించిన ప్రభుత్వం దేశంలో ఈఈజెడ్ లో అదనంగా మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అన్వేషణ కోసం అదనంగా అందుబాటులోకి తెచ్చిందన్నారు. భారతదేశ ఈ అండ్ పి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చివరాన్,ఎక్సాన్ మొబిల్ , టోటల్ ఎనర్జీస్ లాంటి బహుళజాతి సంస్థలు ముందుకు వస్తున్నాయని శ్రీ పూరి తెలిపారు. భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొన్ని సంస్థలు ఇప్పటికే ఓఎన్జీసీ తో సంప్రదింపులు జరుపుతున్నాయని అన్నారు. 
 
 
మొబైల్ ఉత్పత్తి యూనిట్ గా సాగర్ సామ్రాట్ ను జాతికి పునరంకితం చేసిన అనంతరం ప్రసంగిస్తున్న శ్రీ హర్దీప్ ఎస్.పూరి
***

(Release ID: 1894547) Visitor Counter : 179