ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్రాండ్ అంబాసిడర్‌గా బాక్సర్ నిఖత్ జరీన్‌ను నియమించుకున్న ఎన్‌ఎండీసీ

प्रविष्टि तिथि: 28 JAN 2023 6:55PM by PIB Hyderabad

జాతీయ మైనింగ్‌ సంస్థ, దేశంలో అతి పెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు అయిన ఎన్‌ఎండీసీ, తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ బాక్సింగ్ విజేత, బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతక విజేత నిఖత్ జరీన్‌తో ఒప్పందం (ఎంవోయే) కుదుర్చుకుంది. బలం, నాణ్యతకు ప్రతీక అయిన ఎన్‌ఎండీసీ, దేశ గౌరవాన్ని పెంచేందుకు నిబద్ధులైన వ్యక్తి తనకు ప్రాతినిధ్యం వహించాలన్న భావనతో నిఖత్‌ జరీన్‌ను ఎంచుకుంది. నిఖత్ జరీన్ బలం, ధైర్యం, చురుకుదనం, జాతి గర్వించే విజయాలు వంటివి ఎన్‌ఎండీసీ బ్రాండ్‌కు ప్రతిబింబంగా ఉంటాయి.

నిఖత్ జరీన్‌ను ఎన్‌ఎండీసీ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీ సుమిత్ దేబ్ చెప్పారు. దేశానికి కీర్తి తీసుకురావాలనే ఆమె నిబద్ధత తమ సంస్థ విలువల్లో ప్రతిధ్వనిస్తుందని అన్నారు. ఎన్‌ఎండీసీ విశ్వసనీయత, దృఢత్వానికి నిఖత్‌ జరీన్‌ వ్యక్తిత్వం పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కలయిక రెండు వర్గాల పరపతిని పెంచుతుందన్నారు.

ప్రపంచ బాక్సింగ్‌ విజేతగా ఎదగడానికి చేసిన తన జీవిత ప్రయాణం మాట్లాడిన నిఖత్‌, "దేశ ప్రతిష్ట పెంచడానికి ఎన్‌ఎండీసీతో చేతులు కలపడం నాకు గర్వకారణం. 2024 ఒలింపిక్స్ కోసం శిక్షణలో నాకు మద్దతు ఇచ్చినందుకు సంస్థకు నా కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులు, దేశం గర్వించేలా చేయడానికి నేను నిబద్ధతతో ఉన్నాను" అని చెప్పారు.

******


(रिलीज़ आईडी: 1894507) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu