ఉక్కు మంత్రిత్వ శాఖ
ఆర్ఐఎన్ఎల్ మొట్టమొదటి జాతీయ విక్రేత ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌ను నిర్వహణ
ఎంఎస్ఈ ల వృద్ధికి ఆర్ఐఎన్ఎల్ కట్టుబడి ఉంది: శ్రీ అతుల్ భట్, సీఎండీ ఆర్ఐఎన్ఎల్
Posted On:
28 JAN 2023 7:42PM by PIB Hyderabad
ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు “ ఆర్ఐఎన్ఎల్ ఎన్విఐపి -2023- జాతీయ విక్రేత ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ -2023 ను నిర్వహించింది శ్రీ అతుల్ భాట్, సిఎండి, ఆర్ఐఎన్ఎల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ వివి వేణుగోపాల రావు, డైరెక్టర్ (ఫైనాన్స్), డికె మొహంతి, డైరెక్టర్ (కమర్షియల్), శ్రీ ఎకె బాగ్చి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఆపరేషన్స్), శ్రీ జివిఆర్ నాయుడు, అదనపు డైరెక్టర్-ఇన్-ఛార్జ్, ఎంఎస్ఎమ్, డిఎఫ్ఓ, విశాఖపట్నం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా విక్రేతలు పాల్గొన్నారు.
విక్రేతలను ఉద్దేశించి, శ్రీ అతుల్ భట్, సిఎండి, మాట్లాడుతూ ఇటువంటి విక్రేతలతో భేటీలు సరఫరాదారులు, ఆర్ఐఎన్ఎల్ రెండింటి అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. ఆర్ఐఎన్ఎల్ విక్రేతల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. దిగుమతుల స్వదేశీకరణ విక్రేతలకు తక్షణమే అందుబాటులో ఉన్న అవకాశం అని ఆయన వ్యక్తం చేశారు. స్వదేశీ దిశగా ఆర్ఐ ఎన్ఎల్ తీసుకున్న అనేక చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని శ్రీ అతుల్ భట్ చెప్పారు.
*****
(Release ID: 1894505)
Visitor Counter : 152