పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఒఎన్‌జిసి సరూపమైన ఐకానిక్ సాగర్ సామ్రాట్‌ను దేశానికి పునరంకితం చేసిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హార్దీప్ సింగ్ పూరి
Posted On:
28 JAN 2023 5:46PM by PIB Hyderabad
" ఒఎన్‌జిసి జీతేగా తో ఇండియా జితేగా ( ఒఎన్‌జిసి విజయం భారతదేశం విజయం)" అని పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హార్దీప్ సింగ్ పూరి అన్నారు. సాగర్ సామ్రాట్‌పై 2023 జనవరి 28 న జరిగిన ఒక కార్యక్రమంలో మొబైల్ ఆఫ్‌షోర్ ప్రొడక్షన్ యూనిట్ (మోపు) గా.ఐకానిక్ డ్రిల్లింగ్ రిగ్ ని మంత్రి పునరంకితం చేశారు. మంత్రి ఒఎన్‌జిసి, ఇంధన సైనికులను వారి కుటుంబాలను కలవడానికి ఒఎన్‌జిసి కేంద్రీయ విద్యా గ్రౌండ్స్, పన్వెల్ ఫేజ్ 1 ను సందర్శించారు.

సాగర్ సామ్రాట్ వద్ద కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు, గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హార్డీప్ ఎస్. పూరి ఒఎన్‌జిసి చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్, డైరెక్టర్ (టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) ఓం ప్రకాష్ సింగ్
సాగర్ సామ్రాట్‌ను డ్రిల్లింగ్ రిగ్‌గా నడుపుతున్న ఒఎన్‌జిసి ఉద్యోగులను మంత్రి కలుసుకున్నారు. దానిని మోపుగా మార్చడానికి పనిచేసిన బృందం కూడా. బొంబాయి హై డిస్కవరీ తరువాత డెబ్బైలలో పనిచేసిన సాగర్ సామ్రాట్ ప్రారంభ సిబ్బందిని మంత్రి సత్కరించారు. భారతదేశ ఇంధన భద్రత కోసం వారి ప్రయత్నాలను కొనసాగించాలని ఇంధన సైనికులకు సూచించారు. హైడ్రోకార్బన్ అన్వేషణ పరంగా ప్రపంచవ్యాప్తంగా "బంజరు" అని ముద్ర పడినపుడు సాగర్ సామ్రాట్ తన స్వంత నూనెనుఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే భారతదేశం దార్శనికతకు సాక్ష్యం అని మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. భారతదేశం ప్రముఖ ఫలవంతమైన ఆయిల్‌ఫీల్డ్‌ను ఉపయోగించడంలో, ఒఎన్‌జిసి పరిజ్ఞానం, నిరంతర నైపుణ్యం, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి స్థిరంగా కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సాగర్ సామ్రాట్ సిబ్బంది మంత్రి నుండి ప్రేరణ పొందారు, “మీరు ఇంధన సైనికులు, మీ ప్రయత్నాలు ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న శక్తి విప్లవానికి బలాన్ని పెంచుతాయి. మీరు భారతదేశ శక్తి పరివర్తనను నడిపించే సిబ్బంది. మీ ప్రయత్నాలు మా జాతీయ శక్తి లక్ష్యాలను గ్రహించే దిశగా మా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. " అని కేంద్ర మంత్రి తెలిపారు.

సాగర్ సామ్రాట్ వద్ద కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు, గృహ, పట్టణ అభివృద్ధి మంత్రి శ్రీ హార్డీప్ సింగ్ పూరి
ఈ సందర్భంగా ఓ ఎన్ జి సి రిగ్స్, ప్లాట్‌ఫారమ్‌ల నమూనాలను కలిగి ఉన్న విద్యా ప్రదర్శన నిర్వహించారు. ‘కలర్స్ ఆఫ్ ఇండియా’ ను జరుపుకునే నృత్య ప్రదర్శన కూడా అనేక పోటీలతో పాటు జరిగింది. మంత్రి ఒఎన్‌జిసి ఉద్యోగులు మరియు కుటుంబాలతో సంభాషించారు మరియు పెరుగుతున్న భారతదేశం యొక్క భవిష్యత్తు వారి సహకారం మీద ఆధారపడి ఉంటుందని వారికి ప్రేరణనిచ్చారు. ప్రపంచంలో భారతదేశం వేగంగా పెరుగుతోంది అని అన్నారు.
1973 లో ప్రారంభమైన సాగర్ సామ్రాట్ జపాన్లోని మిత్సుబిషి యార్డ్‌లో నిర్మించారు. 3 ఏప్రిల్ 1973 న హిరోషిమా నుండి ప్రయాణించారు. ఇది ఒఎన్‌జిసి మొట్టమొదటి ఆఫ్‌షోర్ బావిని 1974 లో అరేబియా సముద్రంలోని ముంబై ఆఫ్‌షోర్ ప్రాంతంలో బొంబాయి హై అని పిలిచేవారు. సాగర్ సామ్రాట్ గ్లోబల్ ఆయిల్ మ్యాప్‌లో ఉంచడం ద్వారా భారతదేశ చమురు సంపద ప్రధానమైంది.

కేంద్ర పెట్రోలియం సహజ వాయువు ,గృహ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హార్డీప్ సింగ్ పూరి ఓంజిసి ఇంధన సైనికులతో కలుసుకున్నారు . వారితో సంభాషించారు
మోపు సాగర్ సామ్రాట్ 23 డిసెంబర్ 2022 న ఉత్పత్తిని ప్రారంభించింది. ముంబైకి పశ్చిమాన 140-145 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్రన్ ఆఫ్‌షోర్ (డబ్ల్యూ.ఓ)-16 ఫీల్డ్‌లో ఈ నౌకను ఉంచారు. 76 మీటర్ల నీటి లోతులో ఓఎన్జీసీ ప్రస్తుత డబ్ల్యూ.ఓ-16 వెల్ ప్లాట్‌ఫాం ప్రక్కనే ఉన్న ఈ నౌక డబ్ల్యూ.ఓ క్లస్టర్‌లోని ఉపాంత క్షేత్రాల నుండి ఉత్పత్తి చేయడంలో కీలకమైనది, తద్వారా పశ్చిమ ఆఫ్‌షోర్ నుండి ఉత్పత్తిని పెంచుతుంది. ముడి చమురు రోజుకు 20,000 బారెల్స్ నిర్వహించడానికి మోపు రూపొందించారు. గరిష్టంగా ఎగుమతి గ్యాస్ సామర్థ్యం రోజుకు 2.36 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంటుంది.
*****
(Release ID: 1894502)
Visitor Counter : 155