నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

టింకరింగ్, ఏఐ ద్వారా ప్రధాన స్రవంతి భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సంయుక్తంగా కృషి చేయనున్న ఏఐఎం, నీతి ఆయోగ్,సీబీఐసీ, ఇంటెల్ ఇండియా

Posted On: 25 JAN 2023 5:06PM by PIB Hyderabad

అధికారిక పాఠ్యాంశాల్లో ఏఐ,టింకరింగ్ వంటి భవిష్యత్తు నైపుణ్యాలను పొందుపరచివిద్యా రంగంలో మార్పు తీసుకురావడానికి సంయుక్తంగా కృషి చేయాలని  అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటెల్ ఇండియాలు నిర్ణయించాయి. 

నూతన విద్యా విధానం 2020 లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం యువతకు సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చి  దేశంలో భవిష్యత్తు నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి కృషి జరుగుతుంది. దీనికోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న  మౌలిక సదుపాయాలను (ఏటీఎల్  మొదలైనవి) పూర్తిగా ఉపయోగించుకుని నూతన విద్యా విధానం 2020 లో పొందుపరిచిన  అనుగుణంగా లక్ష్య సాధన కోసం కృషి జరుగుతుంది. లక్ష్య సాధన కోసం  సెప్టెంబర్ 2022లో పాఠశాల విద్య అంశాలలో  AIoT అంశాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి సంస్థల మధ్య అవగాహన కుదిరింది. 

ప్రాజెక్టు అమలు జరుగుతున్న తీరును సమీక్షించారు. విద్య, సాంకేతిక  రంగానికి చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చి దిశానిర్దేశం చేసిన మేరకు  ఉపాధ్యాయులు స్వయంగా రూపొందించిన AIoT ఇంటిగ్రేషన్-ఆధారిత పాఠ్య ప్రణాళిక అమలు జరుగుతున్న తీరును గమనించారు. 
ఏఐ, AIoT ఆధారంగా రూపొందిన ప్రాజెక్టులను అమలు చేయడం వల్ల ప్రజల్లో కనిపిస్తున్న మార్పులను అధ్యయనం చేశారు. దీని తర్వాత ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తో  విద్యార్థులు వారి  టింకరింగ్,  ఏఐ ఉపయోగించి నూతన అంశాలకు రూపకల్పన చేశారు. 

దేశంలో డిజిటల్ సంసిద్ధతను అభివృద్ధి చేయడానికి జరుగుతున్న భాగస్వాములు కావాలని ఆశిస్తున్న పాఠశాలలు  అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన  70  పాఠ్య ప్రణాళికలతో కూడిన సంకలనాన్ని విడుదల చేశారు. 

సంకలనం విడుదల సందర్భంగా ఏర్పాటైన కారక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ తన ముఖ్య ప్రసంగంలో  “ఒక అంశాన్ని వివిధ పద్ధతుల్లో,బహుళ మార్గాల్లో నేర్చుకోవడం వల్ల సంబంధిత అంశంపై పూర్తి  అవగాహన ఏర్పడుతుంది. అటువంటి బహుళ-మోడల్ అభ్యాసాన్ని సులభతరం చేయడానికి ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలను రూపొందించడానికి  కృషి జరిగింది. దీనికి   ఏఐఎం, నీతి ఆయోగ్,సీబీఐసీ, ఇంటెల్ ఇండియా సహకరించాయి. సమగ్ర AIoT విద్య కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది. దీనిలో అనేక పాఠశాలలు పాల్గొంటున్నాయి. అధ్యాపకులు రూపొందించిన ఈ సమగ్ర AIoT విద్యా ప్రణాళిక  దేశవ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను గుర్తించాలి. దీనికి ఉపాధ్యాయుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది అని నేను ఆశిస్తున్నాను." అని అన్నారు. 
సంగ్రహం అనేది ఉపాధ్యాయులు రూపొందించిన పాఠ్య ప్రణాళిక సమాహారం.  ప్రతి ఒక్క తరగతి గదిలో అభ్యాసాన్ని మెరుగు పరచడానికి AIoTని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే అంశాన్ని  ఎలా ఉపయోగించవచ్చో 360-డిగ్రీల వీక్షణలో అందిస్తుంది. 
దీనికి ఉదాహరణ 9వ తరగతి సంబంధించిన పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన అంశాలను చెప్పవచ్చు. దీనిలో విద్యార్థులకు వెన్ను నొప్పికి కారణాలు విశ్లేషించడానికి, ఏఐ ద్వారా సమస్య పరిష్కారం చేసే అంశాన్ని చేర్చారు.దీనిలో భంగిమ తప్పుగా ఉన్నపుడు రెడ్ లైట్ వెలుగుతుంది.సరైన భంగిమ సమయంలో గ్రీన్ లైట్ మెరుస్తుంది. 

సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మరో పాఠ్య ప్రణాళికలో నేల తేమ స్థాయిని నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. తొలుత  శీతాకాలంలో మొక్కలు ఎందుకు చనిపోతాయి అన్న అంశాన్ని  అర్థం చేసుకోవడానికి ఒక విద్యార్థికి అవగాహన కల్పిస్తారు. ఆతర్వాత, సెన్సార్లు Arduino UNO వంటి టింకరింగ్ సాధనాలను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చి మొక్కలు చనిపోవడానికి దారి తీసిన పరిస్థితి  గుర్తించి  సమాచారాన్ని  ఉపయోగించడం ద్వారా మొక్క  ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి పర్యవేక్షించబడే ఏఐ  మోడల్‌ని అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తారు.
కార్యక్రమానికి  హాజరైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సహాయకులను  ఉద్దేశించి మాట్లాడిన  సిబిఎస్‌ఇ డైరెక్టర్ (ట్రైనింగ్స్, స్కిల్ ఎడ్యుకేషన్) డాక్టర్ బిశ్వజిత్ సాహా కొత్త పద్దతి అనేక  ప్రయోజనాలతో పాటు సాంప్రదాయ బోధనను డిజిటల్‌కి మార్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.  “పాఠ్య ప్రణాళికలతో ఏఐ,టింకరింగ్‌ అంశాలను  ఏకీకృతం చేయడం, వాటిని రోజువారీ బోధన-అభ్యాస కార్యకలాపాలలో భాగం చేయడం వల్ల విద్యార్థుల ఆలోచనా విధానం  డిజిటల్ విధానానికి అనుగుణంగా మారుతుంది. ఈ సంకలనం ఉపాధ్యాయులకు తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి  భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేస్తుంది' అని అన్నారు.
 ఇంటెల్ ,గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ గ్రూప్ ఆసియా పసిఫిక్  జపాన్, గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్వేతా ఖురానా మాట్లాడుతూ   భవిష్యత్ కోసం భారతదేశం  యువ జనాభాకు సాధికారత కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐఎం, నీతి ఆయోగ్ కలిసి  “AIoT ఇంటిగ్రేషన్ ఇన్ కరిక్యులమ్,' ను అమలు చేస్తున్నాయి. సీబీఐసీ, ఇంటెల్ ఇండియా సహకారంతో  ఏఐ , టింకరింగ్‌ని ఏకీకృతం చేయడానికి తగిన, నైపుణ్యాలు, ఆలోచనలు,పరికరాలతో   ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు అమలు జరుగుతాయి.  ఈ పద్దతి వల్ల  అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రభావవంతంగా, బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించవచ్చు అనే అంశంపై  విద్యార్థులు సమగ్ర అవగాహన పొందుతారు. ఈ పాఠ్య ప్రణాళికలను  పాఠశాలలతో  కలిసి నిర్వహించే కార్యక్రమాల ద్వారా అమలు జరుగుతాయి' అని అన్నారు.

న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌సిఆర్‌లోని పాఠశాలల నుండి సుమారు 500 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
కార్యక్రమం తర్వాత  ఎంపిక చేసిన  విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ AIoT ప్రాజెక్ట్‌లను ప్రదర్శించి, నీతి  ఆయోగ్ ప్రాంగణంలో సంస్థ సీఈవో  శ్రీ పరమేశ్వరన్ అయ్యర్‌తో మాట్లాడారు. 


 

*** 

 


(Release ID: 1893898) Visitor Counter : 238


Read this release in: Urdu , English , Hindi , Marathi