వ్యవసాయ మంత్రిత్వ శాఖ

కోట లో వేలాది మంది రైతులు పాల్గొన్న రెండు రోజుల వ్యవసాయ ప్రదర్శన ముగింపు


వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న యువత: లోక్ సబ్ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

రైతులను ముందుకు తీసుకెళ్లడమే దేశ ప్రగతి : కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్

Posted On: 25 JAN 2023 8:12PM by PIB Hyderabad

వేలాది మంది రైతుల సమక్షంలో రాజస్థాన్‌లోని కోటాలో రెండు రోజుల మెగా కృషి మహోత్సవ్ - ఎగ్జిబిషన్, శిక్షణ కార్యక్రమం బుధవారం నాడు ముగిసింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌ పాల్గొన్నారు. శ్రీ ఓం బిర్లా సంతోషం వ్యక్తం చేస్తూ, నేడు మన యువత మన దేశాన్ని వ్యవసాయ ఆవిష్కరణల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. శ్రీ తోమర్  దేశంలో అధునాతన వ్యవసాయం,  సుసంపన్నమైన రైతు అనే  నినాదాన్ని ప్రస్తావించారు.  భవిష్యత్తు రైతులదేనని అన్నారు. , రైతులతో పాటు నడవడమీ భారతదేశం ముందున్న ఏకైక మార్గం అని అన్నారు.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కృషి మహోత్సవ్‌లో లోక్‌సభ స్పీకర్ శ్రీ బిర్లా మాట్లాడుతూ హదోతి ప్రాంత రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారని, వారు నూతన సాంకేతికతను నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆధునిక వ్యవసాయాన్ని అవలంబించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి, ప్రగతిశీల రైతులందరికీ అధునాతన వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు, కొత్త సాంకేతికత మరియు అధునాతన యంత్రాలను అనుసరించేలా ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం ఈ ఉత్సవంలో జరిగిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు  రైతులు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించేందుకు సరైన దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు కొత్త సాంకేతికతను, కొత్త ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని చెప్పారు. 

గత ఎనిమిదిన్నరేళ్లలో రైతుల పట్ల అంకిత భావంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన అవిశ్రాంత కృషి కారణంగా , వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని శ్రీ ఓం బిర్లా అన్నారు. దేశవ్యాప్తంగా కిసాన్ రైల్‌ను నడుపుతున్న విషయాన్ని ఉదహరిస్తూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని, ఇది జరిగితే దేశం మరింత పురోగమిస్తుందని చెప్పారు. ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ గతంలో నీరు ఉన్నవారిదే వ్యవసాయం అనే వారని, కానీ నేడు సాంకేతికత కారణంగా ఆ సామెత మారిపోయిందని, - నేడు వ్యవసాయం జ్ఞానం ఉన్నవారికే చెందుతుందని అన్నారు. ఇటువంటి సంఘటనల ద్వారా, సాంకేతికతను నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, దానిని మన పొలాలకు వర్తింపజేయడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచవచ్చని తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలని, మన రైతులు సుభిక్షంగా ఉండాలని, అయన ఆకాక్షించారు. 2014లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ ప్రభుత్వం గ్రామీణ పేదలు-రైతుల ప్రభుత్వం అని చెప్పారని శ్రీ తోమర్ అన్నారు. గత 8 సంవత్సరాలలో, ప్రధాన మంత్రి శ్రీ మోదీ దేశ గ్రామాల రూపురేఖలను మార్చడానికి, పేదల జీవన ప్రమాణాలను పెంచడానికి,  రైతుల ఆదాయాన్ని పెంచడానికి, అలాగే భారతదేశ జెండాను ఎగురవేయడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదని చెప్పారు. 

 

 

శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మండల వ్యవసాయ కేంద్రాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వేలాది మంది రైతులు, స్టార్టప్‌ కార్మికులు, విస్తరణ కార్మికులు, ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రదర్శించారు. వ్యవసాయ ఇన్‌పుట్‌ల సరఫరాకు సంబంధించిన స్టాళ్లు, 75 స్టార్టప్‌ల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు, వీటిని పెద్ద సంఖ్యలో రైతులు సందర్శించారు. 

****  



(Release ID: 1893855) Visitor Counter : 126


Read this release in: English , Urdu