రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఇరు దేశాల మధ్య నిరంతర భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ నిలకడైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జపాన్ బృందంతో సమావేశమైన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
25 JAN 2023 7:26PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ బుధవారం న్యూఢిల్లీలో భారత్‌కు జపాన్ రాయబారి హిరోషి సుజుకి సమక్షంలో జపాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సలహాదారు, ముంబై- అహ్మదాబాద్ నేషనల్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు సంయుక్త కమిటీ సమావేశం కో-చైర్మన్ డాక్టర్ మసఫుమీ మోరీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఇరు పక్షాలూ కూడా రోడ్డు రవాణా, సర్వీస్ సంబంధిత రోడ్డు మౌలిక సదుపాయాల వ్యూహరచనపై అభిప్రాయాలను వెల్లడించాయి. అనంతరం సామర్ధ్య నిర్మాణం, నిలకడైన రవాణా అభివృద్ధి క్షేత్రంలో సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, ప్రత్యామ్నాయ, క్లీన్, హరిత ఇంధనం, ప్రయాణీకులు, సరుకు రవాణా కదలికలు లేదా రాకపోకల కోసం వినూత్న రవాణా సాంకేతికతల అభివృద్ధిపై చర్చించారు.
భారత ఈశాన్యప్రాంతంలో ఈశాన్య రహదారి నెట్‌వర్క్ అనుసంధానతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఇండియా- జపాన్ నిలకడైన అభివృద్ధి చొరవ గురించి ఉద్ఘాటించారు.
ఇరు దేశాలు పంచుకున్న విలువలు, వ్యూహాత్మక, ఆర్థిక అంశాలలో కలసిన ప్రయోజనాలన్న బలమైన పునాది ఆధారంగా రవాణా, వ్యూహరచనలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళకు ప్రభావవంతమైన పరిష్కారాలను కనుగొనేందుకు జపాన్‌తో సహకారాన్ని, భారత్ నిరంతర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశం మార్గాన్ని సుగమం చేసింది.
***
(Release ID: 1893799)
Visitor Counter : 174