జల శక్తి మంత్రిత్వ శాఖ
‘జీవితానికి మిల్లెట్‌లు: గంగా బేసిన్‌లో వాతావరణాన్ని తట్టుకోగల స్థానిక కమ్యూనిటీలను అభివృద్ధి చేయడం’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించిన నమామి గంగే .
Posted On:
24 JAN 2023 7:14PM by PIB Hyderabad
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎమ్‌సిజీ) మరియు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో 'మిల్లెట్స్ ఫర్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి): డెవలపింగ్ క్లైమేట్ రెసిలెంట్ లోకల్ కమ్యూనిటీస్' అనే అంశంపై ఒక రోజు జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించింది. విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు మరియు అభ్యాసకులతో సహా మిల్లెట్ సాగు మరియు మార్కెటింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన అనేక అంశాలతో పాల్గొన్న నిపుణులను సెమినార్ అనుసంధానించింది. గంగా బేసిన్‌లో సహజ వ్యవసాయం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి వివిధ వ్యూహాలపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఎం)గా ప్రకటించింది. మిల్లెట్‌ను ప్రోత్సహించేందుకు దేశంలో సామూహిక ఉద్యమానికి పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ..మిల్లెట్ ద్వారా పోషకాహార ప్రచారాన్ని ప్రోత్సహించాలని కోరారు.
- స్థానిక కమ్యూనిటీలలో మిల్లెట్ ఆధారిత సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా సెమినార్ దిశానిర్దేశం చేసింది
- డీజీ,ఎన్‌ఎంసీజీ గంగా ప్రహారీలను నమామి గంగే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌లుగా పిలుస్తుంది
- ఎక్కువ మంది రైతులు మిల్లెట్ల సాగు ద్వారా డబ్బు ఆర్జించే సవాలును పరిష్కరించాలి- డీజీ,ఎన్‌ఎంసీజీ
- మనం మన దృక్పథాన్ని మార్చుకోవాలి మరియు మన స్వదేశీ సాంప్రదాయ జ్ఞానంలో స్థిరమైన జీవనానికి మారాలి-సీఈఓ,ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
గంగా పరీవాహక ప్రాంతంలో స్థిరమైన అభివృద్ధి మరియు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి పరివర్తన సాధనంగా మిల్లెట్‌ను స్వీకరించడానికి చర్చలను ప్రారంభించడం మరియు వ్యూహాలను రూపొందించడం ఈ సెమినార్ లక్ష్యం. సెమినార్ స్థానిక కమ్యూనిటీలలో మిల్లెట్ ఆధారిత సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా దిశానిర్దేశం చేసింది. ఇది స్థానిక ఆదాయాలను పెంపొందించడానికి మరియు లైఫ్ లక్ష్యాన్ని సాధించడానికి మిల్లెట్ ఆధారిత ప్రత్యామ్నాయ జీవనోపాధికి నైపుణ్యాలను పెంపొందించడంపై అవగాహనను కూడా ఇచ్చింది. అంతేకాకుండా గ్రాస్ రూట్ స్థాయిలలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఏకీకృతం చేయడం ద్వారా లింగ సమానత్వం మరియు సామాజిక చేరిక (జీఈఎస్‌ఐ) అమలు చేయబడుతుందని సెమినార్ విజయవంతంగా నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఎం)గా ప్రకటించింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023ని దృష్టిలో ఉంచుకుని మిల్లెట్‌ను ప్రోత్సహించేందుకు దేశంలో సామూహిక ఉద్యమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఎన్‌ఎంసిజీ డీజీ శ్రీ జి. అశోక్ కుమార్ గంగా పునరుజ్జీవనానికి గంగా ప్రహరీలు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి నమామి గంగను 'సహజ ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి టాప్ 10 ప్రపంచ పునరుద్ధరణ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా' గుర్తించడాన్ని ప్రస్తావిస్తూ గంగా ప్రహారీలను సాధించినందుకు ఘనత పొందారు. మరియు వారిని నమామి గంగే కార్యక్రమానికి 'బ్రాండ్ అంబాసిడర్‌లు' అని పిలిచారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన గ్రామాలలో నివసించే ప్రజలు తీసుకునే ప్రధాన ఆహారంలో అంతర్భాగమైన మిల్లెట్ యొక్క ప్రాముఖ్యతను శ్రీ కుమార్ నొక్కి చెప్పారు. “పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుసరిస్తున్న కారణంగా మన స్వంత దేశపు సాంప్రదాయ జ్ఞానాన్ని మనం మరచిపోయాము. ఇది మన మూలాల్లోకి తిరిగి వెళ్లాల్సిన సమయం ”అని అన్నారాయన. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ అమృత్ కాల్ యొక్క ప్రాణ్ - అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యం, వలసవాద మనస్తత్వ జాడను వదిలించుకోవడం, ఐక్యత మరియు కర్తవ్య భావం గురించి గర్వించాలని చెప్పారు.
"మనం మిల్లెట్ల సాగును డబ్బును ఆర్జించే మార్గంగా మార్చాలి. తద్వారా ఎక్కువ మంది రైతులు దీనికి మారతారు. అందులో భాగంగా 'మిల్లెట్ క్యాంపెయిన్'ని రైతులకు లాభసాటిగా మార్చాలి' అని శ్రీ కుమార్ అన్నారు "రాబోయే కొన్నేళ్లలో గంగా బేసిన్‌ను మిల్లెట్ బేసిన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తాం. తక్కువ నీటి వినియోగం, ఆర్థికంగా లాభదాయకమైన మరియు పర్యావరణ అనుకూలమైన పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించడానికి జాతీయ నీటి మిషన్ ద్వారా 2019లో ప్రారంభించబడిన ‘సాహి ఫసల్’ ప్రచారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీఈఓ శ్రీ గంజి కమల వర్ధనరావు భారతదేశంలో మారుతున్న ప్రజల వినియోగ విధానాలను నొక్కి చెప్పారు. మనం తినే ఆహారం యొక్క పోషక విలువపై ఆధారపడిన ఆహారపు అలవాట్లకు పిలుపునిచ్చారు. "మన దృక్పథాన్ని మార్చుకోవాలి మరియు మన స్వంత దేశం యొక్క సాంప్రదాయ జ్ఞానంలో పాతుకుపోయిన స్థిరమైన జీవనానికి మారాలి" అని అన్నారాయన.
మన గ్రహం మీద 2800 రకాల్లో లభ్యమయ్యే మిల్లెట్‌లను సూపర్‌ఫుడ్‌గా ఫుడ్ సైంటిస్ట్ డాక్టర్ ఖాదర్ వల్లి పేర్కొన్నారు. పుష్కలమైన ఫైబర్ కంటెంట్ కారణంగా మన రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుందని, స్థిరమైన అభివృద్ధికి మిల్లెట్ ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు. “మిల్లెట్స్ మన సాంప్రదాయ ఆహారం, ఇది అవసరమైన పోషకాలకు మూలం. భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఇతర ధాన్యాలు ఒక విధంగా లేదా మరొక విధంగా విధించబడతాయి, ”అని ఆయన అన్నారు. “మిల్లెట్లు ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువ నీటిని తీసుకుంటాయి కాబట్టి నీటి సంరక్షణ కోణం నుండి కూడా ముఖ్యమైనవి.” అన్నారు. భారతదేశం పెద్ద ఎత్తున మిల్లెట్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని అతను తెలిపారు. సాంప్రదాయ ఆహారపు అలవాట్లకు తిరిగి వెళ్లాలని ఆయన అన్నారు.
సెమినార్ ప్రారంభ సెషన్‌లో ఎన్‌ఎంసిజి డిజి శ్రీ జి. అశోక్ కుమార్, ఫుడ్ సైంటిస్ట్ డాక్టర్ ఖాదర్ వల్లి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సిఇఒ శ్రీ గంజి కమలా వి.రావు పాల్గొన్నారు.
***
(Release ID: 1893477)
Visitor Counter : 139