ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధార్ ప్రామాణీకరణను నిర్వహించడానికి ముందు నివాసితుల సమాచార సమ్మతి పొందండి


ఎంటిటీలను అభ్యర్థించిన యుఐడీఏఐ

Posted On: 23 JAN 2023 3:50PM by PIB Hyderabad

ఆధార్ ప్రామాణీకరణలను నిర్వహించే ముందు ఎంటిటీలు నివాసితుల తన సమాచార సమ్మతిని కాగితంపై లేదా ఎలక్ట్రానిక్‌గా పొందవలసి ఉంటుంది. దీనికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) రిక్వెస్టింగ్ ఎంటిటీలకు (ఆర్ఈలకు) కొత్త మార్గదర్శకాలలో వెలుగులోకి తెచ్చింది. నివాసితులు డేటా రకం మరియు ఆధార్ ప్రామాణీకరణల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడానికి యుఐడీఏఐ ఆన్‌లైన్ ప్రామాణీకరణలను నిర్వహించేలా చూసుకోవాలని  ఆర్ఈలనుకోరింది,  ఆర్ఈలు తీసుకున్న సమ్మతితో సహా ప్రామాణీకరణ లావాదేవీల లాగ్‌లు ఆధార్ నిబంధనలలో నిర్దేశించిన కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంచబడతాయని సంస్థ నొక్కి చెప్పింది. పేర్కొన్న కాల వ్యవధి ముగిసిన తర్వాత అటువంటి లాగ్‌ల ప్రక్షాళన ఆధార్ చట్టం మరియు దాని నిబంధనల ప్రకారం జరుగుతుంది. నివాసితులకు ఆధార్ ప్రమాణీకరణ సేవలను అందించడంలో ఆర్ఈలు నిమగ్నమై ఉన్నాయి. ప్రామాణీకరణ ప్రయోజనం కోసం సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీకి ఆధార్ నంబర్ మరియు డెమోగ్రాఫిక్/ బయోమెట్రిక్ ఓటీపీ సమాచారాన్ని సమర్పించడానికి ఆర్ఈలు బాధ్యత వహిస్తాయి. RE లు నివాసితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని మరియు ప్రామాణీకరణ లావాదేవీల కోసం ఉపయోగించబడుతున్న ఆధార్ నంబర్‌ల భద్రత మరియు గోప్యత గురించి వారికి హామీ ఇవ్వాలని యుఐడీఏఐ ప్రధానంగా తెలిపింది. నివాసితులచే అనుమానిత, లేదా ఏదైనా ప్రామాణీకరణ ఆపరేటర్ ద్వారా ఏదైనా రాజీ లేదా మోసం వంటి ధ్రువీకరణలకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద కార్యాచరణ గురించి సమాచారం అందితే వెంటనే యుఐడీఏఐ కి నివేదించాలని అథారిటీ ఆర్ఈ లను కోరింది. ఆర్ఈలు సాధారణంగా ఆధార్ నంబర్‌లోని మొదటి 8 అంకెలను మూసి వేయకంఉడా చేయకుండా లేదా సవరించకుండా భౌతిక లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఆధార్‌లను నిల్వ చేయకూడదు.  యుఐడీఏఐ నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే ఆధార్ నంబర్‌ను నిల్వ చేయడానికి ఆర్ఈలకు మార్గనిర్దేశం చేయడమైంది.  నివాసితుల కోసం సమర్థవంతమైన ఫిర్యాదుల నిర్వహణ విధానాలను అందించాలని, చట్టం మరియు నిబంధనల ప్రకారం అవసరమైన ఏదైనా భద్రతా ఆడిట్ కోసం యుఐడీఏఐ మరియు దాని ద్వారా నియమించబడిన ఇతర ఏజెన్సీలతో సహకరించాలని ఆర్ఈ లను కోరింది.

***


(Release ID: 1893158) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Hindi