భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సమ్మిట్ ఫర్ డెమోక్రసీకి కొనసాగింపుగా 'టెక్నాలజీ వినియోగం -ఎన్నికల సమగ్రత' అనే అంశంపై ఇసిఐ రెండవ అంతర్జాతీయ సదస్సు


భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నికలకు సంబంధించిన నకిలీ కథనాల పై సిఇసి అప్రమత్తం

సోషల్ మీడియా వేదికలు నిగూఢ నకిలీ కథనాలను ముందస్తుగా గుర్తించడానికి అల్గారిథమ్ పవర్ ను, ఎ ఐ ని ఉపయోగించాలి

ఈసీఐ నేతృత్వంలో 16 ఈఎంబీలు/దేశాలు పాల్గొన్న 'కోహోర్ట్ ఆన్ ఎలక్షన్ ఇంటిగ్రిటీ'; సదస్సు కు 9 ఈఎంబీలు, ఐఎఫ్ ఈఎస్ ల అధిపతులు/డిప్యూటీ హెడ్ లు హాజరు.

ఇసిఐ తో కలసి ఎన్నికల సమగ్రతపై కోహోర్ట్ కు మారిషస్, గ్రీస్ ,అంతర్జాతీయ సంస్థ ఐఎఫ్ఇఎస్ సహ-నాయకత్వం

Posted On: 23 JAN 2023 4:17PM by PIB Hyderabad

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ అనూప్ చంద్ర పాండే ,,శ్రీ అరుణ్ గోయల్ తో కలిసి 'సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎన్నికల సమగ్రత' అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఈ రోజు ప్రారంభించారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించే మూడు సదస్సుల్లో రెండోది అయిన ఈ సదస్సు ఈసీఐ నేతృత్వంలోని కోహోర్ట్ ఆన్ ఎలక్షన్ ఇంటిగ్రిటీ కింద న్యూఢిల్లీలో జరుగుతోంది. తొమ్మిది ఈఎంబీల అధిపతులు/డిప్యూటీ హెడ్స్ లేదా ఎలక్షన్ అథారిటీలతో సహా 16 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి.

 

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ సంస్థల ముందున్న సవాళ్లపై సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈఎంబీల పనితీరుతో సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంపై కొత్త మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో లోతైన ఫేక్ కథనాల ఆందోళనకర ధోరణి సాధారణ లక్షణంగా మారిందని, ఇక్కడ విచ్ఛిన్నకర శక్తులు ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి నిగూఢ నకిలీలను "వాస్తవం" గా పదేపదే ప్రదర్శించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తాయని ఆయన అన్నారు.గత కాన్ఫరెన్స్ లో తన కీలకోపన్యాసాన్ని గుర్తు చేసుకుంటూ, సోషల్ మీడియా మధ్యవర్తులు తమ అల్గారిథమ్ పవర్ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, నకిలీ కథనాలను చురుకుగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని, ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు అత్యంత పారదర్శకం గా ఉన్న భారత్ వంటి అధికార పరిధి లో నకిలీ కథనాలు చెళ్ళబోవని శ్రీ కుమార్ స్పష్టం చేశారు.

 

నకిలీ కథనాలకు సమానమైన ప్రాముఖ్యత కలిగిన అధికారికంగా ధృవీకరించిన వాస్తవాలను కనీసం చూపించడానికి ప్లాట్ఫామ్స్ సెర్చ్ ఫలితాలలో సమాన ప్రాధాన్యం లేకపోవడం పై శ్రీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

 

నిగూఢ నకిలీ కథనాలను చురుగ్గా గుర్తించే బాధ్యతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచడానికి సి ఇ సి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సారూప్యతను ఉపయోగించింది. నేరాలను తమకు నివేదించకపోతే చర్యలు తీసుకోలేమని బోమని ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు చెబితే ఊహించడం కష్టమని,  ఇంటెలిజెన్స్ నివారణ వారి బాధ్యత కాదని అన్నారు.

 

ప్రారంభోత్సవంలో సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ ప్రసంగించారు. ఇక్కడ చూడండి: https://youtu.be/OX7SaLevQfw

 

సిఇసీ రాజీవ్ కుమార్ తన ప్రారంభోపన్యాసంలో, ఎన్నికలలో సమగ్రత పారదర్శకతను నిర్ధారించడం,తద్వారా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ పట్ల నమ్మకాన్ని మరింత పెంపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కీలకంగా మారిందని చెప్పారు. ఏ ఇ ఎమ్ బి విజయం అయినా మూడు విస్తృత విభాగాలు -ఓటర్లకు నమోదును సులభతరం చేయడం, రాజకీయ పార్టీలు,  అభ్యర్థులకు సౌలభ్యం , ఎన్నికల నిర్వహణ ,లాజిస్టిక్స్ / భద్రత లో తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పై ఆధారపడి ఉంటుంది.

 

ఈ సందర్భంగా సీఈసీ శ్రీ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల కోసం

సీ విజిల్, సాక్షం యాప్, బ్యాటరీతో నడిచే నాన్ నెట్వర్క్ ఈవీఎంలను పది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించడం ద్వారా ఓటర్లకు సాధికారత లభించిందని, ఎన్నికల తర్వాత సత్వర, విశ్వసనీయమైన ఫలితాలు వచ్చాయని వివరించారు.

 

‘టెక్నాలజీ ఫర్ ఎలక్షన్ అడ్మినిస్ట్రేషన్' అనే అంశంపై జరిగిన తొలి సెషన్ కు భారత ఎన్నికల కమిషనర్ శ్రీ అరుణ్ గోయల్, మారిషస్ ఎలక్టోరల్ కమిషనర్ శ్రీ.  మహ్మద్ ఇర్ఫాన్ అబ్దుల్ రెహ్మాన్ సహ అధ్యక్షత వహించారు. ఈ సెషన్ లో ఆర్మేనియా, ఆస్ట్రేలియా, క్రొయేషియా, జార్జియా ఎన్నికల అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా ఈసీ అరుణ్ గోయల్ మాట్లాడుతూ ,ప్రాథమిక ప్రక్రియలను ఆటోమేట్ చేయడం నుంచి అధునాతన ఎలక్టోరల్ డేటాబేస్ నిర్వహణ వరకు ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనివార్యంగా మారిందన్నారు.

94.5 కోట్ల మంది ఓటర్ల డేటాబేస్ నిర్వహణకు,పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ వంటి ఎన్నికల సంబంధిత నిర్ణయాలను సులభతరం చేయడానికి ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న వివిధ సాంకేతిక కార్యక్రమాలను శ్రీ గోయెల్ వివరించారు. రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు సౌలభ్యం కల్పించే సాంకేతిక పరిజ్ఞానం, ఓటర్ల సాధికారత కోసం సీవిజిల్ వంటి యాప్ ల గురించి ప్రస్తావించారు.

 

ఐఐఐ డీఇఎం డీజీ, సీనియర్ డీఈసీ ధర్మేంద్ర శర్మ రెండు రోజుల సదస్సుకు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికారు.మారిషస్ ఎలక్టోరల్ కమిషనర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అబ్దూల్ రెహమాన్, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ , సి ఇ ఒ ఆంథోనీ బాన్ బరీ, జార్జియా డిప్యూటీ చైర్ పర్సన్,  సి ఇ సి శ్రీ గియోర్గి షరాబిడ్జ్, అంగోలా, ఆర్మేనియా, ఆస్ట్రేలియా, చిలీ, క్రొయేషియా, డొమినికా, ఫిజీ, జార్జియా, ఇండోనేషియా, కిరిబాటి, మారిషస్, నేపాల్, పరాగ్వే, పెరూ, ఫిలిప్పీన్స్, సురినామ్ వంటి అంతర్జాతీయ ఐడీఏ, ఈఎంబీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

 

సదస్సులో ఈసీఐ రూపొందించిన 'ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగంలో గ్లోబల్ ఇనిషియేటివ్స్' బుక్ లెట్ ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈఎంబీల అత్యుత్తమ సాంకేతిక విధానాల సమాహారమే ఈ పుస్తకం. ఇ.ఎం.బి.లకు చెందిన అధికారులకు శిక్షణ ,సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఐ.ఐ.ఐ.డి.ఇ.ఎం అభివృద్ధి చేసిన అంతర్జాతీయ శిక్షణా మాడ్యూల్స్ ను కూడా విడుదల చేశారు.

 

 'సమ్మిళిత ఎన్నికల కోసం టెక్నాలజీ సొల్యూషన్స్' అనే అంశంపై రెండో సెషన్ ku   ఐఎఫ్ఇఎస్ ప్రెసిడెంట్ అండ్

సి ఇ ఒ అధ్యక్షత వహించారు. ఈ సెషన్ లో ఫిలిప్పీన్స్, అంగోలా నుండి ప్రజెంటేషన్ లు , ఇంటర్నేషనల్ ఐడియా నుండి ప్రతినిధి ఉన్నారు.

 

‘టెక్నాలజీ యాజ్ ఏ ఎనేబుల్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ స్పేస్' అనే అంశంపై రేపు జరిగే మూడో సెషన్ కు జార్జియా డిప్యూటీ ఛైర్ పర్సన్ , సీఈసీ, పరాగ్వేలోని ట్రిబ్యునల్ సుపీరియర్ డి జస్టిసియా ఎలక్టోరల్ వైస్ ప్రెసిడెంట్/మినిస్టర్ సహ అధ్యక్షత వహిస్తారు. సెషన్ లో ఇండోనేషియా, 

ఐ ఎఫ్ ఇ ఎస్ నుండి ప్రజంటేషన్ లు ఉంటాయి.

 

జనవరి 24, 2023 న ముగింపు సెషన్ కు భారత ఎన్నికల కమిషనర్ శ్రీ అనూప్ చంద్ర పాండే అధ్యక్షత వహిస్తారు.

 

మరిన్ని వివరాలకు @ECISVEEP ట్విట్టర్ థ్రెడ్ లో అప్ డేట్స్ చూడండి.

 

కర్టెన్ రైజర్ లింక్ : tinyurl.com/yc2pcksf  

https://eci.gov.in/ic/ic-2023/

 

****


(Release ID: 1893154) Visitor Counter : 188


Read this release in: English , Urdu , Hindi